తప్పుడు ప్రచారం చేసినందుకు ‘రీబాక్’ బూట్ల కంపెనీపై $25 మిలియన్ వడ్డన

ఇది అమెరికాలో సంగతి. తమ బూట్లు ధరించి వ్యాయామం చేసినట్లయితే ఇతర బూట్లు ధరించినవారి కంటే వేగంగా ఫిట్‌నెస్ సాధిస్తారని ‘రీబాక్’ బూట్ల కంపెనీ ప్రచారం చేసినందుకుగాను అమెరికా ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ దానిపైన 25 మిలియన్ డాలర్ల పెనాల్టీని వడ్డించింది. రీబాక్ కంపెనీ, ఫెడరల్ ట్రెడ్ కమిషన్ (ఎఫ్.టి.సి) లు పరస్పర అంగీకారం మేరకు ఈ వడ్డన అమలు చేస్తారు. వినియోగదారులకు చేసే చెల్లింపులకు దీనిని ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఎఫ్.టి.సి, రీబాక్ కంపెనీ ప్రచారంపైన…

తీహార్ జైలు కాదు, త్రీ స్టార్ జైలు -కార్టూన్

2జి కుంభకోణంలొ కొత్త పాత్రధారులు బైటికి వస్తున్నారు. మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ పాత్ర పైన తమకు ఆధారాలు లభ్యమైనాయనీ, ఆయనపైన రెండురోజుల్లో క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామనీ సి.బి.ఐ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. పి.చిదంబరం అరెస్టుకు సుప్రమణ్యస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సి.బి.ఐ నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే ప్రధాని మన్మోహన్ పాత్ర కూడా వెల్లడవుతుంది. వీరంతా వి.వి.ఐ.పిలు. దేశాన్ని పాలిస్తున్నవారు. సుప్రీం కోర్టు చురుకుగా ఉన్నందున ఈ వి.వి.ఐ.పిలు వాస్తవానికి వి.వి.ఐ.పి లు కాదనీ…

అజారుద్దీన్ కొడుకుని చంపిన రేస్ బైక్ ఇదే

అజారుద్దీన్‌కు మొదటి భార్యతో కలిగిన కుమారుడు ఆయాజుద్దీన్ ఇటీవల జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ శివార్లలో నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్డుపైన రేస్ బైక్ ను వేగంగా నడుపుతూ చక్రం జారిపోవడంతో ఆయాజుద్దీన్ తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెనక సీట్లో కూర్చున్న అతని బంధువు అక్కడే మృతి చెందగా ఆయాజుద్ధీన్ ఆసుపత్రిలో కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఈ ఘటన పట్ల చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. కొడుకు…

అప్రజాస్వామిక బ్లాగర్ల ప్రజాస్వామిక చింతన

(గమనిక: “భాష, ప్రజాస్వామ్యం, సోషలిజం – పరస్పర సంబంధాలు” వ్యాసంలో ఒక భాగం ఇది.) ప్రజాస్వామ్య భావజాలం ప్రజలందరినీ సమానులుగా చూస్తుంది. మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా అన్ని రకాల ప్రజల విశ్వాసాలను సమానంగా గౌరవిస్తుంది. ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఎంచుతుంది. ప్రజాస్వమిక హక్కులు ప్రజలందరికి సమానంగా వర్తింపజేయాలని భావిస్తుంది. పౌరుల మధ్య ఉన్న వివిధ వ్యత్యాసాలను, అంతరాలను తిరస్కరిస్తుంది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రజాస్వామ్యం గుర్తిస్తుంది. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడాన్ని…

టైగర్ పటౌడి అంతిమ యాత్ర -కొన్ని ఫొటోలు

విదేశీ గడ్డపై మొదటిసారిగా భారత దేశానికి విజయాన్ని అందించిన మాజీ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ టైగర్ పటౌడి అంతిమ యాత్ర పూర్తయింది. ప్రధాని దగ్గర్నుండి మాజీ క్రికెట్ ప్లేయర్ల వరకూ అందరూ టైగర్ భౌతిక దేహం సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పటౌడి అంతిమ యాత్రకు సంబంధించి కొన్ని ఫొటోలను ఫస్ట్ పోస్ట్ మేగజైన్ అందించింది. అవి ఇక్కడ:

అద్భుతమైన ఊటి ఫోటోలు, కట్టి పడేస్తాయి

ఫేస్ బుక్ ‌లో ఓ మిత్రుడు ఈ ఫొటోలను ప్రచురించాడు. ఊటిలో తీసినవట. ఇవెంత బాగున్నాయంటే, వీటిని నా బ్లాగులో తిరిగి ప్రచురించడం ద్వారా నాకు అందుబాటులో ఉంచుకోకుండా ఉండలేకపోయాను.  

వన్డేలనుండి ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ రిటైర్‌మెంట్, కొన్ని కెరీర్ ఫోటోలు

“ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా” గా అనధికార బిరుదును సంపాదించుకున్న రాహుల్ ద్రవిడ్ వన్డేల నుండి రిటైర్ అయ్యాడు. ఇంగ్లండ్ తో ముగిసిన చివరి వన్డే మ్యాచ్‌తో రాహుల్ వన్డేల నుండి రిటైర్‌‌మెంట్ ప్రకటించాడు. వివిధ అకాడమీలు, ప్రభుత్వాలు ఇచ్చే బిరుదులు అవార్డుల కంటే తమ ఆటతీరును బట్టి ఆటగాళ్ళు పొందే బిరుదులు చాలా విలువైననవి. ఆ బిరుదులే ఆటగాళ్ళ నిజమైన ట్యాలెంట్‌ను గుర్తిస్తాయి. ఆ విధంగా రాహుల్ సంపాదించుకున్న బిరుదే ‘ది గ్రేట్ వాల్…

అతి భారీ కూరగాయలు -ఫొటోలు

సెప్టెంబరు 16 తేదీన ఉత్తర ఇంగ్లండులోని హారొగేట్ పట్టణంలో “హారోగేట్ ఆటమన్ ఫ్లవర్ షో జరిగింది. ఇది ఈ సంవత్సరం వందవ ప్రదర్శన జరుపుకుంటోంది. ఈ సారి ప్రదర్శనలో అతి భారీ కూరగాయల ప్రదర్శన విభాగాన్ని ఏర్పాటు చేయడంతో సాగుదారులు పోటీలు పడి ప్రదర్శనలో పాల్గొన్నారు. సాగుదారుడు డెరెక్ న్యూమన్ తన భారీ కేబేజి తో ప్రదర్శనకు వస్తున్నాడు. పీట్ గ్లేజ్ బ్రూక్, 8.15 కిలో గ్రాముల ఉల్లిపాయతో ఆశ్చర్యపరిచాడు

శతాబ్దాల మర్రిమాను నిలువునా కూలినట్లు! -ఫొటో

గుండెలు అవిసేలా రోదిస్తున్న ఈ పెద్దాయనకి స్వాంతన ఎవరు ఇవ్వగలరు? శతాబ్దాల పాటు ఊరంతటికీ నీడనిచ్చిన మర్రిమాను నిలువునా కూలినట్లున్న ఈ దృశ్యం చూపరులను కంట తడిపెట్టేలా ఉంది. ఏం జరిగిందో తెలియని పాప అమాకపు చూపులు మరింతగా హృదయాలను పిండేస్తున్నాయి. తాతో, తండ్రో, మామయ్యో ఇంకెవరో గాని ఈయనని ఓదార్చడానికి కాసింత అవకాశం దొరికితే బాగుడ్ను. వెల్లూరు జిల్లాలోని అరక్కోణం వద్ద కిల్కండిగై వద్ద ఆగి ఉన్న పాసెంజర్ రైలును 90 కి.మీ వేగంతో వస్తున్న…

ఇదీ ఇండియా -యాహూ ఫొటోలు పార్ట్ 2

యాహూ వార్తల వెబ్ సైట్ దేశంలోని ఫోటో గ్రాఫర్ల నుండి ‘ఇదీ ఇండియా’ అంశంపై ఫోటోలను ఆహ్వానించింది. వాటిలో కొన్ని ఎన్నుకుని ప్రచురించింది. బ్లాక్ అండ్ వైట్ ధీమ్ లో ఉన్న ఆ ఫోటోలే ఇక్కడ కూడా. — —

చైనాను అప్పడిగిన ఇటలీ

మరే ఇతర దేశం కన్నా అమెరికాకి అత్యధిక అప్పు ఇచ్చిన చైనాను ఇటలీ కూడా అప్పు అడిగింది. తన సావరిన్ అప్పు బాండ్లను కొనుగోలు చేయవలసిందిగా ఇటలీ చైనాను కోరింది. ఇటలీ బాండ్లను పెద్ద ఎత్తున చైనాచేత కొనుగోలు చేయించడం ద్వాగా గాడి తప్పుతున్న తన ఆర్ధిక వ్యవస్ధను దారిలో పెట్టాల్ని ఇటలీ భావిస్తున్నది. పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, నిర్ధిష్ట కాల పరిమితితో ‘సావరిన్ డెట్ బాండ్లు’ జారీ చేయడం ద్వారా అప్పు సేకరిస్తాయన్న సంగతి తెలిసిందే. అప్పు…

ఫ్రాన్సు అణు వ్యర్ధాల కర్మాగారంలో పేలుడు, ఒకరు దుర్మరణం

మరొక అభివృద్ధి చెందిన దేశంలో అణు కర్మాగారం పేలిపోయింది. భారత దేశానికి అణు రియాక్టర్లు అమ్మడానికి ఉరకలు వేస్తున్న దేశాలలో ఒకటైన ఫ్రాన్సులో అణు వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేసే కర్మాగారంలో అణు వ్యర్ధాలను మండించడానికి వినియోగించే బట్టి పేలిపోయిందని ఫ్రెంచి పత్రికలను ఉటంకిస్తూ గార్డియన్ తెలిపింది. పేలుడులో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారనీ, గాయపడ్డ వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉందనీ తెలుస్తోంది. ఫ్రాన్సు ప్రపంచంలోనే అత్యధికంగా అణు ఇంధనం ఉపయోగిస్తుంది. తన విద్యుత్ ఉత్పత్తిలో అత్యధిక…

నేరుగా ఆవు పొదుగు నుండే పాలు తాగుతున్న బాలుడు, అయినా క్షేమం

ఇది 18 నెలల కాంబోడియా పసి బాలుడి కధ. ఈ బాలుడు నెల రోజులకు పైగా నేరుగా ఆవు పొదుగుని నోట్లో పెట్టుకుని పాలు తాగుతున్నాడు. అయినా బాలుడు క్షేమంగానే ఉన్నాడని బాలుడి తాత చెబుతున్నాడు. బాలుడి పేరు ధా సోఫత్. బాలుడు గత జులై నుండీ నేరుగా ఆవు పొదుగునుండి పాలు తాగుతున్నాడని వెల్లడించాక ఆ వార్త అంతర్జాతీయంగా పతాక శీర్షికలను ఆక్రమించింది. ఇటీవల సంభవించిన తుఫాను దెబ్బకి బాలుడి తల్లిదండ్రుల ఇల్లు పాడైపోయింది. జీవనానికి…

కాంట్రాక్టు నిబంధనలను రిలయన్స్ ఉల్లంఘించింది -కాగ్ అక్షింతలు

భారత దేశ రాజ్యాంగసంస్ధ, ప్రభుత్వ ఉన్నత ఆడిటింగ్ సంస్ధ అయిన ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టు ఉల్లంఘనలపై తన పూర్తి నివేదికను గురువారం సమర్పించింది. ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండింటినీ కాగ్ విమర్శించింది. కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకీ, రిలయన్స్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించేలా సహకరించినందుకు ప్రభుత్వానికీ అక్షింతలు వేసింది. దేశానికి చెందిన కీలకమైన ఆయిల్ వనరు కృష్ణ-గోదావరి (కె.జి) బేసిన్ అభివృద్ధి చేసే కాంట్రాక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్…