రక్తం పారిన ఎర్రెర్రని నేలలు, సముద్రాలు -ఫోటోలు

‘ఎరుపంటే ఎందుకురా భయం భయం! పసి పిల్లలు మీకంటే నయం నయం!! కలం వెంబడి అచ్చంగా నిప్పులు కురిపించిన చెరబండరాజు గారి ఓ కవితలోని పాదాలివి. ఇంధ్ర ధనుస్సులో ఎరుపు రంగు ఆ చివరన ఉంటుంది. ఎరుపు రంగు కిరణానికి తరంగ దైర్ఘ్యం (వేవ్ లెంగ్త్) మిగిలిన ఆరు రంగులతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అందువలన ఎరుపు రంగు తీక్షణత ఎక్కువ. ఆ కారణం వల్ల పసి పిల్లలు ఎరుపు రంగుకి ఇట్టే ఆకర్షితులు అవుతారు. రక్తం…

మహారాష్ట్రలో కాంతివిహీనమైన విజయం -ది హిందు ఎడిట్

(శరద్ పవార్ పార్టీ ఎన్.సి.పి ఓటింగులో పాల్గొనబోనని చెబుతూనే ఉంది. అవసరం అయితే బి.జె.పి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తానని కూడా చివరి క్షణాల్లో ప్రకటించింది. అయినప్పటికీ 41 మంది ఎన్.సి.పి సభ్యుల మద్దతుతో విశ్వాస పరీక్ష నెగ్గడం కంటే, న్యాయబద్ధత అంతగా లేని  మూజువాణి ఓటుతో నెగ్గించుకోవడానికే బి.జె.పి మొగ్గు చూపింది. ఈ అంశంపై ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్) ************ 122 మంది ఎమ్మెల్యేల బి.జె.పి, మెజారిటీకి 22…

అంటరానితనం సజీవం, పాటించువారు బ్రాహ్మణులు -సర్వే

“అంటరానితనం అమానుషం, చట్ట రీత్యా నేరం” అని భారత ప్రభుత్వం గత 67 యేళ్లుగా ప్రచారం చేస్తోంది. అంటరానితనం నిర్మూలించడానికి అని చెబుతూ చట్టాలు చేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా భారత దేశంలో అంటరానితనం సజీవంగా కొనసాగుతోందని జాతీయ, అంతర్జాతీయ సంస్ధల సర్వేలో వెల్లడి అయింది. జాతీయ అనువర్తిత ఆర్ధిక పరిశోధనా సంస్ధ (National Council for Applied Economic Research -NCAER) వారు నిర్వహించిన భారత మానవాభివృద్ధి సర్వే (Indian Human Development Survey -IHDS)…

అచ్చే దిన్: అడ్డదారిలో గ్యాస్ ధర పెంపు

బి.జె.పి నేత నరేంద్ర మోడి హామీ ఇచ్చిన ‘మంచి రోజులు’ ప్రజల ముందుకు ఒక్కొక్కటి వచ్చి వాలుతోంది. 4.5 కోట్ల కుటుంబాలకు ఉపాధి ఇచ్చే చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ లు అనుమతించేది లేదన్నారు. ఆన్-లైన్ రిటైల్ మార్కెటింగ్ గేట్లను బార్లా తెరిచేశారు. ‘శ్రమయేవ జయతే’ అంటూ కార్మికుడిని ‘శ్రమ యోగి’ అని నెత్తిన పెట్టుకున్నామన్నారు. కార్మికుల హక్కులను నేల రాస్తూ కంపెనీలకు చిత్తానుసారం ‘హైర్ అండ్ ఫైర్’ చేసే హక్కును దఖలు పరిచారు. తాజాగా గ్యాస్ సిలిండర్…

జనాన్ని వెర్రివాళ్ళని చేస్తూ మహారాష్ట్ర నాటకం పూర్తి

ఒక నాటకం పూర్తయింది. పత్రికలను, రాజకీయ విశ్లేషకులను, పరిశీలకులను, జనాన్ని చివరి నిమిషం వరకు ముని వేళ్ళ మీద నిలబెట్టిన సస్పెన్స్ ధ్రిల్లర్ చివరికి ఎటువంటి మలుపులు లేకుండానే చప్పగా ముగిసింది. రంగంలో ఉన్న పార్టీలన్నీ, చివరికి కాంగ్రెస్ తో సహా, చక్కగా సహకరించడంతో మొట్టమొదటి బి.జె.పి ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేకుండా విశ్వాస పరీక్ష పూర్తి చేసుకుంది. బి.జె.పి ప్రభుత్వం విశ్వాస పరీక్ష విషయంలో అసలు ఓటింగు కోరిన నాధుడే లేడు. కాంగ్రెస్, ఎన్.సి.పి, శివసేన,…

ఇంకా వెన్నాడుతున్న ప్రమాదాలు -ది హిందు ఎడిట్

భారత నౌకా బలగం, స్వల్ప కాల విరామం అనంతరం, ప్రమాదాల నిలయంగా కొనసాగుతూనే ఉంది. గత వారమే సహాయక నౌక ఒకటి విశాఖపట్నం తీరంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన ఒక నావికుడి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరో నలుగురు ఆచూకీ దొరకని వారుగా ప్రకటించబడ్డారు. వైజాగ్ సమీపంలో ఒక వాణిజ్య నౌక ఢీ కొట్టడంతో ఐ.ఎన్.ఎస్ కోరా అనే క్షిపణి యుద్ధ నావ స్వల్ప నష్టానికి గురైన తర్వాత పక్షం రోజుల్లోనే ఇది రెండో ప్రమాద ఘటన.…

వివాహాల్లో లైంగిక హింస సర్వ సాధారణం -సర్వే

వైవాహిక జీవితంలో జరుగుతున్న అత్యాచారాలను గుర్తించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కోర్టులే కాదు, పార్లమెంటు సభ్యులు కూడా వైవాహిక జీవితంలో అమలయ్యే బలవంతపు లైంగిక జీవనాన్ని గుర్తించడానికి నిరాకరిస్తారు. వివాహంలో లైంగిక హింసను గుర్తించడం అంటే భారత దేశ సంస్కృతీ సాంప్రదాయాలను అగౌరవపరచడమే అని భావించే మహిళా ఎం.పిలు కూడా మన చట్ట సభల్లో కూర్చొని ఉన్నారు. అలాంటి వారు చివరికి మహిళా కమిషన్ లో సైతం ఆసీనులై ఉండడం ఓ విపత్కర పరిణామం. భారత దేశంలో…

పెట్టుబడి వాతావరణం సరిగా లేదు -జపాన్

ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వాతావరణం అనుకూలంగా లేదని జపాన్ ఆరోపిస్తోంది. భారత ప్రధాని మోడి ఇటీవల జపాన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా 3.5 ట్రిలియన్ యెన్ లు లేదా 35 బిలియన్ డాలర్లు లేదా 2.1 లక్షల కోట్ల రూపాయల మేర ఎఫ్.డి.ఐ లు (జపాన్ కంపెనీలు) ఇండియాకు తరలి వస్తాయని జపాన్ ఆర్భాటంగా ప్రకటించింది. ఆ ప్రకటని కార్యరూపం దాల్చాలంటే తమకున్న గొంతెమ్మ కోర్కెలు ఏమిటో జపాన్ ఇప్పుడు చెబుతోంది. పెట్టుబడి వాతావరణ…

మహారాష్ట్ర: శివసేనకు ప్రతిపక్ష పాత్రేనా?

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శివసేన తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలన్న బి.జె.పి లక్ష్యం, ఆరు నూరైనా మహారాష్ట్ర వరకు తనదే పై చేయి కావాలని భావిస్తున్న శివసేన… వెరసి రాష్ట్ర ప్రజల ముందు ఓ వింత నాటకం ఆవిష్కృతం అవుతోంది. బి.జె.పికి బేషరతు మద్దతు ప్రకటించడం ద్వారా ఎన్.సి.పి, శివసేన బేరసారాల శక్తిని దారుణంగా దిగ్గోయడంతో బి.జె.పికి అదనపు శక్తి వచ్చినట్లయింది. కానీ బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్.సి.పి అంత తేలిగ్గా సరెండర్ కాదని,…

బీహార్: దిష్టి బొమ్మ సి.ఎం మంఝి

లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో దారుణమైన ఫలితాలు ఎదురైనందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదవిలో లేకపోయినా ప్రభుత్వాన్ని నడుపుతూనే ఉన్నారని అప్పటి నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి “నేను స్వల్పకాలిక ముఖ్యమంత్రినే” అని ప్రకటించడంతో ఈ వార్తలు నిజమే అని స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి 6గురు కేబినెట్ మంత్రులు హాజరు కాకుండాపోయేంతవరకు బీహార్ పరిస్ధితి దిగజారిందని తెలుస్తోంది. మంఝీ,…

ఈనాడు ఆర్టికల్స్ రెండవ సిరీస్ -లంకెలు

ఈ రోజు ఈనాడు పత్రిక చదువు పేజీలో నా ఆర్టికల్ ప్రచురితం కాలేదు. మరో ఆర్టికల్ కు సంబంధించి పెద్ద టేబుల్ ఒకటి ఇవ్వవలసి రావడంతో చోటు సరిపోలేదని, దానితో ఒక ఆర్టికల్ ను మినహాయించవలసి వచ్చిందని పత్రిక వారు సమాచారం ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఈనాడు ఆర్టికల్స్ రెండవ సిరీస్ లోని ఆర్టికల్స్ అన్నింటికీ లంకెలు ఇస్తే పాఠకులకు ఉపయోగం అన్న ఆలోచన వచ్చింది. గతంలోని ఆర్టికల్స్ మిస్ అయినవారికి ఇది ఉపయోగం. చదివిన వారికి…

రష్యాపై ఆంక్షలు: ఫ్రెంచి రైతుల సమరభేరి -ఫోటోలు

రష్యాపై తాము విధించిన  వాణిజ్య, రాజకీయ ఆంక్షలు రష్యాను కుంగ దీస్తున్నాయని పశ్చిమ దేశాలు, వాటి పత్రికలు సందర్భం వచ్చినప్పుడల్లా చంకలు గుద్దుకుంతుంటాయి. ‘అబ్బ, భలే పీడిస్తున్నాం లే’ అంటూ సంతోషం ప్రకటిస్తాయి. ‘తిక్క కుదిరింది, మనతోనా పెట్టుకునేది’ అన్నట్లుగా రాక్షసానందం పొందుతాయి. కానీ రష్యాపై ఆంక్షలు పశ్చిమ దేశాల ప్రజలను, రైతులను ఎంతగా బాధిస్తున్నాయో నవంబర్ 5 తేదీన ఫ్రాన్స్ వ్యాపితంగా చెలరేగిన రైతుల ఆందోళనలు స్పష్టం చేస్తాయి. రష్యాపై విధించిన ఆంక్షలు తమకే ఎదురు…

ఏ‌ఎఫ్‌ఎస్‌పి‌ఏ వెనక నక్కి చేసిన కాల్పులు -ది హిందు ఎడిట్

(కాశ్మీరు లోయలో సైనికులు కాల్పులు జరిపి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరించిన ఘటనపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ********************** ఇద్దరు టీనేజి బాలురు చనిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో క్లిష్ట పరిస్ధితిలో ఉన్నారు. చెక్ పాయింట్ వద్ద ఉన్న సైనికులు వారిని కాల్చి చంపగా జరిగిన ఘటనపై విరుద్ధ కధనాలు వినబడుతున్నాయి. కనుక అది ఎవరు చేశారన్న ప్రశ్న లేదు. ఎందుకు చేశారన్నదే ప్రశ్న.…

కాశ్మీర్: మిగిలిన వారినీ చంపాలని చూశారా?

కాశ్మీరులో కారుపై సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు బులెట్ గాయాలతో తప్పించుకున్న సంగతి తెలిసిందే. గాయాలు కాకుండా తప్పించుకున్న బాసిం పరుగెత్తి పారిపోవడం వల్ల బతికిపోయాడే తప్ప సైన్యం కాల్పులు జరపడం ఆపడం వల్లనో లేదా కారు ఆపడం వల్లనో కాదని తెలుస్తోంది. దుర్ఘటన నుండి గాయాలు కాకుండా తప్పించుకున్న బాసిం అహ్మద్ చెప్పిన వివరాలను బట్టి కారు విద్యుత్ స్తంబానికి గుద్దుకుని ఆగిపోయిన తర్వాత కూడా సైనికులు కాల్పులు కొనసాగించారు. కారు తలుపు తీసుకుని…

ఫ్లోరిడా: అక్కడ అన్నదానం చేస్తే జైల్లో తోస్తారు

పెట్టుబడిదారీ వ్యవస్ధ కనిపించే ప్రతి వస్తువునీ వ్యాపారమయం చేస్తుందని కారల్ మార్క్స్ 19వ శతాబ్దంలో చెప్పారు. ఆ మాటలు ఎంతటి ప్రత్యక్షర సత్యమో అప్పటి నుండి రుజువు కాని చోటంటూ లేదు. చివరికి ఆకలిని కూడా వ్యాపారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఫ్లోరిడా రాష్ట్రం లోని ఫోర్ట్ లాడర్ డేల్ పట్టణ ప్రభుత్వం మరింత ముందుకెళ్లింది. వ్యాపారాలు చల్లగా ఉండాలన్న ఏకైక దృష్టితో అది అన్నదానాన్ని చట్ట విరుద్ధం చేసిపారేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 90…