పోటీ నుండి బైడెన్ ఉపసంహరణ, ట్రంప్ కు తలనొప్పి!

అమెరికా అద్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నట్లు జోసెఫ్ బైడెన్ ప్రకటించాడు. ఎక్స్ (ట్విట్టర్) ఈ మేరకు బైడేన్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. అదే లేఖలో ఆయన తన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి మద్దతు (ఎండార్స్ మెంట్) ప్రకటించాడు. అధ్యక్షుడుగా ఉండగా బైడెన్ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఆయన బహిరంగ ప్రవర్తన ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. అనేకసార్లు తన సొంత సిబ్బంది పేర్లు మర్చిపోవటం, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా…

గవర్నర్ అత్యాచారం: పోలీసు విచారణ నుండి ఎస్కేప్!

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పైన ఆయన సిబ్బంది లోని మహిళ ఒకరు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసుల విచారణ నుండి తప్పించుకునేందుకు ఘనత వహించిన ఆ గవర్నర్ సిగ్గు లేకుండా తన గవర్నర్ గిరీని అడ్డం తెచ్చుకుంటున్నాడు. గవర్నర్ కార్యాలయంలో పని చేసే సిబ్బందిలోని మహిళ తనపై లైంగిక అత్యాచార ఆరోపణ చేసిన తర్వాత, ఏ మాత్రం ఆత్మ గౌరవం ఉన్నా, తాను నిర్వహిస్తున్న పదవి పట్ల ఇసుమంతైనా బాధ్యత ఉన్నా వెంటనే…

మీరు హిందువు కాదు -మోడీతో రాహుల్

జులై 1 తేదీన ప్రతిపక్ష నేత మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. “తమను తాము హిందువులుగా చెప్పుకునే వాళ్ళు నిరంతరం హింస, విద్వేషాలకు పాల్పడుతున్నారు” అని ఆరోపించాడు. ఇదే అవకాశంగా దొరకబుచ్చుకున్న ప్రధాని మోడీ రాహుల్ మాటలను వక్రీకరిస్తూ “హిందూ సమాజం మొత్తాన్ని హింసాత్మకం గా వర్ణించడం చాలా తీవ్రమైన విషయం” అని విమర్శించాడు. ప్రధాని ఆరోపణలకు బదులిస్తూ రాహుల్ గాంధీ “నేను అన్నది బిజేపి పార్టీని. మీ పార్టీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ మాత్రమే…

ఇయు ఎన్నికల్లో మేకరాన్ బోల్తా, ఫ్రాన్స్ మధ్యంతర ఎన్నికలు!

National Rally party workers’ jubilation యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల్లో బొక్క బోర్లా పడడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేకరాన్ దేశంలో మధ్యంతర ఎన్నికలు ప్రకటించాడు. జూన్ 6 తేదీ నుండి 9 తేదీ వరకు యూరోపియన్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఫ్రాన్స్ లో అతి మిత వాద పార్టీగా పేరు పొందిన లీ పెన్ నాయకత్వం లోని నేషనల్ ర్యాలీ పార్టీ ఫ్రాన్స్ నుండి అత్యధిక ఓట్లు సంపాదించడంతో మేకరాన్ అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు ప్రకటించాడు.…

ఎలక్షన్ కమిషన్ కప్పదాట్లు, జనస్వామ్యానికి అగచాట్లు!

ముఖ్యంగా బి.జే.పి అగ్ర నేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా లతో పాటు ఇతర చోటా మోటా నాయకులు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ సాగించిన ప్రసంగాల పట్ల, వాటిపై వచ్చిన ఫిర్యాదుల పట్ల ఎన్నికల కమిషన్ “కత్తిని గాయాన్ని ఒకే గాటన కట్టినట్లు” గా స్పందించింది.

ఆరు నెలల్లో అమరావతి పూర్తి కావాలి -హై కోర్టు

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ఆంద్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాజధానిని ఎలా వీలుంటే అలా ఒక చోటి నుండి మరొక చోటికి మార్చే హాక్కు గాని, లేదా ప్రభుత్వ అంగాలను చిత్తం వచ్చిన రీతిలో ముక్కలు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని హై కోర్టు తీర్పు చెప్పింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు…

రష్యా మిలటరీ ఆపరేషన్ ఆపాలి -ఐరాస

రష్యా ఉక్రెయిన్ లో సాగిస్తున్న మిలట్రీ ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. 193 సభ్య దేశాలున్న ఐక్య రాజ్య సమితి (యూ‌ఎన్‌ఓ) జనరల్ అసెంబ్లీ బుధవారం జనరల్  అసెంబ్లీ సమావేశం జరిపింది. ఉక్రెయిన్ అంశం ఎజెండాగా అత్యవసర జనరల్ అసెంబ్లీ సమావేశం జరపాలా లేదా అన్న అంశంపై ఐరాస భద్రతా సమితి నిన్న ఓటింగ్ నిర్వహించింది. 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 10 తాత్కాలిక సభ్య దేశాలు ఓటింగ్ లో…

ఆఫ్ఘన్ పై పట్టు: రేసులో అమెరికా ముందంజ (ఇప్పటికి!)

తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రొయ్యలు ఒంటికి మంచిది కాదని ఊరంతా నీతులు చెప్పి రొయ్యల బుట్ట తానే మాయం చేసేసి లొట్టలు వేస్తూ భుజిస్తుంది. ఈ సంగతి మరోసారి రుజువు చేసుకుంది అమెరికా. ఎవరికీ చెప్పా పెట్టకుండా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా తాలిబాన్ కు నిధులు అందించే మార్గాన్ని అమెరికా తెరిచి పట్టుకుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్ధిక మూలాలు తన చేతుల్లో…

ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు

ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పి‌జి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి…

మోడి అహంకారి! -మేఘాలయ గవర్నర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అహంకారి అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ అభివర్ణించారు. రైతుల సమస్య గురించి చర్చించడానికి వెళితే ఇద్దరం వాదులాడుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. (ఇండియన్ ఎక్స్^ప్రెస్, జనవరి 3, 2022) బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అదురు బెదురు లేకుండా విమర్శించే బి‌జే‌పి నేతల్లో సత్య పాల్ మాలిక్ ఒకరు. రెండు అధికార కేంద్రాలు (నరేంద్ర మోడి, ఆర్‌ఎస్‌ఎస్) ఉన్న చోట…

చట్టం అమలు: మెజారిటీలకి ఒకటి, మైనారిటీలకి ఒకటి

మునవర్ ఫరూకి ఒక స్టాండప్ కమెడియన్. జనాన్ని నవ్వించడం ఈ యువ కళాకారుడి వృత్తి, ప్రవృత్తి. జనవరి 1, 2021 తేదీ ఇండోర్ (మధ్య ప్రదేశ్) పట్టణంలో అతను ప్రదర్శన ఇవ్వబోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 295 ఏ కింద కేసు పెట్టారు. నేరం ఏమిటని విలేఖరులు అడిగితే “తన కామెడీ షోలో ఇతరుల మత భావాలను నమ్మకాలను అవమానపరిచాడు” జిల్లా ఎస్‌పి అని చెప్పాడు. “మునవర్ ఆరోజు అసలు షో మొదలు పెట్టకుండానే అరెస్ట్…

స్వతంత్రం రెచ్చగొడితే తీవ్ర చర్యలు తప్పవు! -తైవాన్ తో చైనా

చైనా మరోసారి తైవాన్ ను తీవ్రంగా హెచ్చరించింది. ‘స్వతంత్రం’ పేరుతో జనాన్ని రెచ్చగొడుతూ ఉంటే తీవ్ర చర్యలు తప్పవు, అని చైనా ప్రభుత్వం తైవాన్ ను హెచ్చరించింది. “స్వతంత్రం ప్రకటించుకునే వైపుగా ఏ మాత్రం అడుగు వేసినా చర్యలు తప్పవు” అని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ప్రతినిధి మా చియావో గువాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించాడు. తైవాన్ తో శాంతియుతంగా ఐక్యం కావడానికి కృషి చేసేందుకు చైనా దేశం సిద్ధంగా ఉందనీ అయితే స్వతంత్రత ప్రకటించుకునే…

హిందూ దేశంగా మార్చుతామని ప్రతిజ్ఞ, పోలీసులకు ఫిర్యాదు

హిందూత్వ గణాలు దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ లోని గోవింద్ పురి మెట్రో స్టేషన్ సమీపంలో ‘హిందూ యువ వాహిని’ అనే సంస్ధ ఆద్వర్యంలో జరిగిన సదస్సు మరో విడత పరమత విద్వేష ప్రసంగాలకు, ప్రతిజ్ఞలకు వేదికగా నిలిచింది. ఈసారి భారత దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేందుకు చంపడానికి, చావడానికి కూడా సిద్ధమంటూ సభికుల చేత నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ముస్లింలు, క్రైస్తవులపై జీనోసైడ్ (సామూహిక హత్యాకాండ) జరపాలని, మాజీ ప్రధాని మన్మోహన్…

ప్రియాంక పిల్లల ఇన్స్టా హ్యాకింగ్ చేసిన ప్రభుత్వం?

ప్రియాంక గాంధీ వాద్ర ఈ రోజు (డిసెంబర్ 21, 2021) ఒక నమ్మశక్యం కానీ విషయాన్ని వెల్లడి చేశారు. ఆమె పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందట! ఇది నిజంగా నిజమేనా?! ఇది నిజమే అయితే బహుశా అంతకంటే దరిద్రమైన ఆరోపణ మోడి ప్రభుత్వం ఇక ఎదుర్కోబోదేమో! ప్రియాంక గాంధీకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు రైహన్ వాద్రా, వయసు 20 సం.లు. అమ్మాయి పేరు మిరాయ వాద్రా, వయసు…

త్వరలో మోడి, జిన్^పింగ్, పుతిన్ ల సమావేశం?

బ్రిక్స్ కూటమిలో ప్రధాన రాజ్యాలైన చైనా, రష్యా, ఇండియా దేశాల అధినేతలు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. వ్లాదిమిర్ పుతిన్, ఛి జిన్^పింగ్ ల మధ్య ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇరువురు నేతలు త్రైపాక్షిక సమావేశం జరపాలన్న అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్ధ టాస్ (TASS) తెలియజేసింది. పుతిన్, ఛి ల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తాలూకు…