‘ధానె’ పెను తుఫాను విధ్వంసం -ఫొటోలు

ధానె పెను తుఫాను ముప్ఫై మూడు మందిని బలిగొంది. పుదుచ్చేరి, కడలూరు, చెన్నై లలో విధ్వంసం సృష్టించింది. విధ్వంసం తాలూకు ఫొటోలను ‘ది హిందూ’ అందించింది. – –

పురుషాధిక్య సమాజంలో పురుషులపై జరిగే అన్యాయాలపై అవగాహన

మిత్రులొకరు పురుషులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏమి చెబుతారు? అని అన్నా గారి గొడ్రాలి వ్యాఖ్యపైన నేను రాసిన పోస్టు కింద అడిగారు. దానికి సమాధానం రాశాను. అది పోస్టుగా చేయగల విషయం అని భావించి ఇక్కడ ఇస్తున్నా. *                              *                         *                              * స్త్రీలకు జరుగుతున్న అన్యాయం నేరుగా పురుషులనుండి జరుగుతుందని భావిస్తే ఈ అనుమానం రావడం సహజం. కాని వాస్తవం ఏమిటంటే, పురుషులకు, స్త్రీలపైన ఆధిపత్యం సమాజం ఇచ్చింది. అంటే సమాజం స్వభావాన్ని బట్టే…

‘పాంచజన్యం’ (బంచ్ ఆఫ్ ధాట్స్) పుస్తకానికి ‘పరిచయం’ ఇది

భారత దేశంలో ముస్లింల విషయంలో ఆర్.ఎస్.ఎస్ సంస్ధ భావాల గురించి చెబుతూ నేను గురు గోల్వాల్కర్ రచించిన పుస్తకం ‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ నుండి నేను కొన్ని అంశాలను ఉటంకించాను. అయితే, ఆ పుస్తకం ప్రతి ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ వెబ్ సైట్ లో కూడా లేదనీ, సామాన్య పాఠకులెవరికీ అందుబాటులో లేదనీ అవన్నీ ఇప్పుడు అవసరమా అని మిత్రులు కొందరు ప్రశ్నిస్తున్నారు. గురు గోల్వాల్కర్ కి సంబంధించిన ఆ భావాలు ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ స్వీకరించడం…

‘అనుజ్ బిద్వే’ హత్య కేసులో 17 ఏళ్ళ బ్రిటిష్ టీనేజర్ అరెస్టు

బ్రిటన్ లో సోమవారం తెల్లవారు ఝామున ఇరవై మూడేళ్ళ అనుజ్ బిద్వే హత్యకు గురైన కేసులో పదిహేడేళ్ళ బ్రిటిష్ టీనేజర్ ను అరెస్టు చేసినట్లుగా వార్తా పత్రికలు తెలిపాయి. ఏ కారణం గానీ, ఎటువంటి ముందస్తు కారణం గానీ లేకుండా జరిగినదిగా పోలీసులు చెబుతున్న ఈ హత్య ఇంగ్లండులోని భారతీయులలో ఆగ్రహావేశాలను కలిగించింది. ఫేస్ బుక్ లో ఇంగ్లండులోని భారతీయులతో పాటు ఇండియాలోని భారతీయులు కూడా ఈ హత్య పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సందేశాలను ప్రచురించారని…

గ్లోబల్ వార్మింగ్ వల్ల భూగ్రహంపై అనేక మార్పులు జరుగుతున్నాయి -ఫొటోలు

‘గ్రీన్ హౌస్ వాయువుల’ విడుదలతో వాయు, జల, భూతల కాలుష్యం పెచ్చరిల్లి భూగ్రహం పైన అనేక విపరీత పరిణామలు సంభవిస్తున్నాయి. ఎన్నడు ఎరుగని రీతిలో వరదలు పట్టణాలనూ, ఊళ్ళనూ ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు విపరీత స్ధాయిలో కురుస్తుండడం వల్ల ఊళ్ళకి ఊళ్ళే జలాశయాలుగా మారుతుండగా మరి కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి వర్షాలు కురవక కరువు పరిస్ధితులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. – –

ఇరాన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం, రాళ్ళతో కొట్టి గానీ లేదా ఉరితీయడం ద్వారా గానీ

వ్యభిచారం నేరం కింద అరెస్టు చేయబడి జైలులో శిక్ష అనుభవిస్తున్న నడి వయసు ఇరానియన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం ఇంకా మిగిలే ఉందని ఇరాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. వేరోక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి “సకినే మొహమ్మది అష్తియాని” అనే మహిళకు గత సంవత్సరం ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను రాళ్ళతో కొట్టి చంపడం ద్వారా అమలు చేయాలని ఇరాన్ కోర్టు తీర్పు ఇవ్వడంతో దానికి…

రూపాయి పతనం ఆపడానికి ఇండియా, జపాన్ ల మధ్య ‘డాలర్ల మార్పిడి’ ఒప్పందం

అదుపు లేకుండా కొనసాగుతున్న రూపాయి విలువ పతనం అరికట్టడానికి భారత్, జపాన్ లు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇరు దేశాల కరెన్సీలు పతనం కాకుండా ఉండడానికి ఈ ఒప్పందం చేసుకోవడానికి ఇరు పక్షాలు గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదమై వచ్చే బుధవారం ఇరు దేశాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయవచ్చునని రాయిటర్స్, హిందూస్ధాన్ టైమ్స్ పత్రికలు తెలిపాయి. షేర్ మార్కెట్లలో ఊహాత్మక వ్యాపారం తీవ్రమైనపుడు దేశం నుండి పెట్టుబడులు తరలిపోయి కరెన్సీ…

‘మతం ప్రజల పాలిట మత్తు మందు’ అని మాత్రమే “కారల్ మార్క్స్” అన్నాడా?

“మతం ప్రజల పాలిట మత్తు మందు” అని కారల్ మార్క్స్ అన్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఒక్కటి మాత్రమే మార్క్సు అని ఊరుకున్నాడా? లేదు. ఆయన మతానికి మత పెద్దలు కూడా ఇవ్వలేని విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని కారల్ మార్క్స్ నిర్వచించాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని ఎలా నిర్వచించవచ్చో, నిజానికి, మత సూత్రాలలో ఉద్దండ పండితులెవ్వరికైనా తెలిసి ఉంటుందని భావించలేము. వారంతా మతాన్ని దేవుడి దృక్పధంలో నుండి, మత పండితుల…

‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ‘క్షిపణి’ని పరీక్షించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా అత్యున్నత రాజకీయ, మిలట్రీ నాయకుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ఆ దేశం స్వల్ప దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించే శక్తి గల క్షిపణి పరీక్షించి సంచలన సృష్టించింది. అయితే మిసైల్ పరీక్ష కూ, కిమ్ మరణానికీ సంబంధం ఉన్నదని తాము భావించడం లేదని దక్షిణ కొరియా అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ సంస్ధ తెలిపింది. మిసైల్ పరీక్షించిన విషయాన్ని కూడా దక్షిణ కొరియా మీడియా నే వెల్లడించాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని దక్షిణ కొరియా…

ప్రపంచంలో అత్యంత పొట్టి మహిళ ‘జ్యోతి ఆమ్గే’ -ఫొటోలు

62.8 సెంటీ మీటర్లు లేదా 24.7 అంగుళాల ఎత్తుకలిగిన జ్యోతి ఆమ్గే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కింది. తన పద్దెనిమిదవ పుట్టిన రోజు డిసెంబరు 16 న ఆమే ఈ ఘనత సాధించింది. తన ఎత్తుతో సంబంధం లేకుండా ఆమె బాలీవుడ్ స్టార్ కావాలని కలలు కంటోందిట. గత సెప్టెంబరు నెలలోనే ప్రపంచ పొట్టి మహిళగా రికార్డుల కెక్కిన 22 ఏళ్ళ అమెరికన్ మహిళ రికార్డును జ్యోతి అధిగమించింది.…

ఫుకుషిమా అణు కర్మాగారం కార్మికులకు ‘స్టమక్ ఫ్లూ’

భూకంపం, సునామీల బారినపడి ప్రమాదానికి గురైన ఫుకుషిమా అణు కర్మాగారం లో శుభ్రపరిచే పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు స్టమక్ ఫ్లూ సోకడంతో డజన్లమందిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద పరిస్ధితి స్ధిర దశకు (స్టబిలిటీ) వచ్చిందని జపాన్ ప్రధాని ప్రకటించిన మరుసటిరోజే కార్మికులు జబ్బుబారిన పడడం విశేషం. అణు ప్రమాదం కారణంగా కర్మాగారంలో విడుదలైన రేడియో ధార్మిక వ్యర్ధ పదార్ధాలను శుభ్రపరిచే కార్యక్రమంలో కార్మికులు అనేక నెలలుగా నిమగ్నమై ఉన్నారు. కార్మికులకు…