ముబారక్ దిగిపోవాలన్న అమెరికాపై ఈజిప్టు మంత్రి ఆగ్రహం
అధికారాన్ని అప్పగించేందుకు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ముబారక్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన అమెరికా గత రెండు మూడు రోజులుగా స్వరం మార్చి ముబారక్ దిగి పోవాలని డిమాండ్ చేస్తుండడంతో ఈజిప్టు విదేశాంగ మంత్రి అబౌల్ ఘీత్, అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమర్జెన్సీ పరిస్ధుల చట్టాన్ని ఎత్తివేయలన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ అమెరికా తన కోరికలను ఈజిప్టుపై రుద్దకూడదన్నాడు. జనవరి 25 నుండి ముబారక్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో రాజధాని కైరోతో పాటు వివిధ పట్టణాలలో…