శాంతి చర్చలు: విరమణ దిశలో రష్యా ఉక్రెయిన్-దాడి?
ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడి మెల్లగా విరమించే వైపుగా వెళుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా ఇస్తాంబుల్ చర్చల దరిమిలా రష్యా నుండి వెలువడిన ప్రకటనలను బట్టి ఈ అభిప్రాయానికి రావలసి వస్తోంది. టర్కీ నగరం ఇస్తాంబుల్ లో ఇరు పక్షాల మధ్య జరుగుతున్న చర్చలలో ఉక్రెయిన్ నుండి నిర్దిష్టంగా స్పష్టమైన ప్రతిపాదనలు తమకు అందాయని రష్యన్ చర్చల బృందం ప్రకటించింది. “టర్కీ నగరం ఇస్తాంబుల్ లో మార్చి 29 తేదీన జరిగిన చర్చల…














