WW II: డ్రెస్డెన్ పై బ్రిటన్-అమెరికా పైశాచిక బాంబింగ్ కి 70 యేళ్ళు

  రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో అమెరికా, బ్రిటన్ లు సాగించిన మారణహోమం అంతా ఇంతా కాదు. వరల్డ్ వార్ II అనగానే యూదులపై నాజీల దుష్కృత్యాలు, హిట్లర్ ఫాసిజం గుర్తుకు వస్తాయి. అలా గుర్తుకు వచ్చేలా చరిత్ర రచన జరిగింది. కానీ జర్మనీ, ఇటలీ ల్లోని ఫాసిస్టు నియంతృత్వాలను సాకుగా చూపిస్తూ ఆ దేశాలు ఓడిపోతూ వెనక్కి పారిపోతున్న కాలంలో అమెరికా, బ్రిటన్ లు తెగబడి అనేక మారణహోమాలు సృష్టించాయి. హీరోషిమా, నాగసాకి నగరాలపై…

పాలిచ్చేందుకు అనుమతివ్వని కాంట్రాక్టర్, రోజుల బిడ్డ మృతి

  పసి బిడ్డ నిండు ప్రాణాల కంటే కాంట్రాక్టులో మిగిలే రూపాయి నోట్లకే ఎక్కువ విలువ కట్టిన ఓ పాషాణ హృదయుడి కఠినత్వం ఇది. మానవ విలువలు అడుగంటిన లోకం విధించిన డబ్బు బంధనాలలో తల్లి బందీ అయిందని తెలియక పాల కోసం గుక్క పట్టి ఏడ్చి ఏడ్చి విసుగెత్తి కానని లోకాలకు తరలి వెళ్ళిన పసి బిడ్డ విషాదాంతం ఇది. మెదక్ జిల్లాలో హత్నూర మండలలో హృదయాల్ని పిండి వేసే ఈ ఘోర ఉదంతం చోటు…

అరవింద్, మోడిల సమావేశం -కార్టూన్

  ఢిల్లీ అవడానికి రాష్ట్రమే అయినా పాలన రీత్యా అది పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు. పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడాలి. ముఖ్యంగా శాంతి భద్రతలు! మామూలుగా అయితే శాంతి భద్రతలు రాష్ట్రాల హక్కు. రాష్ట్రాల్లోని పోలీసులే శాంతి భద్రతలను చూస్తుంటారు. అలాంటి పోలీసు విభాగం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అదుపులో ఉంటుంది. ఈ కారణం వలన పోలీసులు ఢిల్లీ సి.ఎంకు సమాధానం చెప్పరు. దరిమిలా రాష్ట్రంలో ఎలాంటి నేరం జరిగినా…

కేజ్రీవాల్ ఇంకో పెద్ద మెట్టు ఎక్కాలి -కార్టూన్

  ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్/ఎఎపి ఒక పెద్ద మెట్టు ఎక్కి వచ్చారు. ఇప్పుడిక పూర్తి స్ధాయి పాలన అనే మరో పెద్ద మెట్టు ఎక్కాలి. ఆయన, ఆయన పార్టీ అన్నీ రకాలుగా విఫలం కావాలని సంపన్న వర్గాలు, వారి పార్టీలు తీవ్రంగా కోరుకుంటున్నందున ఢిల్లీ రాష్ట్ర పాలన ఎఎపికి నల్లేరుపై నడక ఏమీ కాదు. పార్టీ వయసు, అనుభవం… ఇత్యాది అంశాల రీత్యా ఎఎపి సైజు చాలా చిన్నదని కార్టూనిస్టు…

ఎఎపి ఓటర్లు దళితులు, పేదలు, యువకులు

  అత్యధిక సీట్లను గెలుచుకోవడం బట్టి ఎఎపికి ధనిక, పేద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలూ ఎఎపికి ఓటు వేసి ఉంటారని భావించవచ్చు. కానీ కాస్త లోతుకు వెళ్తే ఈ పరిశీలనలో లోపం కనిపిస్తుంది. ఎందుకంటే బి.జె.పికి వచ్చిన ఓట్ల శాతం తక్కువేమీ కాదు. 32.2 శాతం ఓట్లు సీట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడి ఉండకపోవచ్చు గాని ఒక పార్టీకి అన్ని ఓట్లు పడడాన్ని తక్కువ చేసి చెప్పలేము. అందుకే మరింత లోతుకి వెళ్ళి…

ఛిద్రమైన బి.జె.పి జంట టవర్లు -రాజ్ ధాకరే కార్టూన్

ఒబామా: “మరొకసారి జంట స్తంభాలు కూలిపోయాయి, కానీ విమానం మాత్రం భద్రంగా ఉందే” ********* అద్భుతమైన కార్టూన్ కదా! అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలే ఇండియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఒబామా పర్యటన విజయవంతం అయిందని మోడి, బి.జె.పిలు ఆ తర్వాత ఢంకా బజాయించారు. చాలా పత్రికలు అదే నమ్ముతూ తాము కూడా శక్తి కొద్దీ ఢంకాలు బజాయించాయి. దానితో పాటు ‘ఆ విజయం ఢిల్లీ ఎన్నికల్లో మోడీకి ఉపయోగపడుతుంది’ అని కూడా చెప్పాయి. తీరా చూస్తే…

మృత్యువును సమీపిస్తున్న మృత సముద్రం -ఫోటోలు

మృత సముద్రం (Dead Sea) తాను కూడా మృత్యువును సమీపిస్తోంది. మృత సముద్రం జోర్డాన్, ఇజ్రాయెల్ సరిహద్దు మీద ఉంటుంది. సముద్రానికి తూర్పు ఒడ్డు జోర్డాన్ వైపు ఉంటే, పశ్చిమ ఒడ్డు ఇజ్రాయెల్ వైపు ఉంటుంది. ఈ సముద్రంలోకి వచ్చి కలిసే ఒకే ఒక్క నది జోర్డాన్ నది. ఇంతకీ మృత సముద్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మృత సముద్రం అంటే చచ్చిపోయిన సముద్రం అని కాదు. చంపేసే సముద్రం అని. ఈ సముద్రాన్ని ‘Sea…

నితీష్ కొత్త విశ్వాసం ఎక్కడిది? -కార్టూన్

మోడి దెబ్బతో: “నేను ఓటర్ల విశ్వాసం కోల్పోయాను. రాజీనామా చేసేస్తున్నాను” లాలూ తోడు రాగా: “నాకు మళ్ళీ ఓటర్ల విశ్వాసం వచ్చేసింది” ********* లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయిన ఆనాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ “తాను ఓటరు విశ్వాసం కోల్పోయినందుకు రాజీనామా చేస్తున్నాను” అని ప్రకటించి గద్దె దిగిపోయారు. ఇప్పుడేమో తనకు 130 మంది ఎం.ఎల్.ఏ ల విశ్వాసం ఉన్నది గనుక తనకు మళ్ళీ సి.ఎం కుర్చీ ఇచ్చేయ్యాలని పాట్నా నుండి…

చీపురు కట్టా, కుతుబ్ మినారా? -కార్టూన్

  “వటుడింతింతై…” అన్నట్లుగా ఎదిగిపోయిన సామాన్యుడి పార్టీని చూసి తెల్లబోయే పని ఇప్పుడు బి.జె.పి సామ్రాజ్యాధీశుల వంతు. ‘లోక్ పాల్’ చట్టం కోసం హజారే, అరవింద్, బేడి, భూషణ్ ల బృందం జనాన్ని వెంటేసుకుని ఉద్యమిస్తున్నప్పుడు ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి చూడండి. అదెంత కష్టమైన పనో’ అంటూ కాంగ్రెస్, బి.జె.పి పార్టీల నాయకులు ఎకసక్కెం చేశారు. “అయితే మేమూ రాజకీయాల్లోకి వచ్చి చూపిస్తాం. పార్టీ పెట్టి ప్రజల కోసం చేసే పాలన ఎంత తేలికో చూపిస్తాం” అంటూ…

బి.జె.పి పుండుపై శివసేన ఉప్పు

అసలే పరువు పోయి బాధలో ఉన్నపుడు మిత్రుడు చేసే సరదా ఎగతాళి కూడా కోపం తెప్పిస్తుంది. మిత్రులు అనుకున్నవాళ్లు సీరియస్ గానే ఎగతాళి చేస్తే ఇక వచ్చే ఆగ్రహం పట్టలేము. బి.జె.పి పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఏఏపి చేతుల్లో చావు దెబ్బ తిన్న దిగ్భ్రాంతి నుండి ఇకా బైటపడక ముందే మహారాష్ట్రలో మిత్ర పక్షంగా అధికారం పంచుకుంటున్న శివ సేన ఎగతాళి ప్రకటనలు చేస్తూ బి.జె.పి దుంప తెంచుతోంది. “వేవ్ కంటే సునామీ ఇంకా శక్తివంతమైనదని…

ఢిల్లీ: సామాన్యుడి దెబ్బకు దిమ్మ తిరిగింది!

ఆమ్ ఆద్మీ దెబ్బ ఏమిటో సంపన్నులకు రుచి చూపిన ఘనత ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెబుదాం. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో భారత దేశంలోని సామాన్య కార్మికవర్గ పౌరుడు కాస్త గర్వంగా తల ఎగరవేయదగ్గ రోజు ఈ రోజని చెప్పడంలో సందేహం లేదు. స్ధల, కాల పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే భారత దేశంలోని పార్లమెంటరీ రాజకీయాల్లో అచ్చంగా సామాన్య ప్రజలు ఐక్యమై పాలకవర్గాలకు వారి వెనుక ఉన్న సంపన్న కులీన దోపిడీ శక్తులకు…

ప్రాణాలు ఫణంగా పెట్టే ‘టఫ్ గై’ సవాలు! -ఫోటోలు

బ్రిటన్ లో ప్రతి సంవత్సరం జరిగే ‘టఫ్ గై ఛాలెంజ్’ పోటీలు మళ్ళీ జరిగాయి. జనవరి నెల చివరి వారంలో జరిగే ఈ పోటీలు ఈసారి ఫిబ్రవరి 1 తేదీన జరిగాయి. ప్రపంచం నలుమూలల నుండి, ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల నుండి వేలాదిగా తరలివచ్చే ఉక్కు పిండాలు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఇంతవరకు ఈ పోటీల్లో చివరి వరకు నిలబడిన ‘టఫ్ గై’ ఒక్కరు కూడా లేకపోవడం బట్టి పోటీల పస ఏమిటో తెలుసుకోవచ్చు. ఛారిటీ…

నిశ్శబ్దం ఒక ఎంపిక కాదు -ది హిందు ఎడిటోరియల్

అమెరికా అధ్యక్షుడు బారక్ బారక్ ఒబామా, ఇండియాలో కుంచించుకుపోతున్న మత సామరస్యం గురించి తొమ్మిది రోజుల వ్యవధిలో రెండుసార్లు వరుసగా ప్రకటనలు గుప్పించడంపై ఇండియాలో కాస్త తత్తరపాటును సృష్టించింది. మొదటి సారి జనవరి 27 తేదీన తన భారత సందర్శనను ముగిస్తూ మత ప్రాతిపదికన లోలోపల విభజనకు గురైన దేశాలు ఎన్నటికీ ప్రగతి సాధించలేవన్న అంశాన్ని ఒబామా నొక్కి చెప్పారు; రెండోసారి ఫిబ్రవరి 5 తేదీన మాట్లాడుతూ ఆయన భారత దేశం నుండి వెలువడుతున్న మత అసహనం…

స్ధూల, సూక్ష్మ ఆర్ధిక శాస్త్రాలు -ఈనాడు

మైక్రో ఎకనమిక్స్, మాక్రో ఎకనమిక్స్! తరచుగా వినే ఈ పదాలకు అర్ధం ఏమిటో చూచాయగా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నిర్దిష్టంగా సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేస్తే చాలా మంది కాస్త తడబడతారు. ఈ పదాలపై నిర్దిష్ట అవగాహన ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ అంశాన్ని గురించి ఈ రోజు ఈనాడులో చర్చించాను. ఆంగ్లంలో మైక్రో ఎకనమిక్స్ పదం గానీ, మాక్రో ఎకనమిక్స్ పదం గానీ రెండు పదాలుగా ఉండవు. అంతా కలిపి ఒకే పదం. Microeconomics…

వెచ్చగా ఉంచమంటే మంటలు రగిలించాడు -కార్టూన్

బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝి సంప్రదాయానికి విరుద్ధంగా పోయి గొప్ప చిక్కుల్నే తెచ్చి పెట్టారు. చిక్కులు ఎవరికి అన్నది కొద్ది రోజుల్లో తేలవచ్చు, ఇప్పటివరకు చూస్తే మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ చిక్కులు ఎదుర్కొంటున్నారు. మంఝిని నమ్మి ముఖ్యమంత్రి పీఠం అప్పజెపితే ఆయన మోసం చేశారని నితీష్ ఫిర్యాదు చేయవచ్చు గానీ, నిజానికి సి.ఎం సీటులో కూర్చోబెట్టడానికి గానీ, దిగిపొమ్మనడానికి గానీ ఆయనెవరు? లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తీసుకుని రాజీనామా చేసిన…