కేజ్రీవాల్ పని: ఆజియన్ స్టేబుల్స్ శుభ్రపరచడం -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్ పని తీరు (వర్కింగ్ స్టైల్) పైన సున్నితమైన విమర్శ ఈ కార్టూన్. CLEANING OF AUGEAN STABLES అనే ఆంగ్ల వాడుకను కార్టూనిస్టు ఇందులో వినియోగించారు. ఆజియన్ అనే ఆయన గ్రీకు పురాణాల్లో ఒక రాజు. ఆయన వద్ద స్వర్గం నుండి ప్రసాదించబడిన పశు సంపద భారీగా ఉండేదిట. భారీ సంఖ్యలో ఉన్నందున వాటి విసర్జనాలు కూడా పెద్ద మొత్తంలో ఉండేవి. అందువలన ఆయనగారి పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం ఎవరికైనా అసాధ్యం. హెర్క్యూలియస్ అనే…

లోక్ సభలో తెలంగాణ బిల్లు, లగడపాటి పెప్పర్ స్ప్రేతో కల్లోలం

తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెడుతుండగానే లగడపాటి బరితెగించి పాల్పడిన చర్య తీవ్ర అల్లకల్లోలానికి దారి తీసింది. లోక్ సభ వెల్ లోకి ప్రవేశించిన రాజగోపాల్ జేబులో నుంచి పెప్పర్ స్ప్రే (మిరియాల పొడి కలిపిన ద్రావకం) బైటికి తీసి సభ నలువైపులా జల్లడంతో స్పీకర్ తో సహా పలువురు సభ్యులు అశ్వస్ధతకు గురయ్యారు. రాజగోపాల్ సృష్టించిన గందరగోళం పలువురి ఖండన మండనలతో పాటు 17…

వీసా ఇస్తామని అనుకోవద్దు, అమెరికా వివరణ

అమెరికా రాయబారి నరేంద్ర మోడిని కలవడానికి అపాయింట్ మెంట్ కోరినంత మాత్రాన తమ వీసా విధానంలో మార్పు ఉంటుందని భావించనవసరం లేదని అమెరికా విదేశాంగ శాఖ వివరణలాంటి సవరణ ప్రకటించింది. అమెరికా వీసా విధానంలో గానీ, ప్రపంచవ్యాపితంగా మానవహక్కులకు మద్దతుగా నిలవడంలో గానీ అమెరికా ఎలాంటి మార్పు చేసుకోలేదని గొప్పలు పోయింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకి విలేఖరులకు వివరణ ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలుసుకోవడానికి అమెరికా రాయబారి…

‘మోడి బహిష్కరణ’కు అమెరికా చెల్లు చీటి

‘మోడి బహిష్కరణ’ విధానానికి ఇక ముంగింపు పలకాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీకి వీసా నిరాకరించే విధానాన్ని విడనాడాలని ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ప్రత్యేకంగా అమెరికా వెళ్ళి మరీ చేసుకున్న విన్నపం ఫలితం ఇచ్చిందనేందుకు సూచనగా అమెరికా రాయబారి నాన్సీ పావెల్ మరో రెండు రోజుల్లో మోడిని కలవనున్నారు. నాన్సీ పావెల్ కోరిక మేరకు గాంధీ నగర్ లో ఆమెను కలవడానికి మోడి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోడి అపాయింట్…

చాయ్, మోడిలతో బి.జె.పి రెడీ -కార్టూన్

– పదేళ్ళ నుండి తెలంగాణ బిల్లును నానబెట్టిన కాంగ్రెస్ పార్టీ, 2014 ఎన్నికల కోసం మాత్రమే అలా చేసిందని, బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోవడంతో టి.బిల్లుపై హడావుడి పడుతోందని ఈ కార్టూన్ సూచిస్తోంది. ***                    ***                    *** బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పుడేం ఖర్మ! ఎప్పుడో మొదలైపోయింది. ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలను కూడా ప్రచార సామాగ్రిగా మార్చుకుని మరీ అది ఎన్నడో రంగంలోకి దిగింది. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా వెనకబడి ఏమీ లేదు. రాహుల్…

6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు

ప్రతిపక్ష బి.జె.పి విమర్శలు తమ ద్వంద్వ ఎత్తుగడలను ఉతికి ఆరబెట్టడంతో కాంగ్రెస్ సవరణలకు దిగింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎం.పిలను పార్టీ నుండి బహిష్కరించింది. తద్వారా తెలంగాణ బిల్లు విషయంలో తాను సీరియస్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. బిల్లును మొదట రాజ్యసభలో పెడతామని చెప్పిన ప్రభుత్వం న్యాయశాఖ సలహాతో రూటు మార్చుకుని లోక్ సభలో పెట్టడానికి నిర్ణయించుకుంది. 6గురు కాంగ్రెస్ ఎం.పి లు అమరవీరులుగా ఛానెళ్ల ముందు నిలబడుతుండగా,…

ఢిల్లీ సర్కార్: ఎలుకకు చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం -కార్టూన్

“పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం”, ఇది కదా అసలు సామెత! కానీ ఢిల్లీ సర్కార్ విషయంలో ఈ సామెత రివర్స్ అయిపోయింది. ‘టాం అండ్ జెర్రీ’ లోని ఎలుక తరహాలో కాంగ్రెస్ పిల్లిని ఎఎపి ఎలుక అదే పనిగా ఆట పట్టించడం జనానికి భలే పసందైన కనుల విందు. కాకపోతే మద్దతు ఇస్తున్న పార్టీ వణకడం ఏమిటి? మద్దతు తీసుకుంటున్న పార్టీ ‘మద్దతు వెనక్కి తీసుకుంటారా, అయితే తీస్కోండి’ అంటూ చిద్విలాసంగా సవాళ్ళు విసరడం ఏమిటి?…

ఎ.పి పొలిటికల్ ఆటో ఎక్స్ పో -కార్టూన్

కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్ లో ఆటో ఎగ్జిబిషన్ జరిగింది. ఆటో ఎగ్జిబిషన్ నూ రాష్ట్ర విభజన కేంద్రంగా వివిధ పార్టీల్లో సాగుతున్న రాజకీయాలను పోల్చుతూ గీసిన కార్టూన్ ఇది. కాంగ్రెస్: రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా విభజన రాజకీయాలకు సంబంధించి సోనియా ఒకవైపు వెళ్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సరిగ్గా ఆమెకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. విభజనపై తమ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కిరణ్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ఆటో ఎక్స్ పో. తెలుగు దేశం:…

కోస్తాంధ్ర, హైద్రాబాద్ లది మిగులు బడ్జెట్

  బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ను హైద్రాబాద్, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ.. అన్న నాలుగు యూనిట్ లుగా విడదీస్తే అందులో హైద్రాబాద్, కోస్తాంధ్రలు మిగులు బడ్జెట్ తో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు మాత్రం లోటు బడ్జెట్ తో ఉన్నాయని తెలిపారు. కోస్తాంధ్ర (7 జిల్లాలు) ప్రాంతం 684 కోట్ల మిగులు బడ్జెట్ కలిగి ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. హైద్రాబాద్ ఏకంగా 12,854 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్…

తెలంగాణ: లైన్ క్లియర్, రాజీనామా యోచనలో కిరణ్

రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా పార్లమెంటులో ప్రవేశించనున్న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎం.పిలు, ఎమ్మేల్యేలు తదితరులు ప్రతిపాదించిన సవరణలలో కొన్నింటిని బిల్లులో చేర్చడానికి కేబినెట్ ఆమోదించింది. అయితే సీమాంధ్ర నాయకుల డిమాండ్లను ఏ మేరకు అంగీకరించారు అన్న అంశంలో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లు వివరాలను ముందే పత్రికలకు చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన కావడంతో హోమ్ మంత్రి బిల్లు, సవరణల వివరాలను పత్రికలకు చెప్పలేదు.…

కరుగుతున్న కాలానికి ప్రతీక 15వ లోక్ సభ -కార్టూన్

కార్టూనిస్టుల ఊహలు ఒక్కోసారి ఎంత అందంగా ఉంటాయో వివరించే కార్టూన్ ఇది! 15వ లోక్ సభ, 16వ లోక్ సభల మధ్య సంధి కాలాన్ని ఈ కార్టూన్ లో దర్శించవచ్చు. లేదా 16వ లోక్ సభలోకి జారుతున్న 15వ లోక్ సభ స్వరూపాన్ని కూడా ఇందులో చూడవచ్చు. కాలాన్నీ, రాజకీయాలను, కాలంతో పాటు మారుతున్న రాజకీయాల స్వరూపాన్నీ కూడా ఇందులో చిత్రించే ప్రయత్నాన్ని కార్టూనిస్టు చేశారు. 15వ లోక్ సభ చివరి సెషన్ కు అనేక బిల్లుల్ని…

ఎఎపి పాలన: షీలాపై ఎఫ్.ఐ.ఆర్

మొదటి వేటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పైనే పడింది. సి.ఎం అరవింద్ ఆదేశం అందుకున్న రోజే ఢిల్లీ ఎ.సి.బి రంగంలోకి దిగింది. వీధి దీపాల కుంభకోణంలో మాజీ సి.ఎం షీలా దీక్షిత్ పై ఎ.సి.బి, ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసింది. 2010లో కామన్వెల్త్ ఆటల పోటీలు ఢిల్లీలో జరిగిన సందర్భంగా చేపట్టిన వీధి దీపాల నిర్మాణం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని షుంగ్లు కమిటీ తేల్చింది. కమిటీ పరిశీలనలను షీలా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త…

ఎఎపి పాలన: షీలా అవినీతిపై విచారణ!

బైటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పైకి ఢిల్లీ ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది. కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వివిధ నిర్మాణాల్లోని అవినీతిని విచారించాలని రాష్ట్ర ఎ.సి.బిని ఆదేశించింది. సాధారణంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలను సంతృప్తిపరచడానికీ, వారు అలిగినప్పుడు ప్రసన్నం చేసుకోవడానికీ, వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి పాలక పార్టీలు నానా అగచాట్లు పడుతుంటాయి. కానీ ఎఎపి పార్టీ ఈ విషయంలోనూ ‘నేను తేడా’ అని చెబుతోంది. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్…

‘మూడో కూటమి’ అను ఓ ప్రహసనం -కార్టూన్లు

భారత దేశంలో గిరాకీ లేని ప్రాంతీయ పార్టీలు, వామపక్ష పార్టీలు కలిసి అప్పుడప్పుడూ చేసే తాటాకు చప్పుళ్లను ‘మూడో కూటమి’ అని పిలుస్తుంటారు. ఈ చప్పుళ్ళు ఎక్కువగా సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందే వినబడతాయి. ఎన్నికలు ముగిస్తే చాలు, అవిక వినపడవు. ఖర్మ కాలి కాంగ్రెస్ కూటమి (ఒకటో కూటమి?), బి.జె.పి కూటమి (రెండో?) లకు ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ రాకపోయినా లేదా ఈ మూడో కూటమి బ్యాచ్ లోని పార్టీలు మొదటి, రెండవ కూటమిలలో…

అవినీతి నేతల చిట్టా -కార్టూన్

“ఈసారి నుండి సారూ, అవినీతికి పాల్పడని నాయకుల జాబితా తయారు చేయమని అడగండి. అలాగైతేనే సమయం వృధా కాదు…” – అవినీతి నేతల చిట్టా తయారు చేయడం ఎంత కష్టమో ఈ కార్టూన్ చెబుతోంది. అనేకమంది నేతల్లో అవినీతి నేతలను వెతుక్కోవలసి రావడం కాదు ఆ కష్టం. అవినీతి నేతలను కనిపెట్టడం తేలికే గానీ వారి పేర్లను రాస్తూ పోవడమే అసలు కష్టం. కనపడ్డా ప్రతి రాజకీయ నాయకుడూ ఏదో ఒక సందర్భంలో అవినీతి సంపాదన ఆరోపణ,…