ఫ్లాష్! గల్ఫ్ లో రెండు వారాల కాల్పుల విరమణ!

ఏప్రిల్ 7 సాయంత్రం 8 గంటల లోగా (అమెరికా కాలమానం ప్రకారం) హోర్ముజ్ జలసంధి ని బేషరతుగా తెరవక పోయినట్లయితే ఇరాన్ నరకం చవి చూస్తుందని డొనాల్డ్ ట్రంప్ నిన్న హెచ్చరించాడు. ఇరాన్ లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పైన, మౌలిక నిర్మాణాలైన వంతెనలు, ప్రభుత్వ భవనాలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు సమస్తం అమెరికా బాంబు దాడుల్లో సర్వ నాశనం అవుతాయని హుంకరించాడు. వేల సంవత్సరాల ఇరాన్ నాగరికత ఒక్క క్షణంలో ఆవిరి చేసేస్తా అన్నాడు. అలా…

ఇరాన్ పై అమెరికా ఆధిపత్య యుద్ధం: నోట్స్ & అప్ డేట్స్ -4

హార్ముజ్ జల సంధి ని ఇరాన్ నియంత్రణ కు వదిలేస్తూ యుద్ధ విరమణ కు అంగీకరించటానికి ట్రంప్ సుముఖంగా ఉండటం గల్ఫ్ రాజ్యాలకు మింగుడు పడటం లేదు. సౌదీ అరేబియా, యు ఏ ఈ, కతార్ దేశాలు ఇప్పటి దాకా యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్ కి తెర వెనుక చెబుతూ వచ్చాయి. ట్రంప్ ప్రకటన వారిని భయాందోళనలకు గురి చేస్తూ ఉండాలి.

ఇరాన్ పై ఆధిపత్య యుద్ధం: నోట్స్ & అప్ డేట్స్ -3

హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపధ్యంలో G7 గ్రూపు దేశాలు చమురు ధరల్ని తగ్గించటానికి వివిధ దేశాలను తమ రిజర్వ్ నిల్వలను విడుదల చేయాలని కోరుతున్నాయి. ఇప్పటిదాకా జపాన్, అమెరికా ఈ అంశం లో ఆమోదం చెప్పాయి. ఇందులో కలిసేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. అంటే చమురు ధరలు తగ్గించేందుకు G7 కూటమి చేసే ప్రయత్నాలకు మద్దతుగా తమ (స్ట్రాటజిక్) నిల్వలను మార్కెట్ లో విడుదల చేసేందుకు ఇండియా నిరాకరించింది.

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం -నోట్స్ & అప్-డేట్స్

– ఒక పక్క ఇరాన్ తో చర్చలు జరుపుతూనే అమెరికా, ఇజ్రాయెల్ లు హఠాత్తుగా ఫిబ్రవరి 28 తేదీన ఇరాన్ దేశం పైన నరహంతక దాడి ప్రారంభించాయి. దానితో అమెరికా, ఇజ్రాయెల్ లు నిజాయితీగా, ఘర్షణని నివారించే ఉద్దేశంతో చర్చలు జరపడం లేదని లోకానికి అర్ధం అయింది. చర్చల పేరుతో ఇరాన్ ను ఏమరుపాటు స్థితిలో ఉంచి మెరుపుదాడి చేయటమే అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యం అని స్పష్టం అయింది. ఇజ్రాయెల్, అమెరికా లు కుట్ర చేసినట్టే ఫిబ్రవరి 28…

అమెరికా శాసిస్తుంది, ఇండియా పాటిస్తుంది!?

బిజెపి-ఆర్ఎస్ఎస్ పాలనలో, నరేంద్ర మోడి, అమిత్ షా ద్వయం హయాం లో ఇండియా పైన అమెరికా దాష్టీకం, పెత్తనం, కంట్రోల్ పెరిగిపోయిందన్న సూచనలు అమెరికా అధ్యక్షుడు, మంత్రులు, అధికారులు వరుసగా ఇస్తూనే ఉన్నారు. ఇండియా పైన తమ పెత్తనం సంపూర్ణం అన్న నమ్మకాన్ని వాళ్ళు తమ మాటల ద్వారా, ప్రకటనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఇవ్వటం కొనసాగుతూనే ఉన్నది. వారి సూచనల్లో ఎలాంటి తడబాటు లేకపోవటమే అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం! రైసీనా డైలాగ్ పేరుతో భారత…

అమరత్వాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిన ఖమైనీ!

ప్రపంచంలో మనందరి మధ్య మసలే గొప్ప గొప్ప నాయకులు, దార్శనికులు, స్ఫూర్తి ప్రదాతలైన మానవులు… వీళ్ళందరికీ తమ సమయం ఎప్పుడు ముగుస్తుందో ముందే తెలుస్తుంది. వాళ్ళకి సంకోచించటం అన్నది తెలియదు. భయంతో దాక్కోవటం అనేది వాళ్ళు ఎరుగరు. తుఫాను కంటికి సరిగ్గా మధ్యలో నిలబడతారు. గొప్ప సాహసంతో, దృఢ నిశ్చయంతో తమను చంపడానికి వచ్చిన వారికి ఎదుటే నిలబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తమ శత్రువుకు గానీ, అమరత్వానికి గానీ భయపడరు. వాళ్ళు అమరత్వాన్ని గాఢంగా ఆలింగనం…

గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 2

Gaza people are forced to migrate throught the Gaza strip due to continous bombing by Israel military —–మాతృక అక్టోబర్ నెల సంచిక నుండి (రచన: సుమన) పార్ట్ 1 తరువాత భాగం……. బాల్ఫర్‌ డిక్లరేషన్‌ పశ్చిమాసియా చరిత్రలో బాల్ఫర్‌ డిక్లరేషన్‌ అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వాస్తవానికి ప్రాధాన్యతగానీ, చట్టబద్ధత గానీ లేని ఒక చిన్న లేఖ బాల్ఫర్‌ డిక్లరేషన్‌కి పునాది. దీనిపై బ్రిటిష్‌ పార్లమెంటులో చర్చ కూడా జరిగింది లేదు.…

గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 1

– —–మహిళా పత్రిక ‘మాతృక’ అక్టోబర్ నెల సంచిక నుండి. (రచన: సుమన) ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాయాల గాజా వైపు చూపండి! పెట్రో డాలర్లు వెదజల్లుతున్న ఈ కర్బన ఉద్గారాల కమురు వాసన గాలులు ఎక్కడివంటే గాజా తీరాన్ని చూపండి! మానవతా చూపులను మసకబార్చుతున్న ఆ గంధకపు పేలుళ్ల పొగల మేఘాలు ఎక్కడ వర్షిస్తున్నాయంటే పుడమి తల్లి రాచపుండుగా మారిన గాజాలో సొమ్మసిల్లుతున్న మానవ దేహాలను చూపండి. మన ఇంటిపై కమ్మిన ఉప్పు భాష్పాల…

సీజ్ ఫైర్ ప్రతిపాదన అమెరికాదే, ఇండియా ఒప్పుకోలేదు -పాకిస్తాన్

Pakistan Foreign Minister Ishaq Dar పహల్గామ్ టెర్రరిస్టు దాడి అనంతరం, ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం విరమించే ప్రతిపాదన మొదట అమెరికా నుండే వచ్చిందని పాకిస్తాన్ వెల్లడి చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇండియా అంగీకరించలేదని పాకిస్తాన్ విదేశీ మంత్రి ఇషాక్ దార్ మంగళ వారం (సెప్టెంబర్ 16) వెల్లడి చేశాడు. (పహల్గామ్ లో టూరిస్టులపై హంతక దాడి చేసిన వారిని భారత పత్రికలు, ప్రభుత్వం టెర్రరిస్టులు అని చెబుతుండగా,…

ఇండియా, పాక్ సీజ్ ఫైర్ మరియు ట్రంప్ అను విచిత్ర గాధ!

ఇండియా, పాకీస్థాన్ దేశాల సైన్యం, పహల్గామ్ పై జరిగిన దాడి దరిమిలా పరస్పరం 4 రోజుల పాటు మిసైళ్లు, జెట్ ఫైటర్లు, డ్రోన్ లతో యుద్ధం చేస్తూ అకస్మాత్తుగా “కాల్పుల విరమణ” ప్రకటించటం వెనుక కారణం ఏమిటి? ఇండియా, పాకీస్థాన్ దేశాల ప్రభుత్వాలు కాల్పుల విరమణకు నిర్ణయించాయా? లేక భారత ప్రభుత్వం పదే పదే మొత్తుకుంటున్నట్లు ఇరు దేశాల మిలటరీలు నిర్ణయించాయా? లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూరున్నొక్క సార్లు అలుపు సొలుపు లేకుండా డప్పు…

యుద్ధము – వాణిజ్యం: పాలకవర్గాల దళారీ స్వభావం బట్టబయలు -రెండో భాగం

ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి; 03-06-2025 ప్రధాన మంత్రి మోడి విభిన్న స్పందన                                       పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా సామాన్య కశ్మీరీలు ప్రదర్శించిన హీరోయిజానికి సరిగ్గా భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందన ఉండింది. సామాన్య ప్రజల మానవతా ప్రతిస్పందనకు ఆయన ఏ మాత్రం సాటి రాలేకపోయాడు. స్థానిక నివాసులు తమ జీవితాలను పణంగా పెట్టి బాధితులను రక్షించటానికీ, సహాయం చేయటానికి ముందుకు రాగా; నరేంద్ర మోడి మాట్లాడిన మాటలు పొరుగు దేశం వైపు తప్పిదాన్ని…

యుద్ధం – వాణిజ్యం: బట్టబయలైన మోడి, ఆయన వంధిమాగధుల దళారి స్వభావం

————-ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి: తేదీ: 03-06-2025 ఆర్టికల్ 370ని రద్దు చేయటం వలన కశ్మీరీ లోయలో శాంతి పునః స్థాపన జరిగిందనీ, ఉగ్రవాదం సమూలంగా నాశనం అయిందనీ, కశ్మీరీలలో అసంతృప్తి తగ్గిపోతోందని -మోడీ, అతని పరివారాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కథ మాత్రం వేరుగా ఉంది. కశ్మీర్ లో పర్యాటకులు సేద తీరే పట్టణం పహల్గామ్ లో జరిగిన ఒకానొక దిగ్బ్రాంతికర సంఘటనలో నలుగురు ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండా…

తూర్పు లడఖ్: చైనా, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం!

10 దేశాల బ్రిక్స్ కూటమి సమావేశాలు రష్యన్ నగరం కాజన్ లో ప్రారంభం కావటానికి రెండు రోజుల ముందు తూర్పు లడఖ్ సరిహద్దు కాపలా విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన మాట నిజమేనని ఈ రోజు (అక్టోబర్ 22) చైనా ధృవీకరించింది. ఒప్పందం కుదిరిన సంగతిని సోమవారమే (అక్టోబర్ 21) ఇండియా ప్రకటించింది. ఇండియా ప్రకటనను చైనా ఈ రోజు ధృవీకరించింది. లడఖ్ ప్రాంతంలో చైనా, ఇండియా దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను…

భారత్ ఆయుధాలు ఉక్రెయిన్ లో ప్రత్యక్షం, రష్యా అసంతృప్తి!

155mm Shells భారత దేశ ప్రభుత్వ ఆయుధ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలను ఉక్రెయిన్, రష్యాపై యుద్ధంలో ప్రయోగిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడి చేసింది. భారత ప్రభుత్వ కంపెనీల తయారీ ఆయుధాలు తమపై ప్రయోగించేందుకు ఇండియా అనుమతి ఇవ్వడం పట్ల రష్యా ఇప్పటికే రెండు సార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఇండియా నేరుగా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయటం లేదు. వివిధ ట్యాంకులు, మర ఫిరంగులు ఉపయోగించే మందుగుండు సామాగ్రిని ఇండియా…