ప్రయోజనాల సమతూకం -ది హిందు ఎడిట్
(మోడి ఇటీవల ప్రకటించిన కార్మిక వ్యతిరేక కార్మిక సంస్కరణలకు ది హిందు మద్దతుగా వస్తూ ఈ సంపాదకీయం వెలువరించింది. నిస్పక్షపాత ముద్రను కాపాడుకోవడానికి ఈ సంపాదకీయంలో పత్రిక చాలా ప్రయాసపడింది. అనునయ మాటలతో, నచ్చజెప్పే ధోరణితో పాఠకుల చేత చేదు మాత్రను మింగించడానికి కృషి చేసింది. తనిఖీల లోపం వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని నామమాత్రంగా చెబుతూ అంతిమంగా భారత దేశ శ్రామిక ప్రజల హక్కులకు భంగం కలిగించే కార్మిక సంస్కరణలను నిండు మనసుతో పత్రిక ఆహ్వానించడం…
