మాకూ హక్కుంది
——రచన: రమాసుందరి 10/12/2013. వరండాలో, వాలు కుర్చీలో… శూన్యానికి చూపులు వేలాడదీసి అంతర్ముఖులైన మీ ఆలోచనల ఆనవాళ్లను మమ్మల్ని స్పృజించనివ్వండి యౌవనాశ్వానికి ముకుతాడు బిగించి విముక్తి బాటపై దౌడు తీయించిన ఉద్విగ్న జ్నాపకాలా? కష్టకాలంలో కంటికి రెప్పలైన ప్రేమమూర్తుల కారుణ్య రూపాలా? ఉద్యమాల అలజడులే జీవితం ఐనందుకు దరిచేరని వ్యష్టితత్వం ఆస్తుల్ని పెంచనందుకు విస్మృత కుటుంబాన్ని శిధిల గతంలో ఏరుకుంటున్నారా? మసకబారిన కంటిచూపు తొట్రుపడుతున్న గంభీర స్వరం మీ మెదడు పదును తగ్గించలేదు సుమా! శిశిర వృక్షాలకు…