లాతుఫ్ కార్టూన్ లపై టర్కీ నిషేధం

పాత టర్కీ ఒట్టోమాన్ సామ్రాజ్యం తరహాలో మధ్య ప్రాచ్యంలో సరికొత్త టర్కీ సామ్రాజ్యాన్ని స్ధాపించాలని కలలు గంటున్న టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, అంతకంతకూ ఫాసిస్టు రూపం ధరిస్తున్నాడు. సిరియా విచ్ఛిన్నానికి కుట్రలు పన్నిన పశ్చిమ సామ్రాజ్యవాదుల వ్యూహాల్లో తురుపు ముక్కగా మారి అత్యంత విద్రోహకర, ప్రగతి నిరోధక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఎర్డోగన్ టర్కీ ప్రజల ప్రాధమిక హక్కులను ఒక్కొక్కటిగా హరించి వేస్తున్నాడు. వేలాది ప్రతిపక్ష నేతలతో పాటు వారి మద్దతుదారులను కూడా జైళ్ళలో…

ఇసిస్ చమురు టర్కీ కొనుగోలు, సాక్షాలు చూపిన రష్యా

రెండు దేశాలలోని (ఇరాక్, సిరియా) ప్రాంతాలను ఆక్రమించుకుని ఏలుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఇసిస్ లేదా ఇసిల్ లేదా దాయిష్) కు ఆర్ధిక వనరులు ఎక్కడివి? ఇతర దేశాలతో ఎలాంటి వ్యాపారం లేకుండా ఆయుధాలకు, కిరాయి సైనికుల వేతనాలకు డబ్బు ఎలా సమకూర్చుతోంది? ఒక ప్రాంతాన్ని ఏలుతున్న పాలక వ్యవస్ధ నిలబడాలంటే ఆర్ధిక వనరులు తప్పనిసరి. తమ తరపున పని చేసేవారికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. మరి ప్రపంచం అంతా టెర్రరిస్టు సంస్ధగా ముద్ర వేసిన ఇస్లామిక్…

ప్యారిస్ దాడులు ఎవరి పని? -ఫోటోలు

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో నవంబర్ 13 సాయంత్రం మొదలుకొని నవంబర్ 14 తెల్లవారు ఝాము వరకు వరసపెట్టి ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇరాక్, సిరియాలలో కొన్ని భాగాలను ఆక్రమించుకుని ఇస్లామిక్ కాలిఫెట్ ను ఏర్పాటు చేసిందని పశ్చిమ పత్రికలు ఘనంగా ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్ ఈ దాడికి కారకులుగా, విచారణ కనీసం మొదలు కాకుండానే, ఫ్రాన్స్…

సిరియాలో ఎగదోసిన మంటలు ఫ్రాన్స్ లోకి!

ఉగ్రవాద పెనుభూతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాని ఫలితంగానే ప్యారిస్ పైన టెర్రరిస్టు దాడి జరిగిపోయింది. మానవత్వం మరిచిపోయిన కిరాతక ఉగ్రవాదులు అత్యంత సుందర నగరం ప్యారిస్ పై దాడి చేసి రక్తపాతం సృష్టించారు. 130 మందిని పొట్టన బెట్టుకున్నారు. సంగీత తరంగంలో మునిగిన వారిని, క్రీదానందంలో ఉన్నవారినీ, షాపింగ్ కు వచ్చినవారిని… వారూ వీరు అని లేకుండా అమాయకుల రక్తాన్ని చవిచూచారు. సోషలిస్టు భావ తరంగం ఊపిరి పోసుకున్న నేల ఉగ్ర మూకల పదఘట్టనలతో మైలపడిపోయింది!…

గ్రెక్సిట్: బ్రిటన్ పెనం నుండి అమెరికా పొయ్యి లోకి -7

6వ భాగం తరువాత…………… ఇ.ఎల్.ఏ.ఎస్ బలగాలు ఏథెన్స్ పై అంతకంతకూ పట్టు బిగిస్తూ పోయాయి. దాదాపు ఏథెన్స్ లోని పోలీసు స్టేషన్లన్నింటినీ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. చివరికి 3 చదరపు కి.మీ భాగమే బ్రిటిష్ తాబేదారు ప్రభుత్వానికి మిగిలింది. గ్రీసులోని ఇతర ప్రాంతాల్లో పోరాటం చేయాల్సిన అవసరం ఇ.ఎల్.ఏ.ఎస్ కు లేదు. ఒక్క ఎపిరస్ తప్ప గ్రీసు అంతా దాని ఆధీనంలోనే ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఇ.ఎల్.ఏ.ఎస్ ఘోరమైన తప్పిడానికి పాల్పడింది. ఇక ఏథెన్స్ తమ వశం…

గ్రెక్సిట్: గ్రీసు ప్రజా విముక్తి పోరాటం (సివిల్ వార్) -6

5వ భాగం తరువాత……….. ప్రజా విముక్తి పోరాటం 1941 ఏప్రిల్ 6 తేదీన హిట్లర్ సేనలు రంగంలోకి దిగాయి. ఇటలీ అంతిమ ఓటమికి గురయితే అది జర్మనీకి పాకడానికి ఎంతోసేపు పట్టదు. మిత్రరాజ్యాలు రెట్టింపు ఉత్సాహం పొందవచ్చు. అదీకాక ఐరోపా వనరులన్నీ తమ ప్రయోజనాలకే అంకితం కావాలన్న లక్ష్యం ఎలాగూ ఉంది. అప్పటికే చమురు భూముల రక్షణ కోసమని చెబుతూ రుమేనియాలో సైనిక స్ధావరం ఏర్పరుచుకున్న జర్మనీ ఆ పొరుగునే ఉన్న బల్గేరియా పాలకులను కూడా తన…

గ్రెక్సిట్: కార్మికవర్గ ఉద్యమాలు, మెటాక్సస్ నియంతృత్వం -5

4వ భాగం తరువాత…………………. 1929 నుండి ప్రబలంగా ఉనికిలోకి వచ్చిన ‘గ్రేట్ డిప్రెషన్’ రెండో ప్రపంచ యుద్ధానికి తగిన ఆర్ధిక భూమికను ఏర్పరిచింది. 2008 నాటి ‘గ్రేట్ రిసెషన్’ (ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం) లాగానే ఆనాటి ‘గ్రేట్ డిప్రెషన్’ కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం గమనించవలసిన విషయం. మొన్నటి గ్రేట్ రిసెషన్ వాల్ స్ట్రీట్ లోని బడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ‘లేమాన్ బ్రదర్స్’ కుప్పకూలిన దరిమిలా ఉనికిలోకి రాగా ఆనాటి గ్రేట్ డిప్రెషన్ అమెరికా స్టాక్…

గ్రెక్సిట్: మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రీసు -4

మూడో భాగం తరువాయి………………… – గ్రీసు పెట్టుబడిదారుల దుస్సాహసం 20వ శతాబ్దం ఆరంభంలో టర్కీ సామ్రాజ్యం బలహీనపడడం, మార్కెట్ల పంపిణీలో వైరుధ్యాలు తలెత్తిన ఫలితంగా ఐరోపా రాజ్యాల మధ్య కుమ్ములాటలు తీవ్రం కావడంతో గ్రీసు పెట్టుబడిదారీ వర్గం తనను తాను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసింది. అయితే టర్కీ బూర్జువాల మద్దతుతో టర్కీ ఆర్మీలోని రెండవ శ్రేణి సైనికాధికారులు ‘యంగ్ టర్క్ మూవ్ మెంట్’ ఆరంభించి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వారి చర్యలు టర్కీ జాతీయవాదాన్ని…

గ్రెక్సిట్: ఆంగ్లో-అమెరికన్ భౌగోళిక రాజకీయ వ్యూహంలో పావు, గ్రీసు -3

రెండో భాగం తర్వాత…………………………. పశ్చిమ పెట్టుబడిదారీ వ్యవస్ధ గ్రీసును అభివృద్ధి చెందిన దేశంగా 1961 నుండి పరిగణిస్తోంది. (అభివృద్ధి చెందిన దేశాల క్లబ్ గా చెప్పే ఓ.ఇ.సి.డి కూటమిలో గ్రీసు సభ్య దేశం.) కానీ అక్కడి ప్రజలు, ముఖ్యంగా శ్రామిక ప్రజలు ఎన్నడూ ఆ అభివృద్ధిని అనుభవించలేదు. ఆధునిక గ్రీసు చరిత్రను ప్రజల దృక్కోణంలో పరిశీలిస్తే పాలకవర్గాల అణచివేతలతో పాటు, ప్రజల తిరుగుబాటు పోరాటాలు కూడా సమృద్ధిగా కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ హిట్లర్…

గ్రెక్సిట్: పెట్టుబడిదారీ సంక్షోభ ఫలితం -2

మొదటి భాగం తరువాత……………… గ్రీసు అబద్ధాలు?! గ్రీసు 2001లో తన జాతీయ కరెన్సీ ‘డ్రాక్మా’ను రద్దు చేసుకుని ‘యూరో’ను స్వీకరించింది. సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘యూరో జోన్’ లో చేరింది. ఆనాటి గ్రీసు ప్రభుత్వం తమ ఆర్ధిక పరిస్ధితి గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, అబద్ధాలు చెప్పి యూరో జోన్ లో చేరిందని పశ్చిమ పత్రికలు, ఈ.యు, ఇ.సి.బి అధికారులు ఇప్పటికీ చెబుతారు. గ్రీసు దాచిపెట్టిన ఆర్ధిక సమస్యల వల్ల గ్రీసు అప్పు పెరుగుతూ పోయిందని, అది తడిసి…

గ్రెక్సిట్: జర్మనీ సామ్రాజ్యవాదం ఉక్కు కౌగిలిలో ఐరోపా -1

మొదటి భాగం………………. గత అయిదేళ్లుగా అంతర్జాతీయ స్ధాయిలో పతాక శీర్షికలలో నానుతున్న వార్త గ్రెక్సిట్! గత రెండేళ్లుగా గ్రెక్సిట్ వార్తల మధ్య వ్యవధి తగ్గుతూ వచ్చింది. ఈ యేడు జనవరిలో ‘రాడికల్ లెఫ్ట్’ గా పిలువపడుతున్న సిరిజా కూటమి అధికారం చేపట్టాక గ్రెక్సిట్ క్రమం తప్పని రోజువారీ వార్త అయింది. గ్రీక్ + ఎక్సిట్ కలిసి గ్రెక్సిట్ అయింది. ఎక్సిట్ అంటే బయటకు వెళ్లిపోవడం. గ్రీసు యూరో జోన్ నుండి బైటికి వెళ్లిపోయే పరిస్ధితులను గ్రెక్సిట్ అని…

ఇస్లామిక్ స్టేట్ తో యుద్ధం -ది హిందు ఎడిట్..

ఇరాక్ లోని ప్రధాన నగరం మోసుల్ ని స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాత, పశ్చిమ ఆసియాలో ఒక బలీయమైన శక్తిగా ఇస్లామిక్ స్టేట్ కొనసాగుతూనే ఉంది. అమెరికా నేతృత్వంలో సాగుతున్న బాంబింగ్ దాని ఊపును అడ్డుకుంటున్న జాడ లేదు. కుర్దిష్ మరియు షియా మిలీషియాల చేతుల్లో ఎదురైన కొన్ని ఓటములు తప్పితే, గత సంవత్సర కాలంలో ఐ.ఎస్ తన ప్రభావ ప్రాంతాన్ని సిరాక్ (Syraq = Syria + Iraq) లోని తన (ప్రధాన) స్ధావరం కంటే…

ఎ.పికి చిప్ప, బంగ్లాకు లప్ప!

ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వడానికి లేని నిధులు బంగ్లాదేశ్ కు అప్పు ఇచ్చేందుకు ఎక్కడి నుండి వస్తాయి. దేశంలో ఒక రాష్ట్ర ప్రగతికి నిధులు లేనప్పుడు ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? లోటు బడ్జెట్ తో మూలుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బు లేదని కేంద్రం చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రు. 12 వేల…

చైనా సరిహద్దులో భద్రత తగ్గింపు

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో చైనా చొరబాట్ల గురించి బి.జె.పి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ప్రధాని నరేంద్ర మోడి గారయితే చైనా విషయంలో యు.పి.ఏ పై నిప్పులు చెరిగేవారు. హిందూత్వ అభిమానగణం గురించి ఇక చెప్పనే అవసరం లేదు. హిందూత్వపై విమర్శలు కనపడిన చోటల్లా చొరబడి చైనా అది చేయడం లేదా, ఇది చేయడం లేదా అని దాడికి దిగుతారు. కొండొకచో బూతులకు లంకించుకుంటారు. తీరా మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా, చైనా…

వెనుదిరిగిన (అరబ్) వసంతం -ది హిందు ఎడిట్..

2013లో జరిగిన మిలట్రీ కుట్ర ద్వారా అధికారం నుండి కూల్చివేయబడిన ముస్లిం బ్రదర్ హుడ్ (ద ఇఖ్వాన్) నాయకులపై మోపిన ప్రధాన క్రిమినల్ కేసుల నుండి వెలువడతాయని భావిస్తున్న అనేక తీర్పుల్లో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మొర్సీ, ఆయన సహ ప్రతివాదులపై గత వారం వెలువడిన దోషిత్వ నిర్ధారణ తీర్పు మొదటిది. డిసెంబర్ 2012లో అధ్యక్ష భవనం వెలుపల నిరసనకారులపై అల్లర్లు రెచ్చగొట్టినందుకు గాను మోర్సీకి 20 యేళ్ళ కారాగారవాస శిక్ష విధించారు. నూతన రాజ్యాంగ…