పెట్రోల్ ట్యాంకర్లు పట్టాలు తప్పి పేలిపోతే… -ఫోటోలు

కెనడా రాష్ట్రం క్వెబెక్ లో జులై 6 తేదీన పెట్రోలియం (క్రూడ్ ఆయిల్) తెస్తున్న రవాణా రైలు పట్టాలు తప్పి పెను విధ్వంసం సృష్టించింది. 72 ట్యాంకర్ల నిండా క్రూడాయిల్ తెస్తున్న గూడ్స్ రైలు అనూహ్య పరిస్ధితుల్లో తనంతట తాను కదిలి వేగం పుంజుకుని ఒక మలుపు దగ్గర పట్టాలు తప్పడంతో లాక్-మెగాంటిక్ అనే పట్టణం పాక్షికంగా ధ్వంసం అయింది. ట్యాంకర్లు ఒకదానిపై ఒకటి దొర్లిపడి పేలిపోవడంతో సమీపంలోని అనేక ఇళ్ళు తగలబడి పోయాయి. ఆరు వేల…

ఉత్తర ఖండ్ మరణాలు పదివేలు?

ఉత్తర ఖండ్ జల ప్రళయం మరణాలు పదివేలకు పైనే ఉంటాయని ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మరణాలు ఐదు వేలకు పైనే ఉండొచ్చని అంచనా వేసిన గోవింద్ సింగ్, ఇప్పుడా సంఖ్యను రెట్టింపు చేశారు. గల్లంతయిన వారి సంఖ్య గురించి గ్రామాల నుండి తనకు అందుతున్న సమాచారం ప్రకారం మరణాలు పదివేలకు పైనే ఉండవచ్చని రూఢి అవుతోందని ఆయన తెలిపారు. అయితే ముఖ్యమంత్రి విజయ్…

కేదార్ నాధ్ లో ఏం జరిగింది? -వీడియో

కేదార్ నాధ్ ను ముంచెత్తిన జల ప్రళయం ఎలా జరిగి ఉండవచ్చో ఊహిస్తూ నిపుణులు ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియోను హెడ్ లైన్స్ టుడే పత్రిక తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేయగా యాహూ న్యూస్ షేర్ చేసింది. వీడియోను ఈ బ్లాగ్ లో పబ్లిష్ చేసే మార్గం దొరకలేదు. అందువలన లింక్ మాత్రమే ఇస్తున్నాను.  వీడియోను ‘ఎందుకో ఏమో?’ గారు కింద వ్యాఖ్య ద్వారా అందించారు. కాబట్టి లింక్ ను తొలగించి వీడియో…

ఉత్తర ఖండ్ వరదలు: తెలుగు దేశం ఖాతాలో క్రెడిట్స్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే స్పందించడం ద్వారా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం, వరద బాధితుల అభిమానం చూరగొన్నట్లు కనిపిస్తోంది. పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్ళి తెలియని చోట, తెలియని భాష మధ్య, తెలియని మనుషుల మధ్య పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న బాధితులకు కాసింత పలకరించే దిక్కు కనపడినా కొండంత ధైర్యం, నమ్మకం తెచ్చుకుంటారు. ఆ పని చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ తన పూర్వ వైభవం తెచ్చుకోవడంలో కొంత సఫలం…

ఉత్తర ఖండ్ కాదిది, మీ రాష్ట్రమే! -కార్టూన్

– నాయకుడు: దారుణం! నా హృదయం ఈ అభాగ్యుల కోసం విలపిస్తోంది… పైలట్: ఇది మీ సొంత రాష్ట్రమే సార్, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల మనం వెనక్కి వచ్చేశాం! ———000——— ఉత్తర ఖండ్ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో సంభవించిన మేఘ ప్రళయం (cloud bursts), హఠాత్ వరదల (flash floods) ను సృష్టించింది. ఈ వరదల్లో అనేకమంది తప్పించుకోవడానికి కూడా తగిన వీలు, సమయం లేక అసువులు బాసారు. ఇప్పటివరకు 800 చిల్లర…

2 కోట్లు విదిల్చి రాంబో గొప్పలేల మోడి సారు?

134 మంది పట్టే విమానంలో రెండు రోజుల్లో 15,000 మంది గుజరాతీ యాత్రీకులను నరేంద్ర మోడి రక్షించారట! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారు స్వయంగా ఈ విషయం చెప్పుకుంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఎన్నికల ప్రచారానికి 5,000 మందికి పైగా హిందూ భక్తులు దుర్మరణం చెందినట్లు భయపడుతున్న కేదార్ నాధ్ వరద భీభత్సం కంటే మించిన సదవకాశం నరేంద్ర మోడి గారికి దొరక్కపోవడం అత్యంత అమానుషం కాగా, సాధ్యా సాధ్యాలు పరిశీలించకుండానే మోడీ భక్తాగ్రేసరులు…

ఉత్తరఖండ్ వరదలు: స్వయంకృత మహా విధ్వంసం -ఫోటోలు

ఉత్తర ఖండ్ రాష్ట్రంలో వారం రోజుల క్రితం ఉన్న పళంగా ఊడిపడిన వరదల్లో మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటిదాకా 556 మృత దేశాలను లెక్కించిన అధికారులు వీరి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. సైన్యం రంగంలోకి దిగి ఇప్పటివరకు 73,000 మందిని రక్షించినప్పటికీ వివిధ చోట్ల నీటి తటాకాల మధ్య, రోడ్లు కూలిపోయినందు వల్లా ఇంకా 40,000 మంది ఎటువంటి సాయమూ అందక ఇరుక్కొనిపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత…

ప్రకృతి ఒక్క కసురు కసిరితే చాలు… విలయమే ఇక!

మే 20 తేదీన అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రాన్ని ఒక భారీ పెను తుఫాను తాకింది. ఓక్లహామా నగరం దగ్గర్లోని మూరే లో ఈ తుఫాను సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మధ్యాహ్నం పూట సంభవించిన ఈ రాక్షస తుఫాను దెబ్బకి 24 మంది చనిపోయారని అంట్లాంటిక్ పత్రిక తెలిపింది. గంటకు 200 మైళ్ళ వేగంతో వీచిన విధ్వంసక పెనుగాలులు కలపతో నిర్మించిన ఇళ్లను ఎత్తి కుదేసినట్లు పెకలించి వేశాయి. రెండు మైళ్ళ వెడల్పున విస్తరించిన ఒక…

సాంకేతిక పురోగతితో ఫోటోగ్రఫీ పెనవేసుకున్న వేళ…

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్’ పోటీలు జరుగుతున్నాయి ప్రస్తుతం. మరో ఆరు వారాల పాటు ఎంట్రీలను ఆహ్వానిస్తారట. నేషనల్ జాగ్రఫిక్ వారు నిర్వహిస్తున్న ఈ 25 వ పోటీలకు వచ్చిన కొన్ని ఎంట్రీలను ‘ది అట్లాంటిక్’ ప్రచురించింది. సాంకేతిక పరిజ్ఞానం ఊహకు అందని శిఖరాలకు అభివృద్ధి చెందిన నేపధ్యంలో మనిషి సాధారణ ఊహా శక్తిని అనేక రెట్లకు చేర్చుతోంది ఫోటోగ్రఫి. ఇంకా ఆరు నెలల పాటు ఎంట్రీలకు ప్రవేశం ఉన్నందున తెలుగు నేలను ఆవహించిన ప్రకృతి…

కాలిఫోర్నియాను చుట్టుముడుతున్న దావానలం -ఫోటోలు

అమెరికా పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియాను భారీ దావానలం చుట్టుముడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు చోట్ల దావానలాలను ఆర్పే పనిలో అగ్నిమాపక దళాలు నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం నగరానికి సమీపంలోనే మరో దావానలం అంటుకుని వేలాది ఇళ్లకు ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే పలు ఇళ్లను ఖాళీ చేయించగా లాస్ ఏంజిలిస్  మరో మూడు వేల ఇళ్ళు ప్రమాదంలో ఉన్నట్లు రష్యా టుడే తెలిపింది. కాలిఫోర్నియా రాష్ట్ర వ్యాపితంగా ప్రస్తుతం 3,000 మంది అగ్నిమాపక దళ ఉద్యోగులు ఆరు చోట్ల…

బొగ్గు కేటాయింపులు చట్ట విరుద్ధం -పార్లమెంటు కమిటీ

బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టింది. ఇష్టమొచ్చిన వారికి ఇష్టారీతిన బొగ్గు గనులను కేటాయించారని, గనుల కేటాయింపులో ఎలాంటి పారదర్శకత గానీ, సక్రమమైన పద్ధతులు గానీ పాటించలేదని దుయ్యబట్టింది. ప్రజలు అప్పజెప్పిన అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగపరిచారని జాతీయ సహజ వనరులను కొద్ది సంఖ్యలోని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా దోచిపెట్టిందని తేల్చి చెప్పింది. 1993-2010 మధ్య కాలంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ దేశానికి మసి పూయడంలో భాగస్వామ్యం…

ఫుకుషిమా అణు ఫ్యాక్టరీలో మళ్ళీ పవర్ కట్

రెండేళ్ల క్రితం భారీ ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మూడో నెంబరు అణు రియాక్టరు వద్ద వాడిన అణు ఇంధనాన్ని చల్లబరిచే కూలింగ్ వ్యవస్ధ రెండు గంటల సేపు విఫలం అయిందని జపాన్ వార్తా సంస్ధ క్యోడో న్యూస్ ఏజన్సీని ఉటంకిస్తూ ‘ది హిందు’ తెలిపింది. నెల రోజులలో ఇక్కడ విద్యుత్ సరఫరా విఫలం కావడం ఇది రెండోసారి. తక్షణ ప్రమాదం ఏమీ లేదని అణు కర్మాగారం నిర్వహిస్తున్న…

నీటి ఆటలు కొందరికి; నీటి పాట్లు మరెందరికో -ఫొటోలు

భవిష్యత్తులో నీటి కోసం ప్రపంచ యుద్ధాలు తప్పవని అనేకమంది ఇప్పటికే జోస్యం చెప్పేశారు. భూగ్రహం వేడెక్కుతున్న ఫలితంగా ‘నీటి కొరత ఒక చోట, పల్లెలను, నగరాలను తేడా లేకుండా ముంచెత్తే తుఫాను వరదలు మరొక చోట’ నిత్య వాస్తవంగా మారిపోయింది. లాభ దాహాలతో పరితపించి పోతున్న కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను స్వాధీనం చేసుకుంటూ ప్రజలు దాహంతో పరితపించేలా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. లేకపోతే కాసింత రంగు కలిపి మిలియన్లు దండుకుంటున్న కూల్ డ్రింకు కంపెనీల కోసం…

కొంత బుద్ధి, కొంత జ్ఞానం

బొమ్మలు, సంభాషణల రూపంలో ఉన్న కింది కొటేషన్లను నాకొక మిత్రుడు ఈ మెయిల్ చేశాడు. వీటిని చదివిన వెంటనే నలుగురితో పంచుకోవాలన్న కొరిక బలంగా కలిగింది. “ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విచారం పంచుకుంటే తరుగుతుంది” అంటారు గదా! బహుశా ఆనందం కోవలోకి జ్ఞానం కూడా వస్తుందనుకుంటాను. ఈ బొమ్మలలో వ్యక్తం అవుతున్నది అనుభవజ్ఞులు సమకూర్చిన జ్ఞానం కనుక పంచుకుంటే మరింత ఉపయోగమే కదా! 1)  ఏది నిజం? నిజం అని భావించేవి చాలా వరకు సాపేక్షికమే. ముఖ్యంగా…

బహుళజాతి కంపెనీల కోసం డబ్బులు కాసే కేన్సర్ చెట్లు

“డబ్బులు చెట్లకు కాయవు” ఇది మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఇష్టమైన నీతి సూత్రం. కానీ సాటి మనుషుల జబ్బులనే డబ్బు చెట్లుగా మార్చుకోగల బహుళజాతి కంపెనీల యజమానులు, వారికి యధాశక్తి తోడ్పడే డబ్బు జబ్బుల డాక్టర్లు మసలే పాడు లోకంలో డబ్బులు కుప్పలుగా కాసే కేన్సర్ తోటలు విరివిగా వర్ధిల్లుతున్నాయి. కేన్సర్ ఇప్పుడొక బడా వ్యాపారం అంటే తప్పేం లేదు. అటు ఉత్తర అమెరికా, యూరప్ ల నుండి ఇటు ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా…