కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి -2

మొదటి భాగం తరువాయి… … ‘కమ్యూనిస్టు హోలోకాస్ట్’ కి సంబంధించిన పాపపు కధలన్నీ పశ్చిమ దేశాలు కనిపెట్టినవిగా నేను మాట్లాడిన కాంబోడియన్లు కొట్టిపారేశారు. నిజంగా ఏంజరిగిందో వారు నాకు గుర్తుచేశారు. 1970లో న్యాయబద్ధమైన తమ పాలకుడు యువరాజు సిహ్నౌక్ ని అమెరికన్లు వెంటపడి తరిమేసి అతని స్ధానంలో తమ కీలుబొమ్మ, మిలటరీ డిక్టేటర్ లోన్ నోల్ ను ప్రతిష్టించడంతో వారి కష్టాల చరిత్ర ప్రారంభం అయింది. లోన్ నోల్ మధ్య నామం అవినీతి. అతని అనుచరులు తమకు…

కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి 1

(ప్రఖ్యాత అంతర్జాతీయ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, మాస్కో నివాసి అయిన ఇస్రాయెల్ షమీర్ సెప్టెంబర్ 18 తేదీన ‘కౌంటర్ పంచ్’ పత్రికకు రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. కాంబోడియాలో అమెరికా సాగించిన నీచ హత్యాకాండలను కప్పి పుచ్చుకోవడానికీ, బైటికి రాకుండా చేయడానికీ కమ్యూనిస్టు విప్లవ నేత పోల్ పాట్ పై అనేక అబద్ధాలు సృష్టించి పశ్చిమ పత్రికలు, రాజ్యాలు ప్రచారంలో పెట్టాయి. తన ప్రజలను తానే మిలియన్ల సంఖ్యలో మట్టుపెట్టిన  రక్తపిపాసిగా ప్రపంచం అంతా గుర్తుకు…

చదువు కోసం అడుక్కున్న ఐశ్వర్య, సమాజం బతికేఉందని నిరూపించిన దాతలు

కడుపు చూపిస్తూ అడుక్కునే భిక్షకులు కోకొల్లలు. పిల్లల్ని భిక్షక వృత్తిలో దింపి లక్షలు, కోట్లు సంపాదించే మాఫియా ముఠాలకు కొదవలేదు. పదవులు, కాంట్రాక్టులు అడుక్కోవడం రాజకీయ నాయకులు, సూపర్ ధనికుల జన్మహక్కు. కానీ పొట్ట కోసం అడుక్కుంటున్న నాయనమ్మకి తెలియకుండా పక్కనే నిలబడి చదువుకోసం రహస్యంగా సహాయం కోరిన ఐదేళ్ల ఐశ్వర్య కధ ఎవరూ విని ఉండరు. మతి చలించి తనను వదిలి వెళ్ళిపోయిన అమ్మ కోసమేనేమో తెలియదు గానీ డాక్టరీ చదువుకోవాలన్న బలమైన కోరిక ఐశ్వర్యను…

అమెరికా దురాక్రమణపై పోరాటంలో తాలిబాన్ పరిమితులు గుర్తించాలి

(ఇది నాగరాజు అవ్వారిగారి వ్యాఖ్య.  తాలిబాన్ కి మద్దతు ఎందుకివ్వాలన్నదీ వివరిస్తూ నేను రాసిన ఆర్టికల్ కింద రాసిన వ్యాఖ్య. ‘తాలిబాన్ కి మద్దతు’ లాంటి పెద్ద పదాలను ఉపయోగించనవసరం లేదన్న ఆయన సూచనని నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను. తాలిబాన్ కి ఉన్న పరిమితులను గుర్తించాలన్న నాగరాజు గారి పరిశీలన వాస్తవికమైనది. తాలిబాన్ గురించి ఆయన చేసిన విశ్లేషణ సమగ్రంగా ఉన్నందున, పాఠకులకు ఉపయోగం అన్న దృష్టితో ఆయన రాసిన రెండు వ్యాఖ్యలను కలిపి టపా గా…

తాలిబాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి మద్దతు ఎందుకివ్వాలి?

(గత మలాల యూసఫ్జాయ్ ఆర్టికల్ కింద వ్యాఖ్యాత చక్రిగారు ఒక కొత్త కోణాన్ని పాఠకుల ముందు ఉంచారు. ‘వర్టికల్ మరియు హారిజాంటల్ సమస్య’ అనే దృష్టి కోణంలో తాను సమస్యను చూస్తున్నట్లు చెప్పారు. సామాజిక విశ్లేషణల్లోనే కాక ప్రజలతో సంబంధం ఉన్న అనేక ఇతర సమస్యల విశ్లేషణలో కూడా  కొందరు ఈ కోణాన్ని తరచుగా ప్రస్తావిస్తారు. ఈ కోణంలో చూసినపుడు వ్యవస్ధాగత సమస్యలు కొంత తేలికగా అర్ధం అయే అవకాశం ఉంటుంది. తన దృష్టిలో ఏది వర్టికల్,…

మలాల యూసఫ్జాయ్: అమెరికా దురాక్రమణ యుద్ధ వాస్తవాలు వాస్తవాలే, ‘కుట్ర సిద్ధాంతాలు’ కాదు

కుట్రలు లేనిదే అమెరికా ప్రపంచాధిపత్యం నడవదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో పాటు యూరప్ లో కూడా అమెరికా జరిపిన, జరిపిస్తున్న కుట్రల సమాచారం బైటికి వచ్చినప్పుడల్లా, వాటిని ‘కుట్ర సిద్ధాంతాలు’ గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కొట్టిపారేయడం పరిపాటి. అది వాటి అవసరం, ప్రయోజనం. అందువల్లనే ప్రత్యామ్నాయ వార్తా సంస్ధలు పూనుకుని ఈ కుట్రలను బైటికి తీస్తున్నాయి. మనం చేయవలసింది వాటిని గుర్తించడమే తప్ప అక్కడ కూడా పశ్చిమ పత్రికల ప్రచారంలో కొట్టుకుపోయి ‘కుట్ర సిద్ధాంతాలు’గా…

వాల్ మార్ట్ కార్మికుల ‘బ్లాక్ ఫ్రైడే’ సమ్మె హెచ్చరిక

వాల్ మార్ట్ వస్తే ఉద్యోగాలొస్తాయని భారత ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నమ్మబలికాడు. ప్రధాని చెప్పిన ఉద్యోగాల తీరు ఎలా ఉంటుందో అమెరికా వాల్ మార్ట్ కార్మికుల సమ్మె హెచ్చరిక స్పష్టం చేస్తున్నది. అతి తక్కువ వేతనాలతో కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్న వాల్ మార్ట్ విధానాలకు వ్యతిరేకంగా రానున్న ‘బ్లాక్ ఫ్రైడే’ రోజున దేశ వ్యాపిత సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు. అమెరికా వ్యాపితంగా అనేక నగరాల్లో ఇప్పటికే వాకౌట్లు, కవాతులు నిర్వహించిన…

డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా ప్రభుత్వం ఏజెంటు -కేజ్రీవాల్

సోనియా గాంధీ అల్లుడి గిల్లుడి పై దృష్టి పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన స్వరాన్ని మరింత పెంచాడు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించకుండా స్ధిరాస్తి కంపెనీ ‘ఢిల్లీ లాండ్ అండ్ ఫైనాన్స్’ (డి.ఎల్.ఎఫ్) కి దళారీగా వ్యవహరిస్తున్నదని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. భారత దేశానికి అనధికారిక ప్రధమ కుటుంబంగా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అభివర్ణించే సోనియా కుటుంబ అల్లుడు రాబర్ట్ వాద్రా కు అయాచిత లబ్ది చేకూర్చిన డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా రాష్ట్ర…

సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా కొత్త కుట్ర

సిరియా కిరాయి తిరుగుబాటు ఎంతకీ ఫలితం ఇవ్వకపోవడంతో ఆ దేశంపై ప్రత్యక్ష దాడికి అమెరికా కొత్త మార్గాలు వెతుకుతోంది. రష్యా జోక్యంపై అబద్ధాలు సృష్టించి ఆ సాకుతో తానే ప్రత్యక్షంగా రంగంలో దిగడానికి పావులు కదుపుతోంది. జులైలో సిరియాలో జొరబడిన టర్కీ విమానాన్ని సిరియా ప్రభుత్వం కూల్చివేయడం వెనుక రష్యా హస్తం ఉందంటూ తాజాగా ప్రచారం మొదలు పెట్టింది. సిరియా కిరాయి తిరుగుబాటుకి ఆర్ధిక, ఆయుధ సహాయం చేస్తున్న సౌదీ అరేబియాకి చెందిన చానెల్ ఆల్-అరేబియా ఈ…

మిమ్మల్నీ, దేశాన్నీ దేవుడే కాపాడాలి, కేంద్రంతో సుప్రీం కోర్టు

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. జడ్జిలకు ఇంటి సౌకర్యం కల్పించాలన్న రూల్ ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహించింది.  వాటర్ ట్రిబ్యునల్ లో సభ్యులైన జడ్జిలకు ఢిల్లీలో ఇంటి సౌకర్యం కల్పించడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వాన్ని దేవుడే కాపాడాలని ఆకాంక్షించింది. ఇలాంటి ప్రభుత్వ పాలనలో ఉన్నందుకు దేశాన్ని కూడా దేవుడే కాపాడాలని ప్రార్ధించింది. ఇళ్ళు ఇవ్వడం ఇష్టం లేకపోతే వాటర్ ట్రిబ్యూనళ్ళకు జడ్జిలను సభ్యులుగా నియమించే చట్టాన్ని రద్దు చేయాలని కోరింది. “రూల్స్ ప్రకారం ఇంటి సౌకర్యానికి వారు…

తెలంగాణ ఎక్కడ? -కార్టూన్

“తెలంగాణా! అదెక్కడుంది?” కేంద్ర సచివుడు వయలార్ రవి కొద్ది రోజుల క్రితం వేసిన ప్రశ్న ఇది. కేంద్రంలో తిష్టవేసి, ఆంధ్ర దొరల డబ్బు కట్టలు మేస్తూ తెలంగాణ ప్రజల రాష్ట్ర ఆకాంక్షలను చెద పురుగుల్లా కొరికేస్తున్న అవినీతి కీటకాలు ఇలాంటి గుడ్డితనాన్ని ఇప్పటికి చాలా సార్లు ప్రదర్శించాయి. వీరి అంధత్వాన్ని గేలి చేస్తూ తెలంగాణ ప్రజలు పదే పదే ఆందోళనలు నిర్వహించి తెలంగాణ ఎక్కడుందో చాచికొట్టినట్లు చెప్పినా కళ్ళు తెరవడానికి వీరు నిరాకరిస్తున్నారు. పోలీసులు, పారా మిలటరీ…

ప్రజాస్వామ్యం నవ్వులపాలు, సాగరహారం వర్షం పాలు

‘తెలంగాణ మార్చ్’ మరో సీరియస్ ఉద్యమంగా మారకుండా వర్షం అడ్డుపడడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బతికిపోయింది. మార్చ్ కి అనుమతించినట్లే అనుమతించి పోలీసులతో ఎక్కడికక్కడ నిర్బంధం ప్రయోగించడం ద్వారా మార్చ్ ని విఫలం చేయడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించడంతో రాజకీయ ఐకాస నాయకత్వం ఆగ్రహించింది. ప్రభుత్వం, పోలీసుల మోసానికి ప్రతిగా సాయంత్రం 7 గంటల లోపు మార్చ్ ముగిస్తామన్న హామీని రద్దు చేసుకుని, రాత్రంతా కొనసాగించనున్నట్లు ఐ.కా.స నాయకులు ప్రకటించారు. వర్షం వస్తున్నప్పటికీ మార్చ్ కొనసాగిస్తామని…

కూడంకుళం: ‘ఇదింతకరై’ లో అప్రకటిత ఎమర్జెన్సీ -నిజ నిర్ధారణ నివేదిక

కూడంకుళంలో మత్స్యకారుల శాంతియుత నిరసనలను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్రాల సోకాల్డ్ ప్రజాస్వామిక ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్రూర నిర్బంధ విధానాలు స్వతంత్ర పరిశీలకుల ద్వారా మరోసారి వెల్లడైనాయి. కూడంకుళం అణు కర్మాగారంలో అణు ఇంధనం నింపడానికి వ్యతిరేకంగా సెప్టెంబరు 10 తేదీన సముద్రతీర గ్రామ ప్రజలు చేపట్టిన శాంతియుత ఆందోళనపై పోలీసులు అమానుష నిర్బంధాన్ని ప్రయోగించారనీ పిల్లలు, స్త్రీలపై కూడా బలప్రయోగం చేశారనీ, మైనర్ పిల్లలపై దేశ ద్రోహం నేరం మోపి బాలల ఖైదుకి పంపారని నిజనిర్ధారణ కమిటీ…

వేలం పద్ధతే గీటురాయి కాదు, సహజ వనరుల దోపిడీకి సుప్రీం కోర్టు బాసట!

2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల రద్దు సందర్భంగా తానిచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పునర్నిర్వచించింది. 2జి తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకు మాత్రమే వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ పై తీర్పు చెబుతూ సుప్రీం కోర్టు గురువారం ఈ వివరణ ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తన తీర్పు ప్రకటిస్తూ ‘సహజ వనరులను వేలం వేయాలన్న’ తన 2జి తీర్పు ఇతర సహజ…

మరోసారి పోరాట పధంలో గ్రీసు ప్రజలు, కార్మిక సంఘాలు

గ్రీసు ప్రజలు మరోసారి రోడ్డెక్కారు. పాత ప్రభుత్వం విధానాలనే కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం పట్ల ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. త్రయం (troika) గా పిలిచే యూరోపియన్ యూనియన్ (ఇ.యు), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి), ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా విధించిన నూతన షరతులను ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడడం పట్ల దేశవ్యాపిత నిరసనలకు పూనుకున్నారు. త్రయం ఆదేశాల మేరకు కొత్త ప్రభుత్వం విధించ తలపెట్టిన 11.5 బిలియన్ యూరోల (15 బిలియన్ డాలర్లు) కోతలను మూకుమ్మడి నిరసన…