ఐఎంఎఫ్ నిర్దేశిత కఠిన ఆర్థిక సంస్కరణలు: అంగోలా ప్రజల నిరసనోద్యమం

ఆంగ్లం: విజయశేఖర్ అనువాదం: రమాసుందరి అంగోలా ఇటీవలి కాలంలో ఆర్థిక సంస్కరణలు, సామాజిక కలహాల కూడలిలో చిక్కుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సూచనలతో మొదలైన కఠిన ఆర్థిక (పొదుపు) సంస్కరణల కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదరికంతో అలమటిస్తున్న ప్రజలు తమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం మీద ప్రభుత్వం ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించటం అత్యంత విషాదానికి దారితీసింది. 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తదుపరి…

కేంద్రం ఐ.టి రూల్స్ సవరణపై బొంబే హై కోర్టు మొనగాడి తీర్పు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షాల నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ఐ.టి రూల్స్ 2021 చట్టానికి 2023లో తలపెట్టిన సవరణలు రాజ్యాంగ విరుద్ధం అని బొంబే హై కోర్టు నియమించిన ‘టై బ్రేకర్’ జడ్జి జస్టిస్ అతుల్ చందూర్కర్ తీర్పు ఇచ్చారు. తాజా తీర్పుతో జనవరి 2024లో ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచిలోని ఇద్దరు జడ్జిలు ఇచ్చిన విభిన్నమైన చెరొక తీర్పు (split verdict) ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా మారింది. ఐ.టి…

ఆర్ జి కార్ డాక్టర్ల ఆందోళనకు పరిష్కారం ఎప్పుడు?

అటు సుప్రీం కోర్టు, ఇటు కోల్ కతా ప్రభుత్వం, మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లు ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ & ఆసుపత్రి లో అత్యాచారం, హత్య కు గురైన బాధిత మెడికో కు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు. బాధితురాలి తల్లిదండ్రులతో పాటు, ఆసుపత్రి సీనియర్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, దేశ వ్యాపితంగా ఆందోళన చేస్తున్న…

సాక్షాలు నాశనం చేశారు: కోల్కతా సీనియర్ డాక్టర్లు

ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అమానుష అత్యాచారం, హత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు చేసిన నాలుగు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సెపెంబర్ 16 తేదీన, సోమవారం మరోసారి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు ఈ రోజు (16 సెప్టెంబర్) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా గం 6:30 ని.లకు ప్రారంభం అయినట్లు తెలుస్తున్నది. కాగా అత్యాచారం…

కేజ్రీవాల్ కి బెయిల్

ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిలు మంజూరు చేసింది. ఇతర రాజకీయ పార్టీల వలే బెయిల్ మంజూరుని పెద్ద విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటున్నది. బహుశా నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలను జైళ్ల పాలు చేసి వారు ఏ పేరుతోనైనా సరే విడుదల కాకుండా ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వం తరపున వాదించే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, ఇతర ప్రభుత్వ లాయర్లు తీవ్రంగా…

గాజా హత్యాకాండకు బాధ్యులెవరు?

గాజాలో మానవ హననం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ సైన్యం – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) హమాస్ ని సాకుగా చూపిస్తూ విచక్షణా రహితంగా పాలస్తీనీయుల జనావాసాలపైనా, శరణార్ధి శిబిరాల పైనా, శరణార్ధులకు ఐరాస ఆహార సరఫరాలు తెస్తున్న ట్రక్కుల పైనా, ఐడిఎఫ్ బాంబింగ్ లో గాయపడ్డ పాలస్తీనీయులను ఆసుపత్రులకు తరలిస్తున్న అంబులెన్స్ ల పైనా… ఇదీ అదీ అని లేకుండా పాలస్తీనీయులకు సంబంధించిన సమస్త నిర్మాణాల పైనా మిసైళ్లు, బాంబులు, లాయిటర్ బాంబులు, డ్రోన్ బాంబులు,…

బంగ్లాదేశ్ ఉద్యోగాల రిజర్వేషన్ గురించి…

జనవరి 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆవామీ లీగ్ పార్టీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా నాలుగవ సారి పదవి చేపట్టిన షేక్ హసీనా మరో 6 నెలల్లోనే పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు కోరవలసి వచ్చింది. 15 యేళ్ళ పాటు అవిచ్ఛిన్నంగా ప్రజాస్వామ్య వాసనలు లేకుండా దాదాపు డిక్టేటర్ తరహాలో బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనా ప్రస్తుత పరిస్ధితి స్వయంకృతాపరాధమే అని ది హిందూ లాంటి పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ పరిశీలనలో…

బంగ్లా సంక్షోభం, అమెరికా పుణ్యం!

Awami League Leader and Ousted PM Shaik Hasina జనవరి 2024 ఎన్నికల్లో 4వ సారి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా ఎన్నికయిన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా సోమవారం ఆగస్టు 5 తేదీన అక్కడి మిలటరీ సమకూర్చిన హెలికాప్టర్ లో ఇండియాకు పారిపోయి రావడంతో భారత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జులై 1 తేదీ నుండి బంగ్లా దేశ్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ పరిస్ధితి ఇంతటి తీవ్ర పరిణామాలకు…

విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశాడు -చంద్రబాబు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ రంగం పైన శ్వేత పత్రం విడుదల చేస్తూ ముఖ్య మంత్రి గత ముఖ్య మంత్రి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం అనేక నష్టాలు ఎదుర్కొన్నదని, ఇప్పుడు అది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని వివరించాడు.…

ఈజిప్టు: పాలస్తీనా ఉద్యమంలో ట్రోజాన్ హార్స్ (5)

Rafah Border సహజవాయువు, టూరిజం 2021లో ఈజిప్టు ఇంధన శాఖ మంత్రి తారెక్ ఆల్-మొల్లా ఇజ్రాయెల్ వెళ్లి ఆ దేశ ఇంధన మంత్రి యువాల్ స్టీనిట్జ్, ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ లతో ఓ ప్రధాన సహకార ఒప్పందం గురించి చర్చలు జరిపాడు. వాషింగ్టన్ డి.సి. లోని అరబ్ సెంటర్ నివేదిక ప్రకారం, “పాలస్తీనా సముద్ర తీరం లోని లెవియాథన్ చమురు ఫీల్డ్ నుండి వెలికి తీసిన సహజ వాయువును సముద్రం అడుగు నుండి వేసిన కొత్త పైప్…

ఈజిప్టు: పాలస్తీనా ప్రతిఘటనలో ట్రోజాన్ హార్స్ (4)

Egypt President Abdel Fattah El-Sisi with Saudi Prince Mohammed Bin Salman 3వ భాగం తరువాత…. పాన్ అరబ్బు జాతీయ ఉద్యమానికి, పాలస్తీనా విముక్తికి సిరియా, ఈజిప్టుల వ్యూహాత్మక సహకారం అత్యవసరం అని ఈజిప్టు నేత గమాల్ అబ్దుల్ నాజర్, సిరియా నేత హఫీజ్ ఆల్-అస్సాద్ లు సరిగ్గానే గుర్తించారు. ఇరు దేశాల సహకారాన్ని అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ సహాయంతో నివారించగలిగాయి. నాజర్ హత్య తర్వాత అన్వర్ సాదత్ నేతృత్వం లోని ఈజిప్టు…

ఈజిప్టు: ట్రోజాన్ హార్స్ (3)

రెండవ భాగం తర్వాత తద్వారా క్యాంప్ డేవిడ్ ఒప్పందం, ముఖ్యంగా అందులో మొదటి ఫ్రేం వర్క్ కేవలం పాక్షిక ఒప్పందమే తప్ప పాలస్తీనా సమస్యను పరిష్కరించే సంపూర్ణ ఒప్పందం కాదని తేల్చి చెప్పింది. అయితే రెండవ ఒప్పందం ఇజ్రాయెల్, ఈజిప్టు లకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందం కనుక, అందులోనూ ఆక్రమిత సినాయ్ నుండి వైదొలగుతామని ఇజ్రాయెల్ అంగీకరించినందున దాని జోలికి ఐరాస జనరల్ అసెంబ్లీ పోలేదు. దాని గురించిన అధికారిక వ్యాఖ్యానం కూడా ఏమీ చేసినట్లు కనిపించదు.…

ఈజిప్టు: పాలస్తీనా ప్రతిఘటనా శిబిరంలో చొరబడ్డ  ట్రోజాన్ హార్స్! (1)

Middle East & North Africa (MENA) ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతాలలో విస్తరించిన అరబ్బు దేశాలలో ఈజిప్టుకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. 5,000 సంవత్సరాలకు పూర్వమే ఆవిర్భవించిన ఈజిప్టు నాగరికత, 6 బిసి సం. లో అఖేమినీడ్ (మొదటి పర్షియన్ వంశం) సామ్రాజ్యం వశం అయ్యే వరకూ స్థానికుల పాలనలోనే కొనసాగింది. ఆ తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజంటైన్లు, ఒట్టోమన్ లు ఈజిప్టును ఒకరి తర్వాత మరొకరు ఆక్రమించుకున్నారు. ఒట్టోమన్ రాజుల…

ఇయు ఎన్నికల్లో మేకరాన్ బోల్తా, ఫ్రాన్స్ మధ్యంతర ఎన్నికలు!

National Rally party workers’ jubilation యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల్లో బొక్క బోర్లా పడడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేకరాన్ దేశంలో మధ్యంతర ఎన్నికలు ప్రకటించాడు. జూన్ 6 తేదీ నుండి 9 తేదీ వరకు యూరోపియన్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఫ్రాన్స్ లో అతి మిత వాద పార్టీగా పేరు పొందిన లీ పెన్ నాయకత్వం లోని నేషనల్ ర్యాలీ పార్టీ ఫ్రాన్స్ నుండి అత్యధిక ఓట్లు సంపాదించడంతో మేకరాన్ అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు ప్రకటించాడు.…

కంగనా చెంప ఛెళ్ళుమనిపించిన కానిస్టేబుల్

బిజేపి తరపు అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ లో పోటీ చేసి ఎంపిగా గెలుపొందిన సినీ నటి కంగనా రణావత్ అనూహ్య రీతిలో ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్ చేతిలో చెంప దెబ్బ తిన్నది. తమ జీవనోపాధిని దెబ్బ తీసే ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే సాధారణ శ్రామిక ప్రజలకు మద్దతు ఇవ్వడం అటుంచి వారి పట్ల ఎంత మాత్రం సానుభూతి చూపకపోవడమే కాకుండా వారిని అభ్యంతరకర పదజాలంతో దూషించడానికి వెనుకాడబోనని కంగనా రణావత్ అనేక సార్లు…