స్పెయిన్ ప్రమాదం: విధ్వంసం-రుధిరం-దుఃఖం పెనవేసుకుని…

ఎంత సేపని! ఈ ప్రమాదం మొదలయ్యి పూర్తి కావడానికి అయిదంటే అయిదే క్షణాలు పట్టింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు 78 ప్రాణాలు హరీమన్నాయి. మృతులు ఎంత హృదయ విదారకంగా మరణించారంటే, 80 మంది మరణించారని చెప్పిన అధికారులు ఆ తర్వాత సంఖ్యను 78కి తగ్గించుకున్నారు. ఈ సంఖ్య మళ్ళీ మారవచ్చని కూడా వారు తెలిపారు. అంటే పెరగవచ్చు, లేదా తగ్గవచ్చు. ప్రమాదంలో విధ్వంసం ధాటికి మృత దేహాల శరీర భాగాలు తునాతునకలై పోవడం వలన ఈ…

స్పెయిన్ రైలు ప్రమాదం చివరి క్షణాలు, చూసి తీరాలి -వీడియో

బహుశా ఇలాంటివి స్పెషల్ ఎఫెక్టులతో తీసే హాలీవుడ్ సినిమాల్లోనే చూడగలం. ఈ వీడియో తీసిన వ్యక్తి ఆ క్షణాల్లో అక్కడ ఎందుకు ఉన్నాడో గానీ స్పెయిన్ లో రైలు పట్టాలు తప్పిన చివరి క్షణాలని వీడియోలో బంధించగలిగాడు. గంటకు 180 కి.మీ వేగంతో వస్తున్న హై స్పీడ్ రైలు పట్టాలు తప్పుతున్న దృశ్యాన్ని సజీవంగా బంధించడం ఎలా సాధ్యం? వంపు ఉన్న చోట గంటకి 90 కి.మీ వేగాన్ని మించకూడదని స్పెయిన్ చట్టాలు ఉన్నాయట. ఆ చట్టాన్ని…

స్పెయిన్: 40 యేళ్లలో అతి పెద్ద రైలు ప్రమాదం -ఫోటోలు

స్పెయిన్ లో భారీ రైలు ప్రమాదం చోటు జరిగింది. వంపులో పరిమితికి మించి వేగంతో ప్రయాణించడంతో హై స్పీడు రైలు పట్టాలు తప్పింది. దుర్ఘటనలో ఇప్పటికీ 78 మంది మరణించినట్లు లెక్క తేల్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. పట్టాలు తప్పినప్పుడు రైలు ఎంత వేగంగా వెళ్తోందంటే పట్టాలు తప్పిన ఒక కంపార్టుమెంటు ఆ వేగానికి తన ముందున్న కంపార్టుమెంటుని గుద్దుకుని ఎగిరి పైకి లేచి పక్కనే ఉన్న ఎత్తైన గోడని దాడి అవతల ఉన్న…

అమాయకులు కాదు, కాంగీ నాయకులే లక్ష్యం -మావోయిస్టులు

మహేంద్ర కర్మ, తదితరుల కాంగ్రెస్ పార్టీ నాయకులే తమ మెరుపుదాడికి లక్ష్యం అని మావోయిస్టులు ప్రకటించారు. తమ దాడిలో మరణించిన అమాయకులకు వారు క్షమాపణలు తెలిపారు. సల్వాజుడుం ద్వారా గిరిజన గ్రామాల్లో విధ్వంసం సృష్టించిన మహేంద్ర కర్మ, ఇతర కాంగ్రెస్ నాయకులపై గిరిజనుల తరపున ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన మావోయిస్టులు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్, గెరిల్లా ఆర్మీ మరియు మిలీషియా సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఉసెండి…

ఈ తల్లీ కూతుళ్లది ఆమ్ల దుఃఖం అనొచ్చా? -ఫొటోలు

ఈ ఇరానియన్ తల్లి, కూతుళ్ల దుఃఖానికి ఏ పేరు పెట్టాలి? ఏ పేరు పెడితే వారు అనుభవిస్తున్న వేదన అంతా ఒక్క ముక్కలో అర్ధం అవుతుంది? పోనీ ఎన్ని పదాలు కలిపి ప్రయోగిస్తే వారి నిరామయ దుఃఖ సారం నిండుగా వ్యక్తీకరించబడుతుంది? ఎన్ని రాత్రుళ్లు, పగళ్ళు పొగిలి పొగిలి ఏడ్చితే తీరే దుఃఖం వీరిది! ఆమె పేరు సొమాయే మెహ్రి. వయసు 29. ఆమెతో ఉన్నది మూడేళ్ల కూతురు రానా. సొమాయే భర్త అమీర్ అఫ్ఘనిపూర్ అకృత్యానికి…

సమాచార సేకరణకు చక్కని దారులు -ఈనాడు ఆర్టికల్ రెండో భాగం

ఈనాడు పత్రికలో ప్రచురించబడిన నా ఆర్టికల్ రెండో భాగం ఇది. సమాచార సేకరణ ఎలా చేయవచ్చు అన్న అంశం ఈ భాగంలో వివరించబడింది. జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -2 బొమ్మ పైన క్లిక్ చేస్తే మేటర్ ను పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో చూడవచ్చు. నెట్ లో చూడాలనుకుంటే ఇక్కడ ఈ లంకెను క్లిక్ చేయండి. – –

2012లో జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ -వర్డ్ ప్రెస్ రివ్యూ

2012 సంవత్సరం ప్రారంభంలో చేసినట్లే 2013 సంవత్సరం ప్రారంభానికి కూడా “జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ” బ్లాగ్ ను వర్డ్ ప్రెస్ వారు సమీక్షించారు. వర్డ్ ప్రెస్ బ్లాగర్లకు ఆ సంస్ధ ఇస్తున్న నూతన సంవత్సర కానుక కాబోలు! గత నాలుగైదు నెలలుగా మునుపటిలా ఎక్కువగా టపాలు రాయలేకపోతున్నాను. దానికి మూడు కారణాలు. ఒకటి: వార్తకంటే విశ్లేషణపై కేంద్రీకరించాలని నిర్ణయించడం; రెండు: ఆర్ధరైటిస్ సమస్య వలన కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోలేకపోవడం; మూడు: పుస్తక పఠనంపై మరింత కేంద్రీకరణ పెంచడం.…

రేప్ కి ఆడోళ్ళే కారణం అంటున్న ఢిల్లీ పోలీసులు, తెహెల్కా పరిశోధన (పునర్ముద్రణ)

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 7, 2012 తేదీన మొదటిసారి ఈ బ్లాగ్ లో ప్రచురితమయింది. అమానత్ విషాదాంతం సందర్భంగా అత్యాచారాల విషయంలో ఢిల్లీ పోలీసుల దృక్పధం ఎలా ఉన్నదో గుర్తు తెచ్చుకోవడానికి తేదీ మార్చి మళ్ళీ ప్రచురిస్తున్నాను. భారత సమాజాన్నీ, సంస్కృతినీ ఇలాంటి పుచ్చిపోయిన మెదళ్లు శాసిస్తూ, రక్షకులుగా ఉన్నంతవరకూ అత్యాచారాలు ఆగవనీ, దోషులందరికీ తగిన శిక్షలు పడవనీ తేలికగానే అర్ధం అవుతుంది -విశేఖర్) – “ఆవిడే కోరి వెళ్ళింది” “అంతా డబ్బు కోసమే” “ఇదో వ్యాపారం…

ఒకే వేదికపై బి.జె.పి, లెఫ్ట్ పార్టీలు

బి.జె.పి, లెఫ్ట్ పార్టీల నాయకులు ఢిల్లీలో కలకలం సృష్టించారు. చిల్లర వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినందుకు నిరసనగా ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ సందర్భంగా ఉప్పు, నిప్పుగా ఉండవలసినవారు ఒకే వేదికపైకి చేరారు. వ్యాపారులు నిర్వహించిన నిరసన సభలో బి.జె.పి, లెఫ్ట్ పార్టీల అగ్రనాయకులు ఆసీనులై పత్రికల, విశ్లేషకుల ఊహాగానాలకు పని పెట్టారు. ఇది దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చే పరిణామం కాకపోయినప్పటికీ వామపక్ష పార్టీల ప్రకటిత విధానాలు తెలిసినవారు భృకుటి ముడివేసే పరిణామమే.…

+92, +90 లనుండి మేసేజ్ లా? మీ మొబైల్ సిమ్ క్లోనింగ్ ప్రయత్నం కావచ్చు

మొబైల్ ఫోన్ ల సిమ్ లను క్లోనింగ్ చేసి ఆర్ధిక మోసాలకు పాల్పడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా తెలుస్తోంది. ఒక ఢిల్లీ నివాసి నుండి వచ్చిన ఫిర్యాదును ఛేదించే క్రమంలో సిమ్ కార్డ్ క్లోనింగ్ కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించిన సమాచారం వెల్లడయింది. మొబైల్ సిమ్ ను క్లోనింగ్ చేసే సౌకర్యం కొన్ని వెబ్ సైట్లు అందిస్తున్నాయనీ, వీటిని ఉపయోగించి సొంతదారులకు తెలియకుండానే వారి మొబైల్ సిమ్ లను రహస్య…

స్పోర్ట్స్ లో పురుష దురహంకారం స్పష్టంగా ఉంది -దీపిక

ఆటల్లో పురుష దురహంకారం స్పష్టంగా కొనసాగుతోందని ఆసియన్ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ సాధించిన దీపిక పల్లికల్ అభిప్రాయపడింది. సానియా మీర్జా, జ్వాలా గుత్తా ల అభిప్రాయాలకు దీపిక మద్దతు పలికింది. లండన్ ఒలింపిక్స్ లో పురుషుల టీం ఎంపికలో పురుష ఆటగాళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎ.ఐ.టి.ఎ) పరిష్కరించిన తీరు పట్ల సానియా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సంగతి విదితమే. సానియా మీర్జా అసంతృప్తికి జ్వాలా గుత్తా మద్దతు ప్రకటించిన…

దళిత ద్వేషం, హిందూ ఉన్మాదంతో కుళ్లిపోతున్న బూతుగాడి బూతులివే

పాఠకులు ముందుగా నన్ను క్షమించాలి. బూతు వెధవల ‘బూతు దాడి’ ఎదుర్కోవడానికి నాకు మరో మార్గం కనిపించడం లేదు. వీళ్లకి చదువు ఎలా అబ్బిందో తెలియదు గానీ ‘సమాచార విప్లవం’ ద్వారా సామాన్యులకి అందుబాటులోకి వచ్చిన బ్లాగింగ్ వేదికల్ని కూడా బూతులతో నింపేస్తున్నారు. సభ్యత మరిచి పదిమందిలో బూతులు మాట్లాడేవారిని నలుగురూ ఈసడించుకుంటారు. అలాంటివారు తోటివారి ఈసడింపులతోనయినా బుద్ధి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ బ్లాగ్బూతుగాళ్లకి ఆ అవకాశం లేకుండా పోతోంది. వీళ్ళ బూతుల్ని బహిరంగం…

‘గెలాక్సీ నోట్’ తో ఆడుకునే ఏనుగు -వీడియో

తెలివైన జంతులు మనిషికి కొత్త కాదు. చింపాంజీ, కుక్క లాంటి జంతువులు తమ తెలివితేటల్ని అనేకసార్లు నిరూపించుకున్నాయి. కాని ఏనుగు తెలివితేటలు ప్రదర్శించడం ఇదే కొత్త కావచ్చు. ‘పీటర్’ అనే పేరుగల ఈ ఏనుగు ‘గెలాక్సి నోట్’ తో చలాగ్గా ఆడేస్తోంది. టచ్ స్క్రీన్ పై మనం వేలితో చేసే విన్యాసాల్ని తొండంతో చేసేస్తోంది. ఏనుగు తొండంతో గుండు సూదిని కూడా పట్టుకోగలదని చిన్నప్పుడు చదివాం. టచ్ స్కీన్ ఫోన్లతో చెడుగుడు ఆడుతుందని ఇప్పుడు రాసుకోవచ్చేమో. మీరే…

జూలియన్ అస్సాంజ్ మరో పాచిక, ఈక్వెడార్ ఎంబసీ లో ఆశ్రయం

ప్రస్తుతం బ్రిటన్ లో ఉంటున్న జూలియన్ అస్సాంజ్, తనను స్వీడన్ కు తరలించాలన్న లండన్ సుప్రీం కోర్టు తీర్పుని ఎదుర్కోవడానికి మరో పాచిక విసిరాడు. అమెరికా, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిస్తున్న ఈక్వెడార్ తనకు ఆశ్రయం ఇవ్వాలని జూలియన్ దరఖాస్తు చేశాడు. అందులో భాగంగా బ్రిటన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయాన్ని శరణువేడాడు. ఈక్వెడార్ అధ్యక్షుడు గతంలో జూలియన్ కు ఆశ్రయం ఇవ్వజూపిన నేపధ్యంలో అస్సాంజ్ విసిరిన పాచిక సంచలనం కలిగిస్తోంది. పశ్చిమ దేశాలు ప్రపంచాన్ని గుప్పిట్లో…

అండర్ వాటర్ పోటోగ్రఫీ పోటీలు -ఫొటోలు

అండర్ వాటర్ ఫొటో గ్రఫీ పోటీలో వివిధ మెడళ్లు గెలుచుకున్న ఫొటోలివి. ‘అండర్ వాటర్ పొటోగ్రఫీ వెబ్ సైట్, ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తుంది. అనేక కేటగిరీల్లో పోటీలు జరిపి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ను బహూకరిస్తుంది. ప్రపంచం మొత్తం నుండి ఈ వెబ్ సైట్ నిర్వహించే పోటీల్లో పాల్గొంటారు. ఈ సారి 130 దేశాల నుండి 11.000 కి పైగా ఫొటోలు పోటీలకోసం సమర్పించబడ్డాయి. అందులో కొన్నింటిని ఎన్నిక చేసి టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది.…