పెట్టుబడిదారులకి సంక్షోభం కనిపించేది ఇలాగే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వచ్చే ‘చక్ర భ్రమణ సంక్షోభాలు’ (cyclic crises) ప్రజల మూలుగలని పిప్పి చేసినా పెట్టుబడిదారులకి కాసులు కురవడం మాత్రం ఆగిపోదు. సంక్షోభం పేరు చెప్పి సర్కారు ఖజానాపై మరింత దూకుడుగా ఎలా వాలిపోవాలో అనేక వంచనా మార్గాలని వారు అభివృద్ధి చేసుకున్నారు; సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధకి కొత్త కాదు గనక. ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల సొమ్ము భోంచేసినప్పటికీ, కంపెనీలు దానిని ఏ మాత్రం కార్మికవర్గానికి విదల్చకపోవడం వల్ల సంక్షోభం ప్రధాన ఫలితం నిరుద్యోగమే అవుతుంది.…

‘ఆధునికత’ ముసుగులో మెట్రోల్లో కొనసాగుతున్న కుల, మత వివక్షలు -ది హిందూ

భారత దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజ్ఞానానికి రాజధానిగా భాసిల్లుతున్న బెంగుళూరు లో కుల, మతాల మూఢత్వం ‘ఆధునికత’ ముసుగులో పరిఢవిల్లుతోందని ‘ది హిందూ’ వెల్లడించింది. సామాజిక వ్యవస్ధల్లో మనుషుల మధ్య తీవ్ర వైరుధ్యాలకు కారణంగా నిలిచిన కుల, మతాలు కాల క్రమేణా బలహీనపడుతున్నాయన్న విశ్లేషణల్లో నిజం లేదని ‘ది హిందూ’ పత్రిక ప్రచురిస్తున్న పరిశోధనాత్మక కధనాల ద్వారా తెలుస్తోంది. భూస్వామ్య వ్యవస్ధ మూలాలయిన కులం, మత విద్వేషాలు ఆధునికతకు మారుపేరుగా భావించే మెట్రో నగరాల్లో బలహీనపడకపోగా యధాశక్తితో…

(మావో ధాట్) మావో ఆలోచనా విధానం అంటే? -2

అర్ధ భూస్వామ్య వ్యవస్ధలో మేజార్టీ ప్రజలకు భూమి పధాన ఉత్పత్తి సాధనంగా, శ్రమ సాధనంగా కొనసాగుతుంది. కానీ భూస్వామ్య వర్గాలదే పూర్తి ఆధిపత్యం కాదు. వారిలో కొందరు పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందుతారు. కొంతమంది గ్రామాల్లో భూస్వామ్య ఆధిపత్యం కొనసాగిస్తూనే పట్నాల్లో పెట్టుబడిదారీ వర్గంలోకి ప్రవేశించారు. భారత దేశంలో ఇలాంటి అనేకమందిని మనం చూడగలం. [భారత దేశ భూస్వామ్య వ్యవస్ధకు ‘కుల వ్యవస్ధ’ ప్రధాన పట్టుగొమ్మ. కులం పునాదులు బలహీనపడుతున్నాయని చెబుతున్నప్పటికీ అగ్ర కుల భూస్వామ్య వర్గ…

Bala Gopal

బాల గోపాల్ ‘మానవ ప్రవృత్తి’ వాదన, విమర్శ

(“మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత” పేరుతో ఈ బ్లాగ్ లో రాసిన వ్యాసం కింద కొద్ది రోజుల క్రితం ‘మౌళి గారు’ రాసిన వ్యాఖ్యకి సమాధానాన్ని టపా గా ప్రచురిస్తున్నాను -విశేఖర్) బాల గోపాల్ గారు మార్క్సిజంలో ఖాళీలున్నాయని రాసారు. మానవ ప్రవృత్తి అనేది ప్రత్యేకంగా ఒకటుంటుందనీ, దానిని మార్క్సిజం పట్టుకోలేక పోయిందని ఆయన అభిప్రాయ పడ్డాడు. భౌతిక సమాజ నియమాలకు అతీతంగా మానవ ప్రవృత్తి ఉంటుందని ఆయన అభిప్రాయం. ఇంకా అలాంటివి మరి…

శ్రీకాంత్ గారూ, మీకు సమాధానం త్వరలో ఇస్తాను, ఆలోగా ఇది చూడండి

నేను (విశేఖర్) ఇతర బ్లాగుల్లోకి వెళ్ళడం తక్కువ. ఇపుడే నా డాష్ బోర్డ్ లో లేటేస్ట్ పోస్టులు చూస్తుండగా ‘స్వదేశీ కమ్యూనిస్టుల దేశ భక్తి…’ అంటూ మీ పోస్టు లింక్ చూసి దాన్ని పట్టుకుని మీ బ్లాగ్ కి వచ్చాను. అందులో సైడ్ కాలంలో ‘నన్ను ఉద్దేశిస్తూ ఓ పోస్టు’ ఉన్నట్లు గమనించి అదీ చూశాను. మీరు జనవరి ఎనిమిది న ఆ పోస్టు రాసినట్లు చూశాను. ఈ రోజు పన్నెండు. ఆలస్యంగా చూశాను. కాని మరో…

మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత

‘మానవ స్వభావంలో మార్క్సిజం లో ఇమడని లక్షణాలు ఉన్నాయని’, ‘మార్క్సిజం లో ఖాళీలున్నాయనీ‘, “మార్క్సు చూడనిది మానవ స్వభావంలో ఏదో ఉందని” ఇలాంటి భావాలు మానవ హక్కుల సంఘం నేత బాలగోపాల్ గారు ఒక ధీసిస్ లాంటిది రాశారు. అప్పటివరకూ ఆయన పౌరహక్కుల సంఘం నాయకుడుగా ఉంటూ పీపుల్స్ వార్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారు. దానినుండి బైటికి వచ్చి ఆయన మానవ హక్కుల సంఘం పెట్టారు. “పౌర హక్కుల…” నుండి “మానవ హక్కుల…” అనే కాన్సెప్ట్…

జానకి విముక్తి – కమ్యూనిస్టులు – కమ్యూనిస్టు ఆచరణ

(గమనిక: ఈ బ్లాగ్ లో ‘జానకి విముక్తి’ నవలపై ఇంతక ముందు రాసిన “రంగనాయకమ్మ గారు – జానకి విముక్తి – మార్క్సిజం” అన్న పోస్టుపై జరిగిన చర్చలో ఇచ్చిన సమాధానం ఇది. దాన్ని పోస్టుగా మార్చాలని ఇచ్చిన సూచన మేరకు కొన్ని మార్పులు చేసి పోస్టు చేయడమైనది) ఒక నవలనుగానీ, పుస్తకాన్ని గానీ చదివినవారు ఎవరైనా అందులో తమకు ఇష్టమైనంతవరకే లేదా అర్ధమైనంతవరకే స్వీకరిస్తారు. నమ్ముతారు కూడా. తమ ఆలోచనా పరిధిలో తర్కించుకుని ‘ఇది బాలేదు’…

రంగనాయకమ్మ గారు – జానకి విముక్తి – మార్క్సిజం

(పుస్తకం బ్లాగ్ లో జానకి విముక్తి నవల పైన సమీక్ష రాశారు. సమీక్షపైన అర్ధవంతమైన చర్చ జరుగుతోంది. అక్కడా కామెంటు రాయడం మొదలుపెట్టి అది కాస్తా ఎక్కువ కావడంతో ఇక్కడ నా బ్లాగ్ లో పోస్టుగా రాస్తున్నా.) “ఒక మంచి డాక్టర్ కావాలంటే ముందు వారు మార్క్సిస్టు అయి ఉండాలి. ఒక మంచి తండ్రి కావాలంటే ముందు మార్కిస్టు అయి ఉండాలి. …” అని రంగనాయకమ్మగారు తన ‘పెట్టుబడి పరిచయం’ పుస్తకం వెనక అట్టమీద రాస్తారు. మార్క్సిజాన్ని…

ఎమర్జింగ్ దేశాలు ఆంటే అర్ధం ఏమిటి?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల వర్గీకరణలో “ఎమర్జింగ్ దేశాలు” అనే కొత్త పదం ఒకటి వచ్చి చేరింది. ఈ పదం చేరక ముందు మూడు రకాల వర్గీకరణ మాత్రమే ఉండేది. అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలను మొదటి ప్రపంచం అని పిలుస్తున్నాము. గతంలో రష్యా, అమెరికాలు రెండు అగ్ర రాజ్యాలు కనుక ఆ రెండు మొదటి ప్రపంచం అన్నారు. ఆ తర్వాత రష్యా పతనం కావటంతో అమెరికా ఒక్కటే మొదటి ప్రపంచంగా ఉంటూ వచ్చింది.…