ట్రంప్ టారిఫ్ మేనియా -పార్ట్ 2

– ——-మొదటి భాగం తరువాత ప్రధాన ఆర్ధిక పోటీదారు అయిన చైనా దానికదే ఒక కేటగిరీ. చైనా ఉత్పత్తుల పైన 145 శాతం టారిఫ్ లు విధిస్తానని ఒకప్పుడు బెదిరించినప్పటికీ చివరికి 30 శాతం టారిఫ్ తో ట్రంప్ సరిపెట్టాడు. 30 శాతం టారిఫ్ నే ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. చైనా ఉత్పత్తులు అమెరికా మార్కెట్లకు దిగుమతి కాకుండా నిరోధించటంలో అమెరికాకి ఉన్న పరిమితులను ఇది వెల్లడి చేసింది. అరుదైన ఖనిజ పదార్ధాల లభ్యతలో చైనా దాదాపు గుత్తస్వామ్యం…

ట్రంప్ టారిఫ్ మేనియా: వెర్రిబాగులతనమా లేక ప్రణాళికాబద్ధమా? -పార్ట్ 1

—–న్యూ డెమోక్రసీ పత్రిక నుండి, (అనువాదం: విశేఖర్, సెప్టెంబర్ 7) తన స్వాధీన విధానం (mode of acquisition) లో మరియు తన సౌఖ్యాలలో ద్రవ్య కులీన వర్గం అన్నది, బూర్జువా సమాజం సమున్నత స్థాయిలో, లంపెన్ కార్మిక వర్గం తిరిగి పునర్జన్మ పొందడమే. -కారల్ మార్క్స్ ———- డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రంధిలో పడ్డాడు. టారిఫ్ లు మోపడం అంతలోనే వాటిని స్తంభింపజేయటం, వివిధ దేశాల నుండి వచ్చే దిగుమతుల పైన టారిఫ్ రేట్లు పెంచటం…

ట్రంప్ దెబ్బకు అనిశ్చితిలో ఆర్ధిక వ్యవస్థలు!

Deportees entering the U.S. military plane అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే గాజా యుద్ధాన్ని చిటికెలో ముగిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాలు శత్రు దేశాలు అన్న తేడా లేకుండా అన్ని దేశాలతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడిని పొగిడాడో, తిట్టాడో తెలియని వ్యాఖ్యలతో అయోమయం సృష్టించి ఇండియాను మాత్రం “అతి భారీ వాణిజ్య సుంకాలు మోపే దేశం” అని ప్రతికూల వ్యాఖ్యలతో భారత…

మార్కెట్లో ‘బై చైనా, సెల్ ఇండియా’ సెంటిమెంట్!

గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా…

డాలర్ కి వేగంగా తూట్లు పొడుస్తున్న చైనా!

మాయల మరాఠి ప్రాణం ఏడేడు సంద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో ఉన్నట్లుగా అమెరికా ప్రపంచాధిపత్యం, పెత్తనం అంతా ప్రపంచ మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యం లోనే నిక్షిప్తమై ఉన్నది. అమెరికా ఆధిపత్యాన్ని కూల్చాలంటే మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యాన్ని కూలగొడితే చాలు. అమెరికా దుర్గం పేక మేడ లాగా ఇట్టే కూలిపోతుంది. చైనా, రష్యా దేశాలు గత అయిదారేళ్లుగా డాలర్ పెత్తనాన్ని కూల్చేందుకు కృషి ప్రారంభించి మెల్లగానే అయినా స్ధిరంగా ఆ వైపు అడుగులు…

స్విస్ బ్యాంకుల్లో 2570 కోట్ల అదాని ఖాతాల స్తంభన, స్విస్ కోర్టుల విచారణ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి భుజాల పైన అత్యంత భారీ కర్తవ్యమే వచ్చి పడింది. “నేను తినను, ఎవరినీ తిననివ్వను” (मै नहीं खावूंगा , न खाने दूंगा) అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో అట్టహాసంగా, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఇన్నాళ్ళకి చేతి నిండా పని దొరికింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు, మాఫియాలు, నల్ల డబ్బు యజమానులు అక్రమంగా తరలించి దాచిన సొమ్మును తాను…

రు. 76 వేల కోట్ల వసూలు ఇక కష్టమే -సెబి

కంపెనీలు పాల్పడిన వివిధ అవినీతి వ్యవహారాల వలనా, చిన్నా పెద్దా మదుపుదారుల నుండి పెట్టుబడులను మోసపూరితంగా వసూలు చేయడం వలనా, సెబి విధించిన అపరాధ రుసుముల వలనా, ఇంకా అనేక ఇతర కారణాల వలనా, వసూలు కావలసిన మొత్తంలో రు 76,293 కోట్లు వసూలు కావటం ఇక కష్టమే అని సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ప్రకటించింది. సెబి, ఇలాంటి వసూలు కావటం కష్టంగా మారే వాళ్ళ జాబితాను క్రమం తప్పకుండా యేటా తయారు…

సెబి రెగ్యులేటర్ రూల్స్ ఉల్లంఘించింది -రాయిటర్స్

అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మరియు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్ బర్గ్ రీసర్చ్, సెబి రెగ్యులేటర్ (సెబి ఛైర్మన్) మాధాబి పూరి బక్ పై చేసిన ఆరోపణలలో వాస్తవం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. హిండెన్ బర్గ్ రీసర్చ్ గతంలో ఆదాని కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అదాని గ్రూప్ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనీ, టాక్స్ హేవెన్ (పన్నులు అతి తక్కువగా ఉండే) దేశాలను…

ఎపికి ఇచ్చేది గ్రాంటు కాదు, ప్రపంచ బ్యాంకు అప్పు

Amaravati the Ghost Town 2024-25 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు ప్రకటించారు. టిడిపి, జెడి(యు) పార్టీల మద్దతు పైన బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందునే ఆర్ధిక మంత్రి ‘కుర్సీ కో బచావో’ పధకం మేరకు ఆ రెండు రాష్ట్రాలకు నిధులు ప్రకటించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించాడు. ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపిందని ఆరోపించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి…

రెండిందాల నష్టపోతున్న మిడిల్ క్లాస్!

పన్ను చెల్లింపుదారుల్లో కార్పొరేట్ కంపెనీల కంటే మిడిల్ క్లాస్ ఆదాయంతో రోజులు కనాకష్టంగా వెళ్లదీసే వర్గమే అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని గత ఆర్టికల్ లో, ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సర్వే సాక్షిగా, చూశాం. అత్యధిక పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ‘అడకత్తెరలో పోకచెక్క’ పరిస్ధితిని కాస్త చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా రెండు రకాల పన్నుల ద్వారా ప్రజల నుండి ఆదాయం సమకూరుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు: ఆదాయ పన్ను, కార్పొరేట్ల లాభాలపై పన్నులు. రెండవది,…

ప్రశ్న: రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటి?

అంకమ్మ ‘ ‘: సర్, రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటో చెప్పండి. జవాబు: మీ పేరు చివర తోకను రాయనందుకు అన్యధా భావించ వద్దు. నిన్న రష్యా ఆర్ధిక వ్యవస్థ గురించి రాసిన టపాలో రియల్, నామినల్ జిడిపి ల గురించి ప్రస్తావించాను. బహుశా అది చదివాక మీకు ఈ ప్రశ్న ఉదయించి ఉంటుంది. ఈ జవాబు పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. రియల్ జిడిపి: పేరులోనే ఉన్నట్లు రియల్ జిడిపి ఒక…

పశ్చిమ ఆంక్షల నడుమ high-income దేశంగా రష్యా!

ఉక్రెయిన్ పై దాడిని సాకుగా చూపిస్తూ రష్యా పైన అమెరికా, ఐరోపా దేశాలు విస్తృతమైన ఆంక్షలు అమలు చేసినప్పటికీ రష్యా ఉన్నత ఆదాయ దేశంగా అవతరించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితా ద్వారా ఈ సంగతి వెలుగు లోకి వచ్చింది. నిజానికి రష్యా 2014 వరకు ఉన్నత ఆదాయ దేశమే. మార్చి 2014 లో ఉక్రెయిన్ లో ‘యూరో మైదాన్’ పేరుతో జరిగిన ఆందోళనల నేపధ్యంలో, అప్పటి వరకు జి8 గ్రూపు దేశాల…

విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశాడు -చంద్రబాబు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ రంగం పైన శ్వేత పత్రం విడుదల చేస్తూ ముఖ్య మంత్రి గత ముఖ్య మంత్రి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం అనేక నష్టాలు ఎదుర్కొన్నదని, ఇప్పుడు అది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని వివరించాడు.…

ఇండియన్ ట్విట్టర్ ‘కూ’ మూసివేత!

ట్విట్టర్, ఇపుడు ఎక్స్, కు భారతీయ పోటీగా ప్రస్తుతించ బడిన భారతీయ మైక్రో బ్లాగింగ్ కంపెనీ ‘కూ’ ను మూసి వేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు ప్రకటించారు. కూ అభివృద్ధికి అవసరమైన నిధులను సంపాదించడం కష్టంగా మారడంతో సంస్థను మూసివేయక తప్పడం లేదని వారు ప్రకటించారు. “కూ యాప్ ను కొనసాగించడం మాకు ఇష్టమే అయినప్పటికీ టెక్నాలజీ సేవలను నిర్వహించేందుకు అయే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున ఈ కష్టమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు” అని కూ కంపెనీ…

ఎఫ్.డి.ఐల దోపిడీ, భారతీయ పాలకులు మేధావుల సహకారం

మార్చి 2024తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియా లోకి ఎఫ్.డి.ఐల రాబడి గత ఆర్ధిక సంవత్సరం (FY 2023) తో పోల్చితే ఏకంగా 62 శాతం పడిపోయినట్లు ఆర్.బి.ఐ ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.

2023-24 ఆర్ధిక సం. లో దేశం లోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) కేవలం 10.58 బిలియన్ డాలర్లు మాత్రమే.