ఈజిప్టు తిరుగుబాటు విజయవంతం అయినట్లేనా?

దాదాపు ముప్ఫై మంది వరకు అమరులై పద్దెనిమిది రోజుల పాటు కొనసాగిన ఈజిప్టు ప్రజల నియంతృత్వ వ్యతిరేక తిరుగుబాటు విజయవంతం అయినట్లేనా అన్న అనుమానం ఇప్పుడు అంతర్జాతీయ పరిశీలకులతో పాటు ఈజిప్టు ప్రజలను సైతం పట్టి పీడిస్తోంది. తిరుగుబాటు లేవనెత్తిన ప్రధాన డిమాండు ప్రజాస్వామ్య పరిపాలన రావాలని. పార్టీలు ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛ, అభిప్రాయం వ్యక్తం చేసుకొనే స్వేచ్ఛ, సంఘాలు నిర్మించుకొనే స్వేచ్ఛ కావాలని తిరుగుబాటుదారులు మనసారా కోరుకున్నారు. ఆ డిమాండ్లు నెరవేరుతాయా లేదా అన్న అనుమానాలు…

లిబియాలో ఫిబ్రవరి 17 న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన కోసం పధకం

యెమెన్, బహ్రెయిన్, ఇరాన్ ల అనంతరం ఇప్పుడు లిబియాలో ప్రభుత్వ వ్యతిరేకులు నిరసన ప్రదర్శనలకు పిలుపినిచ్చారు. ఇంటర్నెట్ ద్వారా ప్రదర్శకులు ప్రధానంగా ఆర్గనైజ్ అవుతున్నారు. కానీ లిబియాలో ప్రభుత్వాన్ని కూల్చివేసే బలం ప్రభుత్వ వ్యతిరేకులకు లేదని పరిశీలకుల అభిప్రాయం. గురువారం, ఫిబ్రవరి 17న “ఆగ్రహ దినం” జరపాలని నిరసనకారులు నిర్ణయించుకోగా దానికి ఒక రోజు ముందే లిబియాలోని ఓడరేవు పట్టణమయిన బెంఘాజి లో లిబియా నాయకుడు “మహమ్మద్ గఢాఫి” వ్యతిరేక, అనుకూలుర మధ్య ఘర్షణలు చెలరేగాయి. కొద్ది…

సైన్యం చేతిలో ఈజిప్టు భవితవ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేరేనా?

“ఈ నియంత మాకొద్దం”టూ పద్దెనిమిది రోజుల పాటు ఎండా, వాన తెలియకుండా, రాత్రీ పగలూ తేడా చూడకుండా వీధుల్లోనే భార్యా బిడ్డలతో సహా గడిపి ఈజిప్టు పౌరుడు ఆందోళనలో పాల్గొని నియంత ముబారక్ ను దేశం నుండి సాగనంపాడు. వారి ప్రధాన కోరిక అయిన ప్రజాస్వామ్య పాలన ఇంకా దేశంలో ఏర్పడలేదు. ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ చట్టంతో తమని పాలించటానికి ఏ శక్తి సాయం చేసింది? దేశంలో సైన్యమే ముబారక్ కు అండదండలిచ్చి కాపాడితే,…

ఎట్టకేలకు ముబారక్ రాజీనామా, ఆనందోత్సాహాల్లో ఈజిప్టు ప్రజలు

  కేవలం నెలరోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఆఫ్రికా నియంతలు నేల కూలారు. సైన్యం ఆందోళన కారులకు వ్యతిరేకంగా మద్దతు ఇయ్యలేమని తెలియజేయటంతో ట్యునీషియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన 27 రోజుల్లోనే ఈజిప్తు అధ్య్క్షుడు ముబారక్ సైతం అవే పరిస్ధితుల నడుమ అధికారన్ని త్యజించక తప్పలేదు. పద్దెనిమిది రోజుల ఆందోళనల అనంతరం ముబారక్ తలొగ్గాడు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సైన్యానికి బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. ఉపాధ్యక్షుడు సులేమాన్ ఈ మేరకు…

పదవిని వీడని ముబారక్, అమెరికా సూచన బేఖాతరు

గురువారం సాయంత్రం ముబారక్ దిగిపోనున్నాడని చాలా మంది ఊహించినప్పటికీ ఆయన సెప్టెంబరు వరకూ దిగేది లేదని ప్రకటించాడు. కొన్ని అధికారాలు ఉపాధ్యక్షునికి అప్పగిస్తానని ప్రకటించాడు. కానీ ఏ అధికారాలనేది స్పష్టం కాలేదు. బయటివారి ఒత్తిళ్ళను, నిర్దేశాలను తాను లెక్క చేయనని కూడా ముబారక్ ప్రకటించాడు. సైన్యం “పరిస్ధితులు కుదుట పడ్డాక ఎమర్జెన్సీని తప్పకుండా ఎత్తివేస్తామని ప్రకటించింది. మామూలు పరిస్ధితులు ఏర్పడటానికి సహకరించాలని మరోసారి కోరింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముబారక్ ప్రకటనకు ఒకింత తీవ్రంగా స్పందింఛాడు.…

ప్రతిఘటిస్తున్న ముబారక్, విస్తరణ వ్యూహంలో ఆందోళనకారులు

అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం…

ముబారక్ దిగిపోవాలన్న అమెరికాపై ఈజిప్టు మంత్రి ఆగ్రహం

అధికారాన్ని అప్పగించేందుకు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ముబారక్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన అమెరికా గత రెండు మూడు రోజులుగా స్వరం మార్చి ముబారక్ దిగి పోవాలని డిమాండ్ చేస్తుండడంతో ఈజిప్టు విదేశాంగ మంత్రి అబౌల్ ఘీత్, అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమర్జెన్సీ పరిస్ధుల చట్టాన్ని ఎత్తివేయలన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ అమెరికా తన కోరికలను ఈజిప్టుపై రుద్దకూడదన్నాడు. జనవరి 25 నుండి ముబారక్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో రాజధాని కైరోతో పాటు వివిధ పట్టణాలలో…

భారత ద్రవ్యవిధానం పై ఈజిప్టు పరిణామాల ప్రభావం -ఆర్.బి.ఐ

ఈజిప్టులో హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు భారత దేశ ద్రవ్యవిధానం పైన ప్రభావం చూపుతాయని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈజిప్టు పరిణామాలు బొత్తిగా ఊహించని విధంగా వచ్చి పడ్డాయని, జనవరి ద్రవ్య విధాన సమీక్ష తర్వాత జరిగిన ఈ పరిణామాలు సమీక్షను పూర్వ పక్షం చేశాయనీ ఆయన అన్నారు. RBI Governer Duvvuri Subba Rao గత జనవరి 25 న రిజర్వు బ్యాంకు భారత పరపతి విధానాన్ని సమీక్షించి వడ్డీ…

ఈజిప్టులో అమెరికా దాగుడు మూతలు

ముప్ఫై ఏళ్ళనుండి పాలిస్తూ తమకు కనీస హక్కులు కల్పించని ముబారక్ దిగిపోవాలని ఈజిప్టు ప్రజలు గత పన్నెండు రోజిలుగా ఆందోళన చేస్తుండగా అమెరికా కల్లోలంలో తమకు ఏ విధంగా లాభం చేకూరుతుందా అని అమెరికా, యూరోపియన్ యూనియన్ గోతికాడ గుంటనక్కల్లా చూస్తున్నాయి. Muslim Brotherhood Leader Mohammed Badie అధికారారం అప్పగించడానికి శాంతియుత ప్రక్రియను ప్రారంభించాలని ప్రకటనలిస్తూ వస్తున్న అమెరికా తన మరో ముఖాన్ని చూపించింది. అమెరికా తరఫున ప్రత్యేక దూతగా వచ్చిన ఫ్రాంక్ విజ్నర్ అధికారం…

“డే ఆఫ్ డిపార్చర్” పాటిస్తున్న ఈజిప్టు జనం, తెర వెనుక అమెరికా బిజీ

ఈజిప్టులో ఆందోళనకారులు ముబారక్ శుక్రవారం (ఫిబ్రవరి ౪) లోగా రాజీనామా చేయాలని గడువు విధించిన సంగతి విదితమే. తమ డిమాండును గట్టిగా వినిపించటానికి శుక్రవారం అన్ని ప్రధాన పట్టణాలలో ప్రజలు పదుల వేల సంఖ్యలో చేరుతున్నట్లుగా బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రెసిడెంటు గా తానూ విసిగిపోయాననీ, కానీ తాను దిగిపోతే దేశంలో అల్లకల్లోల పరిస్థిలు ఏర్పడతాయి కనుక తాను రాజీనామా చేయబోననీ ముబారక్ ప్రకటించాడు. ఆందోళనకారుల నాయకుల్లో ఒకరైన్ అల్ బరాదీ అధ్యక్షునికి సమధానం ఇస్తూ…

ఈజిప్టు అధ్యక్షుడు రాజీనామా చేస్తాడా?

ఈజిప్టు అధ్యక్షుదు హొస్నీ ముబారక్ రాజీనామా చేయాలనంటూ ఈజిప్తు ప్రజలు గత పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ప్రజలు ఈ శుక్రవారం లోగ అధ్యక్ష్తుదు రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చిన సంగతీ తెలిసిందే. గత పది రోజులుగా వెల్లువెత్తుతున్న ప్రజాందోళనలకు ఠారెత్తిన ముబారక్ శుక్రవారం నాడు తాను రాజీనామా చేయటానికి అంగీకరిస్తూనే ఒక మెలిక పెట్టాడు. తనకు రాజీనామా చేయాలనే ఉన్నప్పటకీ తన రాజీనామా తర్వాత దేశంలో అల్లర్లు తలెత్తుతాయేమోనని…