చిలీలో పుయేహూ అగ్ని పర్వతం బద్దలై లావా బూడిదను ఎగజిమ్ముతున్న దృశ్యం -ఫోటో
జూన్ 5, 2011 తేదీన చిలీ దేశంలోని “పుయేహూ” అగ్ని పర్వతం బద్దలయ్యింది. దాంతో అగ్ని పర్వతం చుట్టూ 70 కి.మీ పరిధిలో నివసిస్తున్న వారు ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవలసి వచ్చింది. దక్షిణ చిలీలోని ఓసోర్నో పట్టణానికి సమీపంలో ఈ అగ్ని పర్వతం ఉంది. చిలీ రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 870 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్వతం గత యాభై సంవత్సరాల్లో బద్దలవడం ఇదే మొదటిసారి. పేలుడు ధాటికి బూడిద పక్కనే…
అమెరికా ‘స్పెల్లింగ్ బీ ఛాంపియన్’ పోటీల్లో భారత బాలిక ‘సుకన్య’ జయకేతనం
వరుసగా రెండో సంవత్సరం భారత దేశానికి చెందిన బాలిక అమెరికా స్పెల్లింగ్ ఛాంపియన్ పోటీల్లో విజయం సాధించి భారత ప్రతిష్టను చాటించి. బెంగాల్‌కి చెందిన “సుకన్య రాయ్” ‘cymotrichous’ పదానికి ఖచ్చితంగా స్పెల్లింగ్ చెప్పడం ద్వారా 2011 అమెరికా నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్‌షిప్ ను గెలుచుకుంది. ఎనిమిదో క్లాసు గానీ 15 సంవత్సరాల వయసుగానీ దాటని వారు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. పెన్సిల్వేనియాలో “అబింగ్‌టన్ హైట్స్ మిడిల్ స్కూల్” లో సుకన్య ఎనిమిదవ గ్రేడు…
నేను చూసిన ఆటగాళ్ళలో సచినే గొప్ప బ్యాట్స్ మెన్ -వివ్ రిచర్డ్స్
వెస్ట్ ఇండీస్ కి చెందిన లెజెండరీ బ్యాట్స్ మెన్ వివ్ రిచర్డ్స్ సచిన్ అభిమానుల జాబితాలో చేరాడు. “నేను డాన్^ని చూడలేదు. కానీ నా దృష్టిలో నా క్రికెట్ కెరీర్ లో నేను చూసిన బ్యాట్స్ మేన్ లలో సచినే గొప్ప బ్యాట్స్ మెన్. అతనికంటే గొప్ప బ్యాట్స్ మేన్ ను నేను చూడలేదు” అని తెలిపాడు. “సచిన్ కంటే గొప్ప బ్యాంట్స్ మేన్ ఎవరైనా ఉన్నట్లయితే అతనింకా రాలేదు” అని క్రికెట్ లెజండ్ వివ్ రిచర్డ్స్…
ఐదు రోజుల వ్యవధిలో 32 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో సేనలు
లిబియా పౌరుల్ని చంపాడంటూ గడ్దాఫీపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ద్వారా అరెస్టు వారెంటు జారీ చేయించిన అమెరికా తదితర పశ్చిమ దేశాల నాటో కూటమి ఆఫ్ఘనిస్ధాన్‌లో పౌరులను చంపడం నిరాకటంకంగా కొనసాగిస్తూనే ఉంది. గత బుధవారం 18 మందినీ పొట్టన బెట్టుకున్న అమెరికా సేనలు ఆదివారం 14 మందిని చంపేశాయి. ఆదివారం చనిపోయినవారిలో ఇద్దరు స్త్రీలు కాగా మిగిలినవారంతా పిల్లలే. చనిపోయినవారిలో 2 సం.ల పసిపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఇవి మానవతకి వ్యతిరేకంగా జరిగిన నేరం.…
లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు స్ట్రాస్ కాన్
చివరికి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు కూడా తానూ మ(మృ)గాడినే అని నిరూపించుకున్నాడు. ఫ్రాన్సు దేశీయుడు, అంతర్జాతీయ ద్రవ్య సంస్ధ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ -ఐ.ఎం.ఎఫ్) అధ్యక్షుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’ ఒక లగ్జరీ హోటల్ లోని మెయిడ్ పై అత్యాచారానికి పూనుకున్నాడన్న నేరంపై న్యూయార్కులోని కెన్నెడీ విమానాశ్రయంలో అరెస్టు అయ్యాడు. ఫ్రాన్సులో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపున నికొలస్ సర్కోజీపై నిలబడి గెలుస్తాడని అందరూ భావిస్తున్న దశలో తాజా సంఘటన జరిగింది. 2007 నుండీ…
క్రికెట్ ఇండియా కొత్త కోచ్ “డంకన్ ఫ్లెచర్”
మూడు సంవత్సరాల పాటు ఇండియా క్రికెట్ టీం కి కోచింగ్ బాధ్యతలు నిర్వహించీన్ గ్యారీ కిర్‌స్టెన్ తన కాంట్రాక్టు పొడిగించడానికి నిరాకరించడంతో బిసిసీఐ కొత్త కోచ్ ని నియమించింది. గతంలో జింబాబ్వే క్రికెట్ టీంకి కెప్టెన్ గానూ, ఇంగ్లండ్ కు కోచ్ గానూ పని చేసిన డంకన్ ఫ్లెచర్ ను కొత్త కోచ్ గా నియమిస్తున్నట్లు బిసిసీఐ బుధవారం ప్రకటించింది. 2005లో ఇంగ్లండు టీంకి కోచ్ గా ఉండగా ఇంగ్లండు యాషెస్ సిరీస్ గెలుచుకుంది. ఫ్లెచర్ రెండేళ్ళ…
పి.డి.ఎస్.యు ఉద్యమ ఫోటోలు
జపాన్లో మరో పెద్ద భూకంపం, సునామీ హెచ్చరిక జారీ
జపాన్లో మార్చి11 న వచ్చిన తీవ్ర స్ధాయిలో సంభవించిన భూకంపం, దాని వలన వచ్చిన భయానక సునామీ లు కొట్తిన దెబ్బ నుండి జపాన్ ఇంకా తేరుకోలేదు. ఇంత లోనే ప్రకృతి పగ బట్టిందా అన్నట్లు మరో తీవ్ర భూకంపం జపాన్ ను వణికిస్తోంది. మార్చి 11 న భూకంపం సంభవించిన ఈశాన్య జపాన్ ప్రాంతానికి దగ్గరగా సముద్రంలో 7.4 తీవ్రతతో తాజా భూకంపం సంభవించినట్లు రాయిటర్స్ సంస్ధ తెలిపింది. జపాన్ ప్రభుత్వం తాజా భూకంపం దరిమిలా…
రేడియేషన్ నీటి లీకేజి పూడ్చిన జపాన్ ఇంజనీర్లు
జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో రెండో రియాక్టరుకు ఏర్పడిన పగులును పూడ్చామని టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) ఇంజనీర్లు తెలిపారు. “లీకేజిని అరికట్టామని చెబుతున్నా దానిని పరీక్షించాల్సి ఉంది. ఇంకా లీకేజీలేమన్నా ఉన్నాయేమో చూడాల్సి ఉంది” అని జపాజ్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ యుకియో ఎడానో పత్రికలతో మాట్లాడుతూ అన్నాడు. సోడియం సిలికేటుతో పాటు మరో రసాయన ఏజెంటును ఉపయోగించి లీకేజిని పూడ్చినట్లు ఇంజనీర్లు తెలిపారు. 15 సెం. మీ మేర ఏర్పడిన…
ప్రమాదకర రేడియేషన్ నీటిని సముద్రంలోకి వదులుతున్న జపాన్
శక్తివంతమైన భూకంపం, సునామీ ల తాకిడితో దెబ్బతిన్న ఫుకుషిమా దైచి అణు రియాక్టర్లవద్ద వెలువడుతున్న రేడియేషన్ సంక్షోభాన్ని జపాన్ ప్రభుత్వం ప్రపంచ సమస్యగా మారుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండో రియాక్టరు వద్ద తీవ్రంగా కలుషితమైన నీటిని తోడివేసేందుకు ఖాళీ లేనందున, తక్కువ స్ధాయిలో కలుషితమైన నీటిని సముద్రంలో కలిపి ఖాళీ సృష్టించడానికి జపాన్ నడుం కట్టింది. రెండో రియాక్టర్ 20 సెంటీ మీటర్ల మేరకు పగుళ్ళిచ్చిందని అణు కర్మాగారం ఆపరేటర్ టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ)…
ఆఫ్రికా దేశం ‘ఐవరీ కోస్ట్’ను ఆక్రమించుకున్న ఫ్రెంచి సేనలు
ఆఫ్రికా ఖండంలో బుల్లి దేశమైన ఐవరీ కోస్ట్ లో ఫ్రాన్సు పన్నాగాలు కొనసాగుతున్నాయి. తాజాగా 800 మంది ఫ్రెంచి సైనికులను ఐవరీ కోస్ట్ కి పంపింది. అక్కడి ప్రధాన నగరం అబిద్ జాన్ లోని ప్రధాన విమానాశ్రాయాన్ని తాజాగా పంపిన ఫ్రెంచి సేనలు ఆక్రమించుకున్నాయి. ఆఫ్రికా ఖండానికి పశ్చిమ తీరంలో ఉన్న ఐవరీ కోస్ట్ లో గత సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బో ను అలస్సానే ఒట్టోరా ఓడించాడని…
పగుళ్ళిచ్చిన జపాన్ అణు రియాక్టర్, అణు ధార్మికత కట్టడికి చర్యలకై వెతుకులాట
భూకంపం, సునామీలతో దెబ్బతిన్న ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో ఒక రియాక్టర్ పగుళ్ళిచ్చి ఉండడాన్ని శనివారం కనుగొన్నారు. చీలిక 20 సెంటీ మీటర్ల మేర ఉందని కర్మాగారం ఆపరేటర్ టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) తెలిపింది. ఇప్పటికి కనుగొన్నది ఒక్క పగులేననీ ఇంకా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని తెలిపింది. గత వారం రోజులుగా కర్మాగారం వద్ద సముద్రపు నీరు బాగా కలుషితమై, చుట్టుపక్కల వాతావరణంలో కూడా అణు ధార్మికత అధిక స్ధాయిలో ఉండడంతో దానికి కారణం…
దేశవ్యాపితంగా వెల్లివిరుస్తున్న క్రికెట్ దేశభక్తి
క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభం కావడానికి నెల ముందునుండే (ఇంకా ముందన్నా ఆశ్చర్యం లేదు) భారత దేశ వ్యాపితంగా దేశభక్తి వెల్లివెరుస్తోంది. ఇతర దేశాల సంగతేమో గానీ ఇండియాలో మాత్రం దేశభక్తికి సీజన్లు ఉంటాయి. అంటే సీజన్ ను బట్టి దేశభక్తి లక్షణాలు మారుతుంటాయి. దేశభక్తి అంటే ఎల్లప్పుడూ ఒక్కటే అర్ధం కదా అంటే, నిజమే. సర్వకాల సర్వావస్ధలయందూ ఒకటే అర్ధం. కానీ ఇండియాలో దేశభక్తి అన్ని కాలాల్లో వ్యక్తం కాదు. కొన్ని సీజన్లలో దేశభక్తి…
ఎయిర్టెల్ జాబ్ నుండి గ్రామ సర్పంచ్ గిరీకి…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ చేసిన వారంతా రెండు సంవత్సరాల పాటు గ్రామాల్లో వైద్యం చేస్తేనే డిగ్రీ చేతికి ఇస్తామని ప్రకటించినపుడు మెడికల్ విద్యార్ధులు ఆ నిబంధనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయడం చూశాం. ఇండియాలో ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యాసంస్ధలలో భారత ప్రజల డబ్బుతో చదువుకొని కోట్ల కొద్ది జీతాల కోసం అమెరికా వాల్ స్ట్రీట్ కంపెనీల ఉద్యోగాల కోసం పరిగెత్తే విద్యాధికులను చూశాం. ఇంజనీర్లు, డాక్టర్లైతే చాలు ఎప్పుడు…