పనామా పేపర్స్: అమెరికా ఫైనాన్స్ ప్రయోజనాలే లక్ష్యం -4

(3వ భాగం తరువాత………..) అమెరికా ఫైనాన్స్ కంపెనీలే లబ్దిదారులు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు లేదా నేర విచారణ సంస్థలు ఒక అంశంపై తప్పనిసరిగా దృష్టి పెడతాయి. ఆ నేరం వల్ల లబ్ది పొందేది ఎవరు? అని ప్రశ్నించుకుంటారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే నేర విచారణ అనేక కేసుల్లో పూర్తయి పోతుంది. అనేకానేకానేక పరిణామాలు నిత్యం విడివిడిగా, జమిలిగా చోటు చేసుకునే ప్రపంచ కార్యరంగంలో చోటు చేసుకునే పరిణామాలకు కారణాలు కనిపెట్టడం మామూలు కంటికి కష్ట…

అక్రమ డబ్బు, పన్ను ఎగవేతలకు నూతన స్వర్గం అమెరికా! -3

– (2వ భాగం తరువాత………….) అక్రమ డబ్బుకు కొత్త స్వర్గం అమెరికా! 2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాతి రోజుల్లో అమెరికా, ఐరోపాలు జి20 ని ప్రధానంగా రంగంలోకి దించాయి. జి20 పేరుతో సంక్షోభం భారాన్ని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలపై నెట్టడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లక్ష్యంగా పెట్టుకుంది. (ఐతే చైనా ఆ బుట్టలో పడకపోవడం వేరే సంగతి).…

పనామా పేపర్స్: పుతిన్ ఎందుకు కేంద్రం అయ్యాడు? -2

(మొదటి భాగం తరువాత……….) అసలు ఐ‌సి‌ఐ‌జే ఎక్కడిది? సంవత్సరం క్రితం వరకూ దీనిని గురించి తలచుకున్నవారు లేరు. 1997లో స్థాపించినట్లు చెబుతున్న దీని మాతృ సంస్థ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెగ్రిటీ (సి‌పి‌ఐ). సి‌పి‌ఐకి నిధులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మొత్తం విషయంలో సగం అర్ధం అయిపోతుంది. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) మాజీ రాయబారి క్రెయిగ్ ముర్రే తన వెబ్ సైట్ లో ఇలా తెలిపాడు. “మొస్సాక్ ఫన్సెకా సమాచారాన్ని వడ కట్టిన…

ఫైనాన్స్ మత్తగజాల మధ్య సమరమే ‘పనామా పేపర్స్’! -1

[ఈ వ్యాసం మొదట ప్రజా పంధా పక్ష పత్రికలో రెండు భాగాలుగా అచ్చయింది. బ్లాగ్ లో 4 భాగాలుగా ఇస్తున్నాను. -విశేఖర్] ********* ఏప్రిల్ మొదటి వారంలో (4 తేదీ నుండి) ప్రపంచ పౌరులందరినీ ఆకట్టుకున్న వార్త ఒకటి పత్రికల్లో, ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆక్రమించింది. దాదాపు ప్రతి దేశంలోనూ తమ పాలకుల అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగాల పట్ల విసిగిపోయి ఉన్న ప్రజలకు కొత్తగా ఒక ‘అవినీతి వ్యతిరేక మెస్సయ్యా’ ప్రత్యక్షమయిన భావనను ఆ…

ఆర్మీ మందుగుండు డిపోలో పేలుడు, 17గురు సైనికులు ఆహుతి

మహారాష్ట్రలో భారత రక్షణ బలగాల ఆయుధాలకు మందుగుండు సరఫరా చేసే అతి పెద్ద మందుగుండు డిపోలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంగా చెబుతున్న దుర్ఘటనలో 17 మంది సైనికులు దుర్మరణం చెందారని పత్రికలు తెలిపాయి. మరణాల సంఖ్య 20 కి పెరిగిందని కొన్ని పత్రికలు చెప్పాయి. ప్రధాన మంత్రి యధావిధిగా ‘ట్విట్టర్’ ద్వారా తన ఆందోళన ప్రకటించారు. తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని తెలిపారు. మృతులలో ఇద్దరు అధికారులు కాగా 15 మంది డిఫెన్స్ సెక్యూరిటీ…

కోల్డ్ వార్ మనస్తత్వం వదలండి, అమెరికాతో చైనా

అమెరికా హెచ్చరికలకు చైనా ఘాటుగా బదులు ఇచ్చింది. రక్షణ కార్యదర్శి (మన రక్షణ మంత్రికి సమానం) ఎష్టన్ కార్టర్ చేసిన వ్యాఖ్యలు కోల్డ్ వార్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోల్డ్ వార్ మెంటాలిటీ నుండి బైటికి వస్తే మంచిదని హెచ్చరించింది. అమెరికా మిలట్రీ అధికారులు డైరెక్ట్ చేసే హాలీవుడ్ కోల్డ్ వార్ సినిమాలో తాము ఎలాంటి పాత్ర పోషించబోమని అపహాస్యం చేసింది. “కార్టర్ వ్యాఖ్యలు అమెరికా స్టీరియోటైప్ ఆలోచనా విధానాన్ని, అమెరికా ఆధిపత్య భావనని నగ్నంగా ఆరబోశాయి” అని…

రష్యా సదస్సుకు ఈ‌యూ నేత, అమెరికా అభ్యంతరం!

అమెరికా, యూరోపియన్ యూనియన్ ల మధ్య లుకలుకలు మెల్లగానే అయినా పెరుగుతున్నాయి. రష్యా నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రతి యేటా జరిగే “సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం” (SPIEF) సమావేశాలకు ఈ యేడు యూరోపియన్ కమిషన్ (ఈ‌సి) అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ హాజరు కానున్నాడు. ఆయన రష్యా వెళ్లడానికి అమెరికా అభ్యంతరం చెబుతోంది. ఒక పక్క రష్యాపై అమెరికా-ఈ‌యూల ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు కొనసాగుతుండగా రష్యా జరిపే ఆర్ధిక సదస్సుకు ఈ‌సి…

రుమేనియా నాటో బేస్: బలిపశువు అవుతారు -రష్యా

అమెరికా నేతృత్వం లోని మిలటరీ గూండా కూటమి నాటో (North Atantic Treaty Organisation) కు తమ దేశంలో మిసైల్ స్ధావరం కల్పించడంపై రష్యా నోరు విప్పింది. అనవసరంగా నాటో యుద్ధోన్మాదంలో బలి పశువు కావొద్దని హితవు పలికింది. అమెరికన్ యాంటీ మిసైల్ వ్యవస్ధను తమ దేశంలో నెలకొల్పడానికి అనుమతి ఇవ్వడం తగదని, తమ రక్షణ కోసం అమెరికా మిసైల్ వ్యవస్ధపై చేసే దాడి రుమేనియాపై దాడిగా మారుతుందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు మెరురుపరుచుకునే…

మళ్ళీ రేప్: ఒకినావాలో అమెరికా వ్యతిరేక ఆందోళనలు

జపాన్ దక్షిణ ద్వీప రాష్ట్రం ఒకినావాలో అమెరికా సైనికులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో అమెరికా సైనిక స్ధావరం సమీపంలో వాకింగ్ కి వెళ్ళిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆ మహిళను గొంతు పిసికి చంపేశారు. మే 26-27 తేదీలలో టోక్యోలో G7 దేశాల సమావేశం జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన ఈ దారుణానికి వ్యతిరేకంగా జపాన్ ప్రజలు ఆందోళనలను తీవ్రం చేశారు. ఒకినావా రాష్ట్రంలోను ఫుటెన్మా సైనిక స్ధావరాన్ని పూర్తిగా…

కోల్డ్ వార్ 2.0: కజకిస్తాన్ లో ప్రేరేపిత ఆందోళనలు

కోల్డ్ వార్ వర్షన్ 2.0 లో కజకిస్తాన్ ఒక భాగం అయింది. రష్యా పొరుగు దేశం కజకిస్తాన్ లో సో-కాల్డ్ ప్రజాందోళనలు చెలరేగడంతో రష్యా వ్యతిరేక కోల్డ్ వార్ లో మరో ఫ్రంట్ ను అమెరికా తెరిచినట్లయింది. సిరియాను అస్తవ్యస్తం కావించి రష్యాను సిరియా యుద్ధంలో కూరుకుపోయేలా చేయడానికి శత విధాలుగా ప్రయత్నించి విఫలం అయిన అమెరికా మరో దుస్సాహసానికి ఒడిగడుతోంది. మే 21 తేదీన కజకిస్తాన్ లో వివిధ నగరాలలో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలలో…

పోలండ్ పాఠం: అమ్మ నాన్న, ఒక నాటో -కార్టూన్

నాటో అంటే తెలిసిందేగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్! దీనికి అమెరికా నేత. నాటో కూటమిలో పేరుకు 28 సభ్య దేశాలు ఉన్నా, అమెరికా ఒక్కటే ఒకటి (1). మిగిలిన 27 దేశాలన్నీ ఆ ఒకటి పక్క సున్నాలే. అంటే ఏ రష్యాతో యుద్ధం అంటూ వస్తే బాంబులు అవీ తీసుకుని అమెరికా రావాలే తప్ప ఇతర దేశాలు రష్యా ముందు నిలవలేవు.  1990ల ఆరంభంలో సోవియట్ రష్యా కూలిన తర్వాత రోజుల్లో అమెరికా, రష్యాల మధ్య…

బ్రెగ్జిట్ కు పెరుగుతున్న ఆదరణ!

బ్రిటన్ + ఎగ్జిట్ = బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెక్సిట్ అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుండి మరిన్ని రాయితీలు పొందే లక్ష్యంతో బ్రిటన్ ప్రధాని కామెరాన్ నిర్వహిస్తున్న రిఫరెండం కాస్తా నిజంగానే ఈ‌యూ ఎగ్జిట్ వైపుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఒపీనియన్ పోల్స్ అన్నింటి లోనూ ‘ఇన్’ (ఈ‌యూలోనే కొనసాగుదాం) శిబిరానికే అధిక ఆదరణ ఉన్నట్లు చెబుతూ వచ్చాయి. కానీ సోమవారం జరిగిన ఒక పోలింగు లో మొట్ట…

బ్రెజిల్ లో ప్రభుత్వ మార్పు -ది హిందు ఎడ్..

(Regime change in Brazil శీర్షికన మే 13 తేదీన వెలువడిన ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం.) ********* అది మరో పేరుతో జరిగిన తిరుగుబాటు కుట్ర. సెనేట్ అభిశంసన ఓటు ద్వారా అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ ను అధికార పదవి నుండి సస్పెండ్ చేయడం ద్వారా బ్రెజిల్ ప్రతిపక్షం అరుదైన విజయాన్ని సాధించింది. 55-22 ఓట్ల తేడాతో నెగ్గిన అభిశంసన 13 సం.ల వర్కర్స్ పార్టీ (పి‌టి) పాలనకు అంతం పలికింది. రౌసెఫ్ ఇప్పుడు…

ఈ‌యూ ఆధిపత్యం నిలువరించే ఆయుధం: రిఫరెండం

రిఫరెండం అంటే భారత పాలకవర్గాలకు ఎనలేని భయం. వారికి జనం అభిప్రాయాల పట్ల అస్సలు గౌరవం ఉండదు. జనం గొర్రెలు అని వారి నిశ్చితాభిప్రాయం. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి జనం అభిప్రాయాలు కావాలి. అభిప్రాయాలూ అంటే అభిప్రాయాలు కాదు. ఓటు ద్వారా వ్యక్తం అయ్యే వారి ఆమోదం మాత్రమే కావాలి. ఆ ఓటు సంపాదించడానికి ఎన్ని జిత్తులు వేయాలో అన్నీ వేస్తారు. ఆనక వారిని నట్టేట్లో వదిలేసి పోతారు. ఐరోపా దేశాల్లో అలా కాదు. రిఫరెండం…

సంతకం అయింది -ఇండియా; అబ్బే లేదు -రష్యా

అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధ S-400 అమ్మకం ఒప్పందానికి సంబంధించి బుధవారం కొద్ది నిమిషాల వ్యవధిలో పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడ్డాయి. అమెరికా దగ్గర కూడా ఇంతవరకు సమాధానం లేని అత్యంత ఆధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధగా పేరు పొందిన S-400 వ్యవస్ధలను తమకూ అమ్మాలని ఇండియా కోరుతోంది. ఈ ఒప్పందం అందినట్లే అంది దూరం జరుగుతోంది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జరిపిన రష్యా పర్యటన ప్రధాన లక్ష్యం S-400…