మెక్సికో: తుపాకి పట్టిన జనం, డ్రగ్స్ మాఫియా పరార్ -ఫోటోలు

ఏలేవాడికి చేతగాకపోతే జనమే తమని తాము ఎలా రక్షించుకుంటారో మెక్సికో లోని మిచోకాన్ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. కిడ్నాప్ లకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను గుప్పెట్లో పెట్టుకున్న ‘ద నైట్స్ టెంప్లార్’ అని డ్రగ్స్ ముఠాను ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి ఏమీ చేయలేకపోయాయి. నిమ్మ, వెన్న పండు (Avocado) పండించే రైతులకు కూడా వివిధ డ్రగ్స్ ముఠాలు బెడదగా మారినప్పటికీ పోలీసుల నుండి గానీ, సైన్యం నుండి గానీ జనానికి ఏమీ సహాయం…

భారత దేశపు రేప్ అనుకూల లాబీ -ది హిందూ సంపాదకీయం

(ముంబై శక్తి మిల్స్ అత్యాచార నిందితుల్లోని ముగ్గురు రిపీట్ అఫెండర్స్ కు కోర్టు మరణ శిక్ష విధించిన నేపధ్యంలో సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ “అబ్బాయిలు అబ్బాయిలే. వారు తప్పు చేయరా” అని వ్యాఖ్యానించి పెను దుమారానికి తెరతీశారు. అవి ఆయన పొరబాటుగా అన్న మాటలు కావనీ, రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారని ది హిందూ సంపాదకీయం సరిగ్గా వ్యాఖ్యానించింది. మనకు కనపడని ప్రొ-రేపిస్టు లాబీ ఒకటి మన దేశంలోనూ ఉందని చెబుతున్న…

ఎలక్షన్ అఫిడవిట్: మోడి వివాహితులే

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అవివాహితులని, ఆజన్మ బ్రహ్మచారి అని చెప్పడం అంటే ఆయన అభిమానులకు చాలా యిష్టం. దేశం కోసం, దేశ ప్రజల ప్రయోజనం కోసం మోడి తన వ్యక్తిగత సుఖ సంతోషాలను తృణప్రాయంగా ఎంచుతూ త్యాగం చేశారని వారు తరచుగా చెబుతుంటారు. కానీ మోడి తన అభిమానులను నిరాశపరిచారు. ప్రధాని అభ్యర్ధిగా పోటీ పడుతూ అబద్ధం చెప్పకూడదు అనుకున్నారేమో తెలియదు గానీ తనను తాను వివాహితుడిగా పేర్కొంటూ ఆయన ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. ది…

విమానం హైజాక్: ఆత్మహత్య, టెర్రరిజం అనుమానాలు -ఫోటోలు

మలేషియా విమానం హైజాక్ అనేక మలుపులు తిరుగుతోంది. ఎన్ని అనుమానాలపై విచారణ జరిపినా, ఎంతగా తలలు బద్దలు కొట్టుకున్నా, చివరికి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విన్న చివరి మాటలను పలికింది పైలట్ కాదని, కో-పైలట్ ఆ మాటలు అన్నారని తాజాగా మలేషియా ప్రకటించింది. బహుశా పైలట్లలో ఎవరన్నా ఆత్మహత్యకు ప్రయత్నించారా అన్న కోణాన్ని పరిశోధిస్తున్నామని ఆ దేశం తెలిపింది. మలేషియా ప్రభుత్వం తమ సమాచారాన్ని కాస్త త్వరగా బైటపెట్టి ఉంటే విలువైన…

రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు బి.జె.పి ఆటంకం?

‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ బిల్లు బుధవారం (ఫిబ్రవరి 19) రాజ్యసభలో ప్రవేశించలేదు. ఇందుకు బి.జె.పి కారణంగా నిలిచింది. లోక్ సభలో బిల్లుకు ఒక్క సవరణ కూడా ప్రతిపాదించని బి.జె.పి రాజ్యసభలో మాత్రం 32 సవరణలు చేయాలంటూ బయలుదేరింది. దీనికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఫలితంగా తెలంగాణ బిల్లు లేకుండానే రాజ్య సభ వాయిదా పడింది. లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభలో సవరణలు చేస్తే రాజ్యాంగ సూత్రాల రీత్యా సమస్య వస్తుంది.  రాజ్యసభలో బిల్లుకు…

2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష

నూతన సంవత్సరం సందర్భంగా ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్లు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ బ్లాగ్’ ను సమీక్షించారు. సమీక్ష తాలూకు అంశాలను బ్లాగ్ లో ప్రచురించే అవకాశం కల్పించారు. 2013లో సందర్శకులు 4,00,000 సార్లు ఈ బ్లాగ్ ని చూశారు. 816 కొత్త టపాలు ప్రచురించబడ్డాయి. మొత్తం మీద చూస్తే ఇప్పటివరకూ ఈ బ్లాగ్ లో 2,826 టపాలు ప్రచురితం అయ్యాయి. మరిన్ని వివరాల కోసం కింద లింక్ ను క్లిక్ చేయగలరు. The WordPress.com…

ఇక ప్రతి టపా కిందా ‘సంబంధిత టపాలు’ చూడొచ్చు!

వర్డ్ ప్రెస్ వాళ్ళు ఒక ముఖ్యమైన ఉపకరణాన్ని అందుబాటులోకి తెచ్చారు. వర్డ్ ప్రెస్ లో నిర్వహించే బ్లాగుల్లో ప్రతి టపా కిందా ఆ టపాలోని విషయంతో సంబంధం ఉండే మూడు టపాలకు లంకెలు ఇచ్చే ఉపకరణం ఇది. ఈ ఉపకరణం కోసం వర్డ్ ప్రెస్ బ్లాగర్లు చాలా కాలంగా అడుగుతున్నారట. నా బ్లాగ్ పాఠకులు కూడా గతంలో కొంతమంది అడిగారు. ఒకరిద్దరు వ్యాఖ్యలు కూడా రాశారు, ‘ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చెయ్యగలరా?’ అని. కానీ అలాంటి విడ్గెట్…

లండన్ లో బ్యాంక్సీ స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ (2008) -పునర్ముద్రణ

ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ , 2008 లో స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. వాటర్ లూ స్టేషన్ అండర్ గ్రౌండ్ లో వినియోగంలో లేని టన్నెల్ లో ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహించారు. బ్రిటన్, ఫ్రాన్సు, బెల్జియం లను కలిపే ‘యూరో స్టార్’ హై స్పీడ్ రైల్వే కంపెనీ ఈ టనెల్ ని వాడి వదిలేయగా, ఆ తర్వాత టాక్సీ డ్రైవర్లు ఉపయోగించారు. ఎగ్జిబిషన్ కి ‘కేన్స్ ఫెస్టివల్’ అని పేరు పెట్టారు.…

బేంక్సీ వీధి చిత్రాలు -పునః ప్రచురణ

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 29, 2012 తేదీన ప్రచురించినది. అప్పటికీ ఇప్పటికీ పాఠకులు చాలామంది మారారు. చాలామంది కొత్త పాఠకులు వచ్చి చేరారు. అద్భుతమైన వీధి చిత్ర కళాకారుడు బ్యాంక్సీని కొత్త పాఠకులకు పరిచయం చేద్దామన్న ఉద్దేశ్యంతో -బ్యాంక్సీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం మరి!- దీనిని పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) — — — ప్రఖ్యాత బ్రిటిష్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ గీసిన వీధి చిత్రాలివి. బ్యాంక్సీ చిత్రాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది ‘అధారిటేరియనిజం’…

44 మందిని మసి చేసిన దారుణ బస్సు ప్రమాదం

బుధవారం తెల్లవారు ఝామున ఘోరమైన రోడ్డు ప్రమాదం సభవించింది. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ఒకటి డివైడర్ ని ఢీకొట్టి ఉన్నపళంగా అగ్నికి ఆహుతయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఏం జరిగిందో తెలుసుకుని తప్పించుకునే లోపు బస్సు నిండా దట్టమైన పొగలు అల్లుకుపోవడంతో ఎటు పోవాలో తెలియక మంటల్లో మాడి మసై పోయారు. రిజర్వేషన్ బుకింగ్ జాబితా తప్ప ప్రయాణీకులను గుర్తించడానికి మరే మార్గమూ లేకుండా పోయింది. డ్రైవర్, క్లీనర్ తో సహా…

విభజన ‘గీత’ -తమాషా శ్లోకం

ఇది ఫేస్ బుక్ లో లభించింది. చాలా తమాషాగా ఉంది. కొంత అరాచకం అనిపిస్తున్నప్పటికీ ఇందులో వ్యక్తమయిన సృజనాత్మకత మాత్రం బాగుంది. మీరే చదవండి! పేరెంట్సో జన్మహ పేమెంట్సో విద్యతి! వన్ బై వనేస్య వరసస్య సంభవామి దగే దగే! ఇంతోహి బతుకు ఇంటెనక మరణస్య! చర్చా ప్రహసనన కరిష్యాం జిల్ జిల్ జిగే!!!! అపార్థా! పేరెంట్స్ వలన జన్మము, పేమెంట్స్ వలన చదువు, చదువు వలన ఉద్యోగము, ఉద్యోగము వలన లంచము, లంచము వలన నేరము,…

అవును! టెంప్లేట్ మళ్ళీ మార్చాను

టెంప్లేట్ ని మళ్ళీ మార్చాల్సి వచ్చింది. క్రితం టెంప్లేట్ లో ప్రధానమైన లోపం నేవిగేషన్ కష్టంగా ఉండడం. ‘పాత టపాల’ లోకి వెళ్లడానికి హోమ్ పేజీలో ఎక్కడా సౌకర్యం లేదు. ఇది నేవిగేషన్ కు బాగా ఇబ్బందిగా మారింది. దీనిని కవర్ చేయడానికి ‘ఈ బ్లాగ్ లో విహరించడం ఎలా?’ అన్న పేరుతో వివరణ ఇచ్చాను గానీ అదొక చాట భారతంలా కనిపించింది. కేవలం ‘స్లైడర్’ లో 20 టపాలను చూపించవచ్చు అనుకున్నాను గానీ అవి వెంటనే…

బహుశా, ఈ టెంప్లేట్ అందరికీ నచ్చుతుంది!

‘తెలుగువార్తలు డాట్ కామ్’ ఉరఫ్ ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కోసం టెంప్లెట్ వేట ఇంకా ఆగిపోలేదు. ఆక్సిజన్ అలంకారం (అదేనండీ, ధీమ్ ఉరఫ్ టెంప్లేట్) కూడా ఎవరికీ పెద్దగా నచ్చలేదని అర్ధం అయిపోయింది. మిత్రులు ఆ సంగతి నేరుగా చెప్పలేక ‘అది ఉంది కానీ ఇది లేదు’ ‘ఫర్ఫాలేదు, కానీ అంతకుముందుదే బాగుంది’ లాంటి వ్యాఖ్యలతో తమ అసంతృప్తిని పరోక్షంగా చెప్పేశారు. నిజానికి ‘ఆక్సిజన్’ నాకూ నచ్చలేదు. వేణు గారు అన్నట్లు అది క్లమ్సీగా…

పోనీ, ఈ టెంప్లేట్ ఎలా ఉంది?

సెలెక్టా ధీమ్ మెజారిటీ పాఠకులకు నచ్చలేదని అర్ధం అయింది. ఒక్క తిరుపాలు గారు తప్ప ఇతర మిత్రులంతా బాగాలేదనే చెప్పారు. ముఖ్యంగా చందుగారు చెప్పినట్లు బ్లాగ్ లోని వివిధ టపాలకు తేలికగా ప్రవేశం ఉండేలా డిజైన్ ఉండడం చాలా అవసరం. అది సెలెక్టా ధీమ్ కి లేదని అర్ధం అవుతోంది. ఈసారి ఆక్సిజన్ ధీమ్ ని అమర్చాను. బహుశా ఇది బాగుందనుకుంటాను. దీని పైన కూడా మిత్రుల అభిప్రాయాలను కోరుతున్నాను.

‘తెలుగు వార్తలు’ కొత్త టెంప్లేట్, సూచనలివ్వండి!

సందర్శకులకు ఓ చిన్న విన్నపం! ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగు కోసం కొత్త టెంప్లేట్ ను అమర్చాను. ఇది పాఠకులకు అనుకూలంగా ఉన్నదని నా అంచనా. కానీ పాఠకులకు అనుకూలంగా ఉందా లేదా అన్న సంగతి ప్రధానంగా పాఠకులు చెప్పాలి తప్ప నేను కాదు. అందుకే మీ సూచనలను ఆహ్వానిస్తున్నాను.