ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం: రెండు వేలు దాటిన అమెరికన్ల చావులు
అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి సాగిస్తున్న ‘ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధం’ లో అమెరికా సైనికుల చావులు 2,000 దాటిందని బి.బి.సి తెలిపింది. అయితే, స్వతంత్ర సంస్ధల లెక్కకూ, అమెరికా నాటో ల లెక్కకూ అమెరికా చావుల్లో ఎప్పుడూ తేడా ఉంటుంది. స్వతంత్ర సంస్ధ ‘ఐ కేజువాలిటీస్’ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2,125 కి పైనే. తాలిబాన్ మిలిటెంట్ల చేతుల్లో అమెరికా సైనికులు మరణించారని వార్తా సంస్ధలు చెప్పినపుడు కొన్ని సార్లు ఆ వార్తలను అమెరికా…














