అదే సచిన్ అయితే పెద్ద గొడవై ఉండేది -ఇంగ్లండ్ క్రికెట్ కోచ్

ఇంగ్లండు క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ  జింబాబ్వే ఆటగాడు ఆండి ఫ్లవర్, సచిన్‌ టెండూల్కర్‌ను ఒకసారి తలచుకున్నాడు. రెండవ టెస్టు మ్యూచ్ జరుగుతున్న సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ రనౌట్‌ను తిరిగి పరిశీలించాలని భారత్ జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్ళి కోరడాన్ని ఆయన సమర్ధించుకుంటూ తన నిర్ణయంలో సచిన్‌ని ప్రతిక్షేపించుకున్నాడు. “ఇయాన్ బెల్ లాగే సచిన్ అవుటై ఉన్నట్లయితే క్రికెట్ ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి ఉండేది” అని చెబుతూ తమ చర్యను సమర్ధించుకున్నాడు.…

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప మద్దతుదారు “సదానంద గౌడ” ఎన్నిక

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మొత్తం మీద తన పంతం కొంతమేరకు నెగ్గించుకున్నాడు. నూతన ముఖ్యమంత్రిగా, యెడ్యూరప్ప వర్గీయుడైన “సదానంద గౌడ” ఎన్నికయ్యాడు. కర్ణాటక లెజిస్లేచర్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకోవడానికి బుధవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి పదవి కోసం యెడ్యూరప్ప, బి.జె.పి అధిష్టానంలు చెరొక అభ్యర్ధిని నిలబెట్టినట్లుగా వార్తా ఛానెళ్ళు చెప్పాయి. రహస్య ఓటిం కూడా జరిగిందని అవి తెలిపాయి. చివరికి సదానంద గౌడను నూతన ముఖ్యమంత్రిగా బి.జె.పి శాసన సభా పక్షం ఎన్నుకుందని ప్రకటన వెలువడింది.…

‘పులి పాప’ను పాల డబ్బాతో సాకుతున్న ‘పిల్ల చింపాంజీ’ -ఫొటోలు

మనిషికి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హోమో సెపియన్ కి అత్యంత దగ్గరి పోలికలు ఉన్నది చింపాంజీకే నని జీవ శాస్త్రవేత్తలు చెబుతారు. చింపాంజీల చేష్టలు, అలవాట్లు, వివిధ అవసరాల కోసం అవి చూపించే కదలికలు, కొద్ది ముఖంలో కూడా ప్రతిఫలించే హావ భావాలు… ఇవన్నీ ఆ విషయం నిజమేనని స్పష్టం చేస్తాయి కూడా. పేదల ఇళ్ళల్లో తల్లి దండ్రులు పని చేయగల వారినందర్నీ కూలి పనులకు పట్టుకుపోతే, ఇంట్లోనే ఉండక తప్పని చంటి పాపను, పాపకంటే నాలుగో,…

బీహార్ పాఠశాల గ్రంధాలయాల్లొ అర్.ఎస్.ఎస్ పుస్తకాలు -జె.డి(యు) రెబెల్స్

తనను తాను అసలైన సెక్యులరిస్టుగా చెప్పుకునే నితీష్ కుమార్ బీహార్ పాఠశాలల కోసం ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలను కొనడానికి అనుమతించాడని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ తిరుగుబాటు నాయకుడు ఒకరు ఆదివారం వెల్లడించాడు. మతన్మోదాన్ని, విద్వేషాలనూ రెచ్చగొట్టే ఈ పుస్తకాలను వెంటనే పాఠశాలల గ్రంధాలయాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి ఆర్.ఎస్.ఎస్ భావాల వ్యాప్తికి దోహదం చేసే పుస్తకాలను కొనుగోలు చేసి పాఠశాల పిల్లలకు అందుబాటులో ఉంచడం తగదని ఉపేంద్ర…

వరుసగా నాల్గవరోజు నష్టపోయిన భారత షేర్ మార్కెట్లు

భారత షేర్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు కూడా నష్టపోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 12.32 పాయింట్లు (0.07 శాతం) నష్టపోయి 18197.20 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 5.75 పాయింట్లు (0.1 శాతం) నష్టపోయి 5482 వద్ద ముగిసింది. ఫండ్లు, మదుపుదారులు రియాల్టీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, విద్యుత్ రంగాల షేర్లను అమ్మడంతో షేర్ మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నుండి అందుతున్న బలహీన సంకేతాలు, భారత దేశంలో ద్రవ్యోల్బణ కట్టడికి మరిన్ని…

కాంగ్రెస్ పార్టీ ఓ సర్కస్‌లా తయారయ్యింది -కాంగ్రెస్ నాయకుడు మణి శంకర్ అయ్యర్

కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపుల ఘర్షణ వీధికెక్కుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్, దిగ్విజయ్, సోనియాల పర్యవేక్షణలోని నెహ్రూ/ఇందిరా స్కూల్ ఆర్ధిక విధానాలకీ, మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, పి.చిదంబరం, కపిల్ సిబాల్ తదితరుల అమెరికా/ఎల్.పి.జి (లిబరలైజేషన్, ప్రవేటైజేషన్, గ్లోబలైజేషన్) స్కూల్ ఆర్ధిక విధానాలకి ఘర్షణ, ఐక్యతలు కొనసాగుతున పరిస్ధితి అందరూ ఎరిగినదే. లోలోపలి సమావేశాల్లోనూ, మంత్రుల నియామకాలు, తొలగింపుల రూపంలోనూ వీరి ఘర్షణ వ్యక్తమవుతూ వస్తున్నది. ఐతే నెహ్రూ స్కూల్ సీనియర్ నాయకులను సుదీర్ఘకాలం పాటు పక్కనబెడుతుండడంతో వారు…

రెండు తలల పాము -ఫోటో

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఈ రెండు తలల పాముని ప్రదర్శనకు ఉంచారు. పరిమిత రోజుల పాటు మాత్రమే ప్రదర్శనకు ఉంచుతారని జూ నిర్వాహకులు తెలిపారు. ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్సె (ఎ.ఎఫ్.పి) వార్తా సంస్ధకి చెందిన ఫోటో జర్నలిస్టు జులై 8 తేదీన ఈ ఫోటోని తీశాడు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని యాల్టా నగరంలో స్కాజ్కా జూ లో దీనిని ఉంచారు. ప్రకృతి విచిత్రాలలో ఇదీ ఒకటి కాబోలు.

యెడ్యూరప్పకు పులిమీద పుట్ర, అవినీతి కేసులో విచారణకు కోర్టు అనుమతి

కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కు కూడా అక్రమ మైనింగ్ కుంభకోణంలో పాత్ర ఉందని నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించనున్న నేపధ్యంలో ఆయనపై మరో సమ్మెట దెబ్బ పడింది. యెడ్యూరప్పపై అవినీతి కేసులు నమోదు చేసి విచారించాలన్న క్రింది కోర్టు తీర్పుపై మార్చిలో విధించిన స్టేను హై కోర్టు గురువారం ఎత్తి వేసింది. స్తే ఎత్తి వేస్తూ ముఖ్యమంత్రిపై అవినీతి పాల్పడ్డాడన్న కేసు నమోదు చేసి విచారణ చేయడానికి…

చైనాలొ తేనెటీగల్ని ఆకర్షించి, వొంటినే తేనెతుట్టెగా మలిచే పోటీ -ఫోటోలు

తేనెటీగల దండు వస్తుంటేనే చూసి పారిపోతాం మనం. అవి మన శరీరంలో నాటే కొండీలు యమ బాధని కలిగిస్తాయి. కాని చైనాలో ఏకంగా తమ శరీరాలనే తేనెతుట్టెలుగా మార్చే పోటీ జరగడం విశేషం. చూడడం తర్వాత సంగతి, తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోటీ దృశ్యాలను చూసి తీరవలసిందే మరి. చైనా లోని హూనాన్ రాష్ట్రంలో “షావో యాంగ్” ఊరిలో ఈ తేనెటీగల్ని ఆకర్షించే పోటీ జరిగింది. ఈ పోటీలో పాల్గొనేవారు తాము పెంచుకున్న రాణి తేనెటీగల్ని…

హ్యాకింగ్‌కి గురైన మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ఫోన్ -కార్టూన్

“నా ఫోన్‌ని హ్యాక్ చేశారా?! అసలే దుఃఖంలో ఉన్న ఈ ముసలోడికి అలా చేయడానికి మనసెలా ఒప్పింది!”   హత్యకు గురైన బాలిక ఫోన్‌ని హ్యాక్ చేసీ, న్యూయార్క్ లోని జంట టవర్లపై జరిగిన టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన వారి ఫోన్లను హ్యాక్ చేసీ, ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాల్లో మరణించిన ఇంగ్లండ్ సైనికుల ఫోన్ లను హ్యాక్ చేసి… ఆ సమాచారాన్నే పెట్టుబడిగా “న్యూస్ ఆఫ్ ది వరల్డ్” పత్రికకు పేరు తెచ్చుకున్న రూపర్ట్ మర్డోక్ ఫోన్‌ని…

25వ అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం ప్రారంభించిన ఇండియా

ఫుకుషిమా అణు ప్రమాదం, అణు విద్యుత్ కర్మాగారాల భద్రత పట్ల అనేక సమాధానాలు దొరకని ప్రశ్నలను అనేకం లేవనెత్తినప్పటికీ భారత దేశం కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నుండి వెనక్కి తగ్గడం లేదు. ఫుకుషిమా దైచి అణు కర్మాగారం వద్ద మూడు అణు రియాక్టర్లలోని విద్యుత్ ప్రసార వ్యవస్ధ దెబ్బతినడంతో కూలింగ్ వ్యవస్ధ నాశనమై ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయి, పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించిన సంగతి విదితమే. ఈ కర్మాగారం నుండి విడుదలవుతున్న రేడియేషన్‌ను…

2000వ టెస్ట్ మ్యాచ్, 100వ మ్యాచ్, 100వ సెంచరీ

ఇండియా క్రికెట్ జట్టు త్వరలో జరపనున్న ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా జులై 21 నుండి 25 వరకూ ఇండియా, ఇంగ్లండ్ ల క్రికెట్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కి అనేక విధాలుగా ప్రాముఖ్యత ఉంది. ఇది మొత్తం ప్రపంచ క్రికెట్ టెస్టు క్రికెట్ జట్టుల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లలోనే 2000 వ టెస్ట్ మ్యాచ్. అంతే కాకుండా ఇండియా, ఇంగ్లండు దేశాల మధ్య జరగనున్న 100…

కల్కా మెయిల్ పట్టాలు తప్పడంతో 35 మంది దుర్మరణం, 200 మందికి పైగా గాయాలు -‘ది హిందూ’ ఫోటోలు

భారత రైల్వేల కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. హౌరా నుండి ఢిల్లీ వెళ్తున్న కల్కా మెయిల్ ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ వద్ద మధ్యాహ్నం గం.12:20 ని.లు సమయంలో పట్టాలు తప్పింది. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పగా 10 బోగీల షేపులు మారిపోయాయి. సిగ్నల్స్, ఫిష్ ప్లేట్లు అన్ని బాగానే ఉన్నాయని ప్రాధమిక విచారణలో తేలింది. డ్రైవర్ తాగిలేడని రైల్వే అధికారులు నిర్ధారించారు. కారణం ఇంకా స్పష్టం కాలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రైల్వే…

నాటో దాడుల నుండి రక్షణ కోసం నడుం బిగించిన లిబియా మహిళలు -వీడియో

అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాపై దాడులకు సిద్ధమవుతున్న ప్రారంభ కాలంలో లిబియా అధిపతి గడ్దాఫీ లిబియాను రక్షించుకోవడం కోసం ప్రజలకు ఆయుధాలిస్తామని హెచ్చరించాడు. నాటో వైమానిక దాడులకు ముందు గడ్దాఫీ సుదీర్ఘపాలనతో విసిగి ఉన్న లిబియన్లు కూడా విదేశాల దాడులకు వ్యతిరేకంగా నిలబడిన గడ్దాఫీ వెనక అనివార్యంగా సమీకృతులయ్యారు. లిబియా ప్రజల రక్షణ కోసమే లిబియాపై బాంబింగ్ జరుపుతున్నామన నాటో దేశాల మోసపు మాటలలో నిజం ఎంత ఉందో లిబియన్లకు బాగానే తెలుసు. లిబియాలో ఇప్పుడు…