ఫుకుషిమా అణు రియాక్టర్ల వద్ద మరింత పెరిగిన అణు ధార్మికత
మానవ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రమాదంగా పేరు తెచ్చుకున్న జపాన అణు ప్రమాదం మరింత తీవ్రమవుతోంది. దైచి అణు విద్యుత్ కర్మాగారం లోని రియాక్టర్ల నీటిలో రేడియేషన్ మామూలు స్ధాయి కంటే 10 మిలియన్ల రెట్లు రేడియేషన్ నమోదైనట్లు అణు కర్మాగారాల ఆపరేటర్ ‘టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెని (టెప్కో) తెలిపింది. ప్రమాద సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపకుండా దాపరికంతో వ్యవహరిస్తున్నందుకు టెప్కో పై విమర్శలు వస్తున్నాయి. కర్మాగారంలో రియాక్టర్లను చల్లబరచడానికి ప్రయత్నిస్తున్న వర్కర్లకు సరైన దుస్తులు ఇవ్వలేదని…