గిరిజన విద్యకు గుజరాత్ వరస్ట్ రాష్ట్రం -బి‌జే‌పి నేత

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, తొలగింపులు జరిగాక అసమ్మతి స్వరాలు మెల్లగా బయలు దేరుతున్నా యి. అయితే ఆ అసమ్మతి పదవి పేరుతో కాకుండా పార్టీ పనితనం పేరుతో వ్యక్తం కావటం విశేషం. ‘కాంగ్రెస్ కంటే మాది భిన్నమైన పార్టీ’ అని బి‌జే‌పి నేతలు చెబుతుంటారు. అసమ్మతిలో కూడా భిన్నం అన్నమాట! కేంద్ర మంత్రివర్గంలో మన్సుఖ్ వాసవ నిన్నటి వరకు గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. బి‌జే‌పి/మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన మే 2014 నుండి…

క్లుప్తంగా… -10/06/2016

ఏప్రిల్ లో క్షీణించిన ఫ్యాక్టరీ ఉత్పత్తి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నెలలో ఫ్యాక్టరీ/పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోయింది. 2015 ఏప్రిల్ తో పోల్చితే 2016 ఏప్రిల్ నెలలో ఫ్యాక్టరీల ఉత్పత్తి 0.8 శాతం తగ్గిపోయిందని కేంద్ర గణాంక కార్యాలయం (CSO – Central Statistics Office) ప్రకటించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి సాధించిందని అట్టహాసంగా ప్రకటించి రోజులు గడవక ముందే ఈ ప్రతికూల వార్త వెలువడటం…

రాజ్యసభ ఎన్నికలు: మండుతున్న ధరలు -కార్టూన్

గృహస్ధుడు & నాయకుడు: “అబ్బబ్బ! ధరలు మరీ అందుబాటులో లేకుండా పోయాయి!” ********* ప్రజల మేలు ఏనాడూ కోరని పార్టీలు, వాటి నాయకులు ఆ సంగతి మరిపించటానికి అలవి గాని వాగ్దానాలు చేయడం, అవి తీర్చలేక (ఆఫ్ కోర్స్! తీర్చే ఉద్దేశం లేక) ఎన్నికలలో అక్రమాలకు పాల్పడటం పరిపాటి. ఎన్నికల అక్రమాలలో పేరెన్నిక గన్నవి డబ్బు పంపిణీ, మద్యం తాగబోయించటం అని అందరికీ తెలిసిన సంగతే! కూలీనాలితో పొట్ట పోసుకునే శ్రామికులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదు.…

పఠాన్ కోట్ దాడిలో పాక్ హస్తం: సాక్ష్యం లేదు  -ఎన్ఐఎ

నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అథిపతి పొరపాటునో గ్రహపాటునో ఒక నిజం కక్కేశారు. “పఠాన్ కోట్ దాడి వెనుక పాక్ హస్తం లేదు” అని న్యూస్18 ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దాడి వెనుక పాక్ ప్రభుత్వం  గానీ పాక్ ప్రభుత్వ ఏజెన్సీలు గానీ కుమ్మక్కు అయినట్లు తమ వద్ద ఎటువంటి సాక్షాలు లేవుఅని ఎన్ ఐ ఎ డైరెక్టర్ శరత్ కుమార్ స్పష్టం చేశారు.  ఎన్ ఐ ఎ వెల్లడి కేంద్రం లోని బిజెపి ప్రభుత్వాన్ని…

యూపి ఎన్నికలు : దళిత ఓట్లు  -కార్టూన్ 

2017లో  జరిగే  యూపి ఎన్నికలలో దళితుల ఓట్లు కీలకం అవనున్నాయని పార్టీలు భావిస్తున్నాయి. దానితో దళితులను ప్రసన్నం చేసుకుని లబ్ది పొందడానికి వివిధ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. బిజెపి మామూలుగానే దళిత వ్యతిరేక  పార్టీ . రోహిత్ ఆత్మహత్య  దరిమిలా ఆ ముద్రను థ్రువపరుచుకుంది. జెఎన్యూలో కొందరు బ్రాహ్మణ వాద ప్రొఫెసర్లు తయారుచేసిన డొజియర్ లో  “యూనివర్సిటీలో జాతీయ వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ దళితులు, ముస్లింలే” అని పేర్కొన్న నేపథ్యంలో…

గత ప్రభుత్వాలూ కృషి చేశాయి -దారి తప్పిన మోడి

అస్సాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో బి‌జే‌పి మొదటి సారిగా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేకమంది కేబినెట్ మంత్రులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఈ వార్తలో విశేషం ఏమీ లేదు. ప్రధాన మంత్రి ప్రసంగంలో దొర్లిన కొన్ని మాటలే అసలు విశేషం. “స్వతంత్రం అనంతరం గతంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా కూడా, ప్రతి…

4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు -కార్టూన్

అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాలను అభివర్ణిస్తున్న ఈ కార్టూన్, మన ముందు పరిచిన తమాషాను చెప్పుకుని తీరాలి. ఎడమ-పైన నుండి గడియారం ముల్లు తిరుగు దిశలో… 1. అస్సాం: బి‌జే‌పి అధ్యక్షుడు అమిత్ షాకు ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కొట్టిన దెబ్బకి తల బొప్పి కట్టింది. బీహార్ ఎన్నికల్లో లాలూ, నితీష్ లు ఉమ్మడిగా కొట్టిన దెబ్బకు ఆ బొప్పి మరింత వాచిపోయింది. అస్సాం ఎన్నికల్లో వాచిపోయిన బొప్పి కాస్త ఒంటి కొమ్ము…

ఎన్నికల ఫలితాలు: ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి!

4 రాష్ట్రాల (పుదుచ్చేరి మినహా) ఎన్నికల ఫలితాలు  ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాదాపుగా ఖాయం చేశాయి. ఒక్క తమిళనాడులోనే అంచనాలు తారుమారు అయ్యాయి. అయితే ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే మెజారిటీ బాగా తగ్గిపోయింది. మళ్ళీ జయలలిత అధికారంలోకి వస్తుందని రెండు సంస్ధల ఎగ్జిట్ పోల్స్ లో తెలిసినందున రెండు శిబిరాల మధ్యా పోటా పోటీ నెలకొంటుందని పరిశీలకులు భావించగా అదే నిజమైంది. అస్సాంలో బి‌జే‌పి కొత్తగా, మొదటిసారిగా అధికారం సాధించింది. పశ్చిమ బెంగాల్ ను మమత బెనర్జీ నిలబెట్టుకోవడమే కాకుండా…

ఉత్తరఖండ్ నుండి పాఠాలు -ది హిందు ఎడ్..

[Lessons from Uttarakhand శీర్షికన ఈ రోజు ప్రచురితం అయిన ది హిందు ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం] ******** తొమ్మిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా సుప్రీం కోర్టు నిషేధం విధించిన దరిమిలా ఉత్తర ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, అసెంబ్లీ పరీక్షలో నెగ్గడం ముందుగానే ఖాయం అయింది. మిగిలిన 27 మంది అనుయాయులు, ఆరుగురు సభ్యుల కూటమిల ఓట్లు ఆయన పరీక్షలో గెలిపించాయి. సుప్రీం కోర్టు ధృవీకరించిన ఈ…

#పోబిడ్డామోడి! -కేరళీయుల తిరస్కారం

‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అని సామెత. ‘కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది’ ఇది కూడా సామెతే. 2014 సాధారణ ఎన్నికల్లో మొదటి సారి సంపూర్ణ మెజారిటీతో బి‌జే‌పిని అధికారంలోకి తెచ్చే వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మొదటి సామెతలో లబ్ది పొందారు. అధికారం చేపట్టాక మోడి దశ తిరిగినట్లే పరిణామాలు జరుగుతున్నాయి. 28 సీట్లు గెలిచిన ఢిల్లీ అసెంబ్లీలో రెండంటే రెండే సీట్లు దక్కించుకుని అతి చిన్న ఏ‌ఏ‌పి పార్టీ…

ప్రధాని పట్టా అసలా నకిలీయా -ఔట్ లుక్ సర్వే

ఇది ఆంగ్ల వార పత్రిక ఔట్ లుక్ జరిపిన/జరుపుతున్న సర్వే. మే 9 తేదీన ప్రారంభం అయిన ఈ సర్వే మే 23 తేదీన ముగుస్తుంది. పత్రిక కింది భాగంలో చెప్పినట్లుగా ఈ సర్వే శాస్త్రోక్తంగా జరిగినది/జరుగుతున్నది కాదు. కేవలం పత్రికను సందర్శిస్తున్న వారు మాత్రమే ఓటు వేయగా వచ్చిన/వస్తున్న ఫలితాలు. సర్వేలో ఓటు వేసిన వారికి మాత్రమే ఓటు ఫలితాలు కనిపిస్తాయి. పత్రిక వెబ్ సైట్ నుండి స్క్రీన్ షాట్ తీసి ప్రచురించడం జరుగుతోంది. మే…

MAలో మోడి సబ్జెక్టులు లేవు -ప్రొఫెసర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి డిగ్రీ వివాదం ముదురుతుండగానే ఆయన పి‌జి గురించిన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేంద్ర మోడి గుజరాత్ యూనివర్సిటీలో ఎం‌ఏ చదివినప్పటి కాలంలో అక్కడ ప్రొఫెసర్/ఫ్యాకల్టీ మెంబర్ గా పని చేసిన జయంతి పటేల్ తన ఫేస్ బుక్ పేజీలో వెల్లడి చేశారు. గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరేంద్ర మోడి తమ వద్ద పి‌జి పూర్తి చేశారని చెబుతూ పార్ట్ – 2 లో ఆయనకు ఏయే సబ్జెక్టులలో ఎన్నెన్ని మార్కులు…

చెవిలో జోరీగ బాధ ఇంతింత కాదయా! -కార్టూన్

చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెబుతుంది. ఆచరణ ఇందుకు పూర్తిగా భిన్నం అని రాజకీయ పార్టీల, నాయకుల రాజకీయ ఆచరణ రుజువు చేసింది. ఏ‌ఏ‌పి లాంటి జోరీగలు లేకపోతే ఈ ఆటలు ఇంకా కొనసాగుతాయి. ఏ‌ఏ‌పి ఆవిర్భావం కుళ్ళిపోయిన రాజకీయ పరిస్ధితుల నుండి పుట్టిన అనివార్యత! రాజకీయ, సామాజిక, ప్రాకృతిక పరిస్ధితులు ఎల్లప్పుడూ ఒక సమతాస్ధితి (ఈక్విలిబ్రియమ్) కోసం అంతర్గతంగా కృషి చేస్తూ ఉంటాయి. సమతా స్ధితి తప్పినప్పుడు తిరిగి సమతా స్ధితి పొందడం…

ఇదిగో డిగ్రీ పట్టా -బి‌జే‌పి; అబ్బే ఫేక్ -ఏ‌ఏ‌పి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బి‌ఏ పట్టా వ్యవహారం రసకందాయంలో పడింది. బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలు ప్రత్యేకంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ‘ఇవిగో ప్రధాని పట్టాలు’ అని ప్రదర్శించారు. ఏ‌ఏ‌పి నేత కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏ‌ఏ‌పి వెనక్కి తగ్గలేదు. అమిత్ షా, అరుణ్ జైట్లీల విలేఖరుల సమావేశం ముగిసిన నిమిషాల లోనే తానూ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టాలలో…

అరవిందా మోడీయా ఎవరు బెటరు?

విశేషజ్ఞ గారి వ్యాఖ్య: – కాషాయం గ్యాంగుకి సోషల్ మీడియా సైట్లలో ఉన్న బలగంతో అరవింద్‌ని unpopular చేస్తున్నారేగానీ, నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో అతిపెద్ద failure మన గౌరవనీయులైన PM గారు. ఆయనిచ్చిన వాగ్దానాల్లో ఆయన ఎన్నింటిని నిలబెట్టుకున్నరో లెక్కలేస్తే, అధికారంలోకి రాగానే తన వాగ్దానాలమీద దృష్టిసారించి వాటిని నిలుపుకున్న అరవింద్ మేరుపర్వతమంత ఎత్తున కనిపిస్తాడు (మన కాషాయ నేత పుట్టగొడుగంత ఉండొచ్చు). అరవింద్‌కూడా రాజకీయం చేస్తున్నాడు కాదనను. మరి అంత కంటే కూటరాజకీయం PM చేస్తున్నప్పుడు…