అద్వానీ ఆవిరై న.మోగా ఘనీభవనం

హాలీవుడ్ యాక్షన్ ధ్రిల్లర్ ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమాలో హీరో, విలన్ ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇప్పుడంటే అలాంటి గ్రాఫిక్ సీన్లు మామూలయ్యాయి గాని రెండు దశాబ్దాల క్రితం ఆ తరహా గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని నిజంగానే భవిష్యత్తుకి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా ఆ విలన్ ఏ పాత్రలోకయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. రంధ్రాల గుండా, సందుల గుండా ఎక్కడికంటే అక్కడికి పాదరసంలా జారిపోతూ కావలసిన రూపంలోకి మారిపోతూ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాడు. ఇప్పుడు బి.జె.పిలో…

ఓ సమైక్య మొగుడి ఆధిపత్యం చూసి తీరాలి -వీడియో

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్ధితులకు ఈ వీడియో చక్కగా అద్దం పడుతోంది. సంసారంలో భార్యా, భర్తలు ఇద్దరూ సమానం అయితేనే అది సజావుగా నడుస్తుంది.  కానీ పురుషాధిక్య సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం అనేక సందర్భాల్లో డొల్లగా మారిపోయింది. చట్టాలు పురుషాధిక్యతను తిరస్కరిస్తున్నట్లు చెబుతాయి. స్త్రీలపై జరిగే అన్యాయాలను అరికట్టడానికే కంకణం కట్టుకున్నట్లు బల్లలు గుద్దుతాయి. కానీ అమలు విషయంలో అదంతా నాటకం అని తేలిపోతుంది. ఆచరణలోకి వచ్చేసరికి అమలు చేయాల్సింది మళ్ళీ ఆ పురుషులే, లేదా పురుషాధిక్య…

ప్రవేశపెడ్తున్నాం, మోడి ఫిడేల్ సింఫొనీ -కార్టూన్

బి.జె.పి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడిని ప్రకటించే రోజు ‘ఇదిగో ఈ రోజే’ అనీ, ‘కాదు, కాదు రేపే’ అనీ పత్రికలు, ఛానెళ్లు ఒకటే రచ్చ! కానీ ఆ రోజు మాత్రం రావడం లేదు. సెప్టెంబరు 17 లోపు ప్రకటిస్తారని తాజాగా పత్రికల కధనం. కానీ అద్వానీని మె(ఒ)ప్పించడమే బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ సంస్ధలకు మహా కష్టం అయిందని వార్తలు చెబుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్ పనుపున, ఆర్.ఎస్.ఎస్ రాయబారిగా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అద్వానితో చర్చలు జరపడం ఒకసారి…

యు.పి: మంటలు ఆర్పు తున్నట్లా? ఎగదోస్తున్నట్లా?

ఉత్తర ప్రదేశ్ లో మరొకసారి మత విద్వేషపు మంటలు రగిలాయి. కాదు, రగల్చబడ్డాయి. బి.జె.పి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టిందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. జరిగిన సంఘటనలు కూడా ఆ వాదనను నిజం చేస్తున్నాయి. బి.కె.యు అనే రైతు సంఘం నిర్వహించిన భారీ బహిరంగ సభలో బి.జె.పి నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లనే భారీ సంఖ్యలో (ఇప్పటివరకూ 40 మంది చనిపోయారని…

హైద్రాబాద్ రెవిన్యూ, పెట్టుబడులు, వాస్తవాలు

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. ‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై…

నేను తప్పిపోతే బావుడ్ను -కార్టూన్

రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది అనడిగితే మౌనమే సమాధానం! ‘బిల్లుల ఆమోదానికి సహకరించం’ అని ప్రతిపక్షాలు మొండికేస్తే అప్పుడు కాస్త నోరు పెగుల్చుకుని ‘స్వదేశీ, విదేశీ రెండు కారణాలు పని చేస్తున్నాయి’ అని చెప్పి ఊరుకున్నారు. గట్టిగా అడిగితే మరిన్ని సంస్కరణలు తెస్తే మళ్ళీ మొదలు పెట్టొచ్చు అంటూ ‘పెనం మీంచి పొయ్యిలోకే దూకుతాం’ అని చెబుతారు, ప్రధాని మన్మోహన్.

నేను కాదు మోడి ప్రభుత్వం జైల్లో ఉండాలి -డి.ఐ.జి వంజార

గుజరాత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ప్రసిద్ధి చెందిన మాజీ డి.ఐ.జి వంజార తన ఐ.పి.ఎస్ పదవికి రాజీనామా చేశాడు. హోమ్ శాఖ కార్యదర్శికి రాసిన రాజీనామా లేఖలో ఆయన మోడి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మోడి నమ్మిన బంటు అమిత్ షాను ఉతికి ఆరేశాడు. వరుసగా అనేక బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడినందుకు గాను మరో 36 మంది పోలీసు

అసరం అత్యాచారం: ప్రాధమిక సాక్ష్యాలున్నాయ్ -పోలీసులు

తన ఆశ్రమ పాఠశాల విద్యార్ధినిపై అసరం బాపు అత్యాచారానికి పాల్పడ్డాడనేందుకు ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. జోధ్ పూర్ డి.సి.పి అజయ్ లాంబ ప్రకారం 16 యేళ్ళ బాలిక ఫిర్యాదుపై పోలీసులు ప్రాధమిక విచారణ పూర్తి చేశారు. అసరంపై బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని వారి ప్రాధమిక విచారణలో తేలిందని

బి.జె.పి… బోడి మల్లయ్య -కార్టూన్

“ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య!” ఈ సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బి.జె.పి పైన ప్రయోగించిందని కార్టూన్ సూచిస్తోంది. కాని, అది నిజమేనా? ఉప్పు-నిప్పుగా ప్రజలకు కనిపించే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటై ఆహార భద్రతా బిల్లు, భూ స్వాధీన బిల్లు లను ఆమోదించాయి. బిల్లులు ఆమోదం పొందేవరకు ఇరు పక్షాలు ఒకరినొకరు బాగా సహకరించుకున్నాయి. ఆహార భద్రతా బిల్లులో బి.జె.పి చేసిన కొన్ని సవరణలను ఆమోదించేవరకు కాంగ్రెస్ వెళ్లింది. కొన్ని సవరణలను…

అసరం దొంగాట, పోలీసుల తొండాట

తన ఆశ్రమం నడిపే పాఠశాల విద్యార్ధినిపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అసరం బాపు పోలీసులకు దొరక్కుండా దొంగాట ఆడుతుంటే, ఆయన ఎక్కడ ఉన్నదీ తెలిసి కూడా పోలీసులు తొండాట ఆడుతున్నారని పత్రికలు ఆరోపిస్తున్నాయి. హిందూ మత ప్రబోధకుడు అసరం బాపుకు ఇచ్చిన ఆగస్టు 30 తేదీ గడువు ముగిసినా ఆయన అరెస్టు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత దేవుడికీ, సామాన్యుడికి చట్టం ఒకే విధంగా ఎందుకు పని చేయదని జర్నలిస్టులు, ఎడిటర్లు ప్రశ్నిస్తున్నారు. జోధ్…

ఒంటరైనా వెలివేసినా సిరియా దాడికి కాలుదువ్వుతున్న అమెరికా

సిరియాపై పరిమిత దాడి చేసి రసాయన ఆయుధాలు ప్రయోగించినందుకు అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను శిక్షిస్తానని ప్రకటించిన అమెరికా ఒంటరిగా మిగిలింది. సిరియా దాడిలో భాగస్వామ్యం వహించడానికి వీలు లేదని బ్రిటన్ పార్లమెంటు తేల్చి చెప్పింది. ‘దాడికి సై’ అన్న ఫ్రాన్సు వెనక్కి తగ్గి ‘ఐరాస అనుమతితో చేద్దాము, చర్చలు కూడా చేద్దాము’ అంటూ యుద్ధ పిపాసను తగ్గించుకుంది. దాడికి సహకరించేది లేదని జర్మనీ స్పష్టం చేసింది. ఐరాస పరిశీలకుల నివేదిక అందకుండా దాడి వద్దే వద్దు…

సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారాలంటే… ?

(moola) ప్రశ్న:  సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? సమాధానం: కేంద్రం దృష్టిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధమ కర్తవ్యంగా ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా తేలిక. కానీ కేంద్రాన్ని ఏలుతున్న పాలకవర్గాల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేక దిశలో ఉన్నాయి. కాబట్టి మనం అనుకునే పరిష్కారం వారు ఇవ్వరు. వారు చూపే ఉద్యమ అణచివేత పరిష్కారం ప్రజలకి సానుకూలం కాదు. పాలక వర్గాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రజలకు ఒక…

అమెరికా నల్లజాతి ఉత్తుంగ తరంగానికి 50 యేళ్ళు -అరుదైన ఫోటోలు

“నాకొక కల ఉంది” (I have a dream) అంటూ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ చేసిన చరిత్రాత్మక పౌర హక్కుల ప్రసంగానికి ఆగస్టు 28, 2013తో 50 యేళ్ళు నిండాయి. అమెరికా ప్రజల పౌర హక్కుల కోసం, ముఖ్యంగా నల్లజాతి ప్రజలపై అమానుష రీతిలో కొనసాగుతున్న తీవ్ర వివక్షకు వ్యతిరేకంగా ‘నల్లజాతి ఉత్తుంగ తరంగమై ఉద్యమించిన’ మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతి ప్రజలతో పాటు, తెల్లజాతి ప్రజలను కూడా సమాన స్ధాయిలో ఉత్తేజపరిచాడు. ప్రత్యేకంగా ఆగస్టు…

మబ్బుల్లో నీళ్ళు చూసి…. -కార్టూన్

మబ్బుల్లో నీళ్ళు చూపించి ఓటు అడగబోతున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఆహార భద్రతా బిల్లును చారిత్రాత్మకంగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ఈ బిల్లును ప్రవేశ పెట్టడం తన అదృష్టంగా చెప్పుకున్నారు. ఈ పధకం ద్వారా దేశంలో 70 కోట్ల మందికి ఆహార భద్రత లభించనున్నదని ఆమె లోక్ సభలో బిల్లు ప్రవేశపెడుతూ ప్రకటించారు. 67 యేళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటివరకూ 70 కోట్ల మందికి ఆహార భద్రత లేదని కాంగ్రెస్ నాయకురాలు పరోక్షంగా అంగీకరించారు. బిల్లు…