సంక్షోభ ఫలితం, ఫ్రెంచి ప్రభుత్వం రద్దు
ఫ్రాన్స్ లో నెలకొన్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు అక్కడి ప్రభుత్వాన్ని బలి తీసుకున్నాయి. ఫ్రెంచి ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పొదుపు విధానాలు’ వినాశకరంగా పరిణమించాయని అక్కడి ఆర్ధిక మంత్రి ఆర్నాడ్ మాంటెబోర్గ్ బహిరంగంగా విమర్శించిన మరుసటి దినమే ప్రభుత్వం రద్దు చేసుకుంటామని ప్రధాని మాన్యువెల్ వాల్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండేకు విన్నవించాడు. ప్రధాని విన్నపాన్ని ఆమోదించిన అధ్యక్షుడు ఒలాండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అదే ప్రధానిని కోరారు. ఫ్రాన్స్ ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం ఆర్ధిక వృద్ధి…