అమెరికా: విజితులు, పరాజితులు -ఫోటోలు

డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అనేక ఆరోపణలు ఆయనపైన గుప్పించారు. పాత చరిత్రలు తవ్వి తీశారు. ఎక్కడా లేని బురదా తెచ్చి జల్లారు. ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆయనకు వ్యతిరేకంగా చెప్పించారు. అయినా ట్రంప్ గెలుపు ఆగలేదు. మొత్తం వాల్ స్ట్రీట్ అంతా కట్టగట్టుకుని హిల్లరీ క్లింటన్ వెనక నిలబడ్డా ఆమెను గెలిపించలేకపోయింది. ఆమె వాల్ స్ట్రీట్ మనిషి అన్న నిజమే అమెరికా శ్రామిక ప్రజలను ఆమెకు వ్యతిరేకంగా నిలబెట్టింది.…

అమెరికా ఆయుధ కొనుగోళ్లు రద్దు -ఫిలిప్పైన్స్

  ఇటీవల అధికారం చేపట్టినప్పటి నుండి అమెరికాపైనా అధ్యక్షుడు ఒబామా పైనా బహిరంగానే విరుచుకుపడుతున్న ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టె తాజాగా మరో సారి విరుచుకు పడ్డాడు. ఇప్పటి వరకు దూషణలకు, సవాళ్లకు పరిమితమైన ఆయన ఇప్పుడు ఏకంగా చర్యల లోకి దిగినట్లు కనిపిస్తున్నది.  ఫిలిప్పైన్స్ పోలీసుల వినియోగం కోసం అమెరికా నుండి భారీ మొత్తంలో రైఫిల్స్ కొనటానికి గతంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన బెట్టి మరో దేశం నుండి రైఫిల్స్ కొనుగోలు చేస్తామని డ్యుటెర్టె…

బషర్ ఇంటర్వ్యూ: ఇలాంటి నేత మనకి లేడు! -వీడియో

సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ని ఒక రాక్షసుడిగా చిత్రీకరించడానికి అమెరికా, పశ్చిమ రాజ్యాలు చెప్పని అబద్ధం లేదు; చేయని కృషి లేదు; తిట్టని తిట్టు లేదు. అదంతా ఒట్టి అబద్ధం అని ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్ధం అవుతుంది. అంతే కాదు, ఇలాంటి దేశ భక్తియుత నాయకుడు భారత దేశంలోని రాజకీయ పార్టీల్లో ఒక్కరంటే ఒక్కరూ లేరే అని తప్పనిసరిగా అనిపిస్తుంది. సిరియా కిరాయి తిరుగుబాటు క్రమంలో సిరియా అధ్యక్షుడిని నేరుగా చంపేందుకే దాడి జరిగింది.…

నాటోతో తలపడుతున్న టర్కీ ప్రధాని?

  టర్కీలో జులై 15 నాటి మిలట్రీ కుట్రలో పాత్ర పోషించిన వారి పైన లేదా పాత్ర పోషించారని అనుమానించబడుతున్న వారి పైన విరుచుకుపడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కుట్రలో పాల్గొన్నారన్న అనుమానంతో 1700 మంది వరకు పోలీసులను కొద్దీ రోజుల క్రితం సస్పెండ్ చేయడమో లేదా డిస్మిస్ చేయడమో చేసిన టర్కీ ప్రధాని రెసిపీ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా నాటో దేశాలలోని రాయబారులను కూడా టార్గెట్ చేసుకున్నాడు. నాటో సభ్య దేశాలలో మిలట్రీ కూటమి రాయబారులుగా…

యెమెన్ లో సౌదీ యుద్ధాన్ని ఆపండి! -ద హిందూ..

[Stop the Saudis war in Yemen సంపాదకీయానికి (అక్టోబర్ 13, 2016) యధాతధ అనువాదం.] *** యెమెన్ లో 18 నెలలుగా సౌదీ అరేబియా సాగిస్తున్న మిలటరీ ఆపరేషన్, జనావాస కేంద్రాలపై దాడులతోనూ, మూకుమ్మడి చావుల తోనూ నిండిపోయింది. ఇటీవలి ప్రమాణాల ప్రకారం చూసినా కూడా సనాలో సంతాపం కోసం జనం చేరిన హాలుపై అక్టోబర్ 8 తేదీన, 140 మంది మరణానికీ 500 కు పైగా గాయపడేందుకూ -వారిలో అనేకమంది పౌరులు- దారి తీసేట్లుగా…

యెమెన్ పై అమెరికా మిసైల్ దాడి, ఆత్మరక్షణ కోసం(ట)!

  ఎర్ర సముద్రంలో తిష్ట వేసిన మూడు అమెరికా యుద్ధ నౌకలు ఈ రోజు (గురువారం, అక్టోబర్ 13) యెమెన్ పైన క్షిపణి దాడి చేశాయి. యెమెన్ కు చెందిన రాడార్ నిర్వహణ స్ధలాలను లక్ష్యం చేసుకుని అమెరికా మిలట్రీ ఈ దాడులు చేసింది దాడిలో మూడు రాడార్ నిర్వహణ వసతులు ధ్వంసం అయ్యాయని అమెరికా సగర్వంగా చాటింది.  అమెరికా దాడులకు కారణం?  ఆత్మ రక్షణ! యెమెన్ చాలా చిన్న దేశం. అత్యంత పేద దేశం. సహజ…

విభేదాల దేశాలకు నాయకత్వం -ద హిందూ..

[Leading the divided nations, ద ఎడిటోరియల్ – అక్టోబర్ 10,2016- కు యధాతధ అనువాదం.] ********* ఆంటోనియో గుతెయర్ ను సెక్రటరీ జనరల్ పదవికి నామినేట్ చేయడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కనబరచిన విశాల ఏకాభిప్రాయం, ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలతో తలపడటంలో మరింత పటిష్టమైన ఐరాస అవతరించే దిశలో శుభప్రదమైన ఆరంభం. గత వారం భద్రతా సమితిలోని 15 సభ్య దేశాలలో 13 -వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలతో…

యెమెన్ నెత్తుటి చెరువు అమెరికా బాంబుల ఫలమే!

చనిపోయిన తమ నేత అంతిమ యాత్ర నిమిత్తం ఒక హాలులో గుమి కూడిన ప్రజలపై సౌదీ అరేబియా జరిపిన వైమానిక బాంబు దాడిలో 140 నుండి 200 వరకు మరణించిన సంగతి విదితమే. “నెత్తుటి చెరువు’ గా అభివర్ణించబడుతున్న ఈ మారణకాండలో సౌదీ మిలట్రీ, అమెరికా సఫరఫరా చేసిన MK-82 గైడెడ్ మిసైల్ లను ప్రయోగించినట్లు తాజాగా సాక్షాలు వెలువడ్డాయి. దానితో సౌదీ పాపంలో అమెరికా నేరుగా భాగం పంచుకున్నదని వెల్లడి అయింది. సౌదీ దాడి అనంతరం…

యెమెన్: అంతిమ యాత్రపై సౌదీ దాడి, 200 మంది దుర్మరణం

  మధ్య ప్రాచ్యం / పశ్చిమాసియా లో అమెరికా అనుంగు మిత్ర దేశం సౌదీ అరేబియా యెమెన్ లో సామూహిక హాత్యాకాండలకు పాల్పడుతోంది. తనకు వ్యతిరేకంగా మారినందుకు, అమెరికాను కూడా తలదన్నుతూ, ఒకటిన్నర సం.ల క్రితం యెమెన్ పై ఏకపక్ష యుద్ధం ప్రకటించిన సౌదీ అరేబియా ఆ దేశంలో అనేక అరాచకాలకు, యుద్ధ నేరాలకు, ఉచకోతలకు పాల్పడుతున్నది. తాజా ఊచకోత సౌదీ అరేబియా సాగించిన అనేక దారుణాల్లో ఒకటి మాత్రమే.  తిరుగుబాటు గ్రూపుకు చెందిన ఇంటీరియర్ మినిష్టర్…

కాళ్ళ బేరం: టెర్రరిస్టుల తరపున ఐరాస?

బహుశా దీనిని ఎవరూ ఊహించి ఉండరేమో! సిరియాలో ప్రభుత్వానికి, సిరియా ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న జబ్బత్ ఆల్-నూస్రా టెర్రరిస్టులు క్షేమంగా అలెప్పో వదిలి వెళ్లనివ్వాలని ఐరాస ప్రతినిధి స్టాఫన్ డి మిస్తురా కోరుతున్నాడు. సిరియా వ్యవహారాలు చూసేందుకు మిస్తురా ని ఐరాస నియమించింది. నిస్పాక్షికంగా ఉంటూ శక్తివంతమైన రాజ్యాల నుండి బలహీన రాజ్యాలను కాపాడేందుకు ప్రయత్నించవలసిన ఐక్య రాజ్య సమితి ఆచరణలో అమెరికా, పశ్చిమ రాజ్యాల భౌగోళిక రాజకీయాలకు పని ముట్టుగా మారింది. సిరియా కిరాయి…

సర్జికల్ స్ట్రైక్స్: సరిహద్దు గ్రామాల్ని ఎందుకు ఖాళి చేస్తున్నట్లు?

  నరేంద్ర మోడీ ప్రభుత్వం తాము పాక్ భూభాగం మీదికి చొచ్చుకుని వెళ్లి ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించామని, పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పామని ఆర్భాటంగా ప్రకటించారు. “సరిహద్దులో అలాంటి ఘటన ఏది జరగలేదు. ఎప్పటి లాగా క్రాస్ బోర్డర్ ఫైరింగ్’ జరిగింది, అంతే. అంతకు మించి ఏమి జరగలేదు” అని పాక్ ప్రధాని ప్రకటించారు.  ఒక్క పాక్ ప్రధాని మాత్రమే కాదు. అంతర్జాతీయ మీడియా కూడా “అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా, లేదా?”  అంటూ అనుమానాలు…

రష్యన్ ఎంబసీపై దాడి, మాట నిలబెట్టుకున్న అమెరికా?

  అమెరికా తన మాట నిలబెట్టుకుంది. “మీ ఇళ్లకు మీ వాళ్ళ శవాలు వెళ్తాయి” అని అమెరికా విదేశాంగ శాఖ చేసిన హెచ్చరిక ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.  సిరియా రాజధాని డమాస్కస్ లోని రష్యన్ రాయబార కార్యాలయం పైన సోమవారం ఆల్-నుస్రా టెర్రరిస్టులు దాడి చేశారు. దాడిలో రష్యన్ ఎంబసీ సిబ్బంది ఎవరు గాయపడలేదని రష్యా తెలిపింది. ఎంబసీ భవనం మాత్రం దెబ్బ తిన్నదని చెప్పింది.  “అక్టోబర్ 3 తేదీన రష్యన్ రాయబార కార్యాలయం మోర్టార్…

థర్డ్ వరల్డ్ వార్? -అమెరికా, రష్యాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

  సిరియా అంతర్యుద్ధం విషయమై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తత క్రమ క్రమంగా పెరుగుతున్నది. ఇరు దేశాలు తెర వెనుక  పరస్పరం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. అగ్ర దేశాలు రెండు ఏ క్షణంలో ఏ చర్యకు పాల్పడతాయో అన్న ఆందోళనను పరిశీలకులకు కలిగిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికాయే విఫలం చేసిన నేపథ్యంలో చర్చలకు, శాంతికి ఇంకా అవకాశం మిగిలే ఉన్నదని రష్యా ప్రకటిస్తుండగా అమెరికా మాత్రం వరుస ప్రతీకార చర్యలు ప్రకటిస్తున్నది. దానితో రష్యా సైతం…

సిరియా: సహకరించు, లేదా ఇంటికి శవాలు వెళ్తాయి!

  అమెరికా దృష్టిలో తనకి సహకరించడం అంటే తాను చెప్పిన మాటల్ని / ఇచ్చిన ఆదేశాల్ని పొల్లు పోకుండా అంగీకరించి అమలు చేయడం.  సిరియా అంతర్యుద్ధంలో తనకు సహకరించాలని లేదంటే రష్యన్ సైనికుల శవాలు బాడీ బ్యాగ్స్ లో ఇంటికి పంపించాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఇది నేరుగా రష్యాతో కయ్యానికి కాలు దువ్వడమే.  “ఇది (అమెరికా సమర్థిస్తున్న ఉగ్రవాద గ్రూపులపై రష్యా, సిరియాలు వాయు, భూతల దాడులు చేయడం) ఇలాగే కొనసాగితే…, సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతుంది.…

నిప్పుతో చెలగాటం వద్దు! -జపాన్ తో చైనా

  దక్షిణ చైనా సముద్రంలో అమెరికాతో చేరి వెర్రి మొర్రి వేషాలు వేయొద్దని చైనా, జపాన్ ను మరోసారి హెచ్చరించింది. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరుతో అమెరికా నిర్వహిస్తున్న మిలట్రీ పెట్రోలింగ్ లకు దూరంగా ఉండాలని కోరింది. ఉమ్మడి విన్యాసాలని చెబుతూ వివాదాస్పద అమెరికా మిలట్రీ విన్యాసాల్లో పాల్గొనటం ద్వారా ప్రాంతీయంగా అస్ధిరతకు ప్రాణం పోయవద్దని కోరింది.  దక్షిణ చైనా సముద్రంలో జపాన్ కు ఎలాంటి పని లేదని, అది బైటి దేశమేనని, బైటి దేశాలు చైనా…