ఐలాన్ కుర్ది: సిరియా యుద్ధ శిధిలం ఈ బాలుడు -ఫోటోలు

అమెరికా, ఐరోపాలు స్వప్రయోజనాల కోసం సిరియాపై బలవంతంగా రుద్దిన అంతర్యుద్ధం ఆ దేశ పిల్లల పాలిట మరణ మృదంగం వినిపిస్తోంది. లక్షలాది మంది సిరియన్లు ఇసిస్ ఉగ్ర మూకల చెరలో నుండి తప్పించుకునేందుకు టర్కీ, లెబనాన్, జోర్డాన్ లకు శరణార్ధులుగా తరలి వెళ్తున్నారు. సిరియా నుండి వెళ్ళే శరణార్ధుల్లో ఎక్కువ మంది టర్కీలో ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత స్ధానం లెబనాన్ ది. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ తన ప్రజలపై అమలు చేస్తున్న నియంతృత్వం పట్ల తెగ…

అవినీతి: పన్నులు కట్టొద్దు! -బోంబే హై కోర్ట్

అవినీతిపై విసిగిపోయిన బోంబే హై కోర్టు న్యాయమూర్తి ఒకరు ‘అవినీతిని నిర్మూలించేవరకు పౌరులు పన్నులు కట్టడం మానేయాలి’ అంటూ ఆగ్రహం ప్రకటించారు. పన్నులు కట్టొద్దని దాదాపు పిలుపు ఇచ్చినంత పని చేశారు. మహారాష్ట్ర బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ ఒకరు కేంద్ర బిందువుగా వెల్లడి అయిన అవినీతి కుంభకోణం విచారణకు వచ్చిన సందర్భంగా బోంబే హై కోర్టు జడ్జి ఈ వ్యాఖ్య చేశారు. గత రెండు దశాబ్దాలుగా అవినీతి కుంభకోణాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయని న్యాయమూర్తి జస్టిస్ చౌదరి (అబ్బే…

ఆసాంజే నిర్బంధం నిరంకుశం -ఐరాస

వికీలీక్స్ వ్యవస్ధాపక ఎడిటర్ జులియన్ ఆసాంజే నిర్బంధం చట్ట విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఆసాంజే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఐరాస కమిటీ ఈ మేరకు ఒక నిర్ధారణ వచ్చిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే కమిటీ నిర్ణయాన్ని అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తారని పత్రిక తెలిపింది. స్వీడన్ లో దాఖలయిన ఒక తప్పుడు కేసు దరిమిలా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో గత నాలుగు సంవత్సరాలుగా లండన్ పోలీసు నిర్బంధంలో ఆసాంజే గడుపుతున్నాడు. ఆసాంజేను…

‘చీపురుతో మోడి’ ఫోటో ఫేక్ –ఆర్‌టి‌ఐ చట్టం

సమాచార హక్కు చట్టం బి‌జే‌పి కొంపకు చిన్న చిచ్చు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడి ఎంతో పేదవాడు అంటూ 2014 సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బి‌జే‌పి శ్రేణులు, నాయకులు ఉపయోగపెట్టిన ఫోటో అసలుది కాదని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసి వచ్చింది. నరేంద్ర మోడి క్రమ శిక్షణ కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అనీ, ఆయన పేదరికంలో పుట్టి పెరిగారని, ఇతర వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అని ఎన్నికల ప్రచారంలో…

పాకిస్తాన్: హిందు ఆలయంపై దాడి!

పాకిస్తాన్ లో ఒక హిందు ఆలయంపై దాడి జరిగిన సంగతి వెలుగు చూసింది. ఆలయంలోకి చొచ్చుకు వచ్చిన దుండగులు ఒక దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆలయం సొంతదారును ఉటంకిస్తూ పాక్ పత్రిక డాన్ తెలిపింది. దాడి జరగడంతో భక్తులు ఆలయానికి రావడం మానుకున్నారని పూజాదికాలు నిర్వహిస్తున్న వ్యక్తి చెప్పారు. పాకిస్తాన్ లో అతి పెద్ద నగరం కరాచీలో ఈ ఘటన జరిగింది. కరాచీ జూలాజికల్ గార్డెన్స్ కి చెందిన 5వ నెంబర్ గేటు వద్ద కొన్ని…

రోహిత్, రాధిక: అచ్చమైన దళిత కధ! -3

MA MEd చదివిన ఉపాధ్యాయురాలు తన ఆడ పిల్లలను BSc-BEd, BCom-BEd లు చదివించుకుంది. అందులో తప్పు పట్టాల్సింది ఏ కోశానా లేదు. కానీ ‘నా సొంత కూతురు లాంటిది’ అని చెప్పిన రాధికకు మాత్రం అత్తెసరు చదువుతో ముగించేయడం ఎలా అర్ధం చేసుకోవాలి, ఉపాధ్యాయురాలు అయి ఉండి కూడా! అదీ కాక, తన ‘సొంత కూతురుతో సమానం’ అయినప్పుడు 14 సంవత్సరాలకే పెళ్లి చేసి పంపేయడం ఎలా సాధ్యం! బాల్య వివాహాలు చట్ట విరుద్ధం అన్న…

అచ్చమైన దళిత కధలో పాత్రలు రోహిత్, రాధిక -2

మొదటి భాగం తరువాత……………….. – రాధిక ఎదుర్కొంటున్న హింసను చూసి ఆమెను ‘దత్తత’ తెచ్చుకున్న అంజని, బహుశా, తన తప్పు సవరించుకునే పనిలో పడ్డారు. మణి నుండి తన కూతురు, మనవళ్లను రక్షించుకున్నానని ఆమె చెప్పారు. “వాళ్ళు మణిని వదిలిపెట్టి వచ్చేశారు. 1990లో వాళ్ళను మళ్ళీ మా ఇంట్లోకి ఆహ్వానించాను” అని అంజని చెప్పారు. అయితే రాధిక చెప్పింది అది కాదు. ఈ విషయాలు హిందూస్తాన్ విలేఖరికి చెబుతున్నప్పుడు రాధిక, అంజని పక్కనే ఉన్నారు. అంజని స్పష్టమైన…

రాధిక, రోహిత్: అచ్చమైన దళిత కధలో పాత్రలు -1

పాలక పార్టీ తాజాగా మరో కేంద్ర మంత్రిని రంగంలోకి దించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించేందుకు కాదు. రోహిత్, మరో నలుగురు దళిత విద్యార్ధులపై మరింత బురద జల్లేందుకు. యూనివర్సిటీ పాలకవర్గం ద్వారా తాము సృష్టించిన సమస్య నుండి దళిత కోణాన్ని తొలగించడానికి స్మృతి ఇరానీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విదేశాంగ మంత్రిని కేంద్రం ప్రవేశపెట్టింది. “నాకు అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారం మేరకు రోహిత్ అసలు దళితుడే కాదు. ఆయన దళితుడని…

రోహిత్: చట్టం ఉల్లంఘన కాదు, అణచివేతకు ప్రతిఘటన!

“మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య” శీర్షిక గల ఆర్టికల్ కింద వ్యాఖ్యాతల అభిప్రాయాలకు సమాధానం ఈ టపా. ********* మీ ప్రశ్నల రీత్యా నేను చెప్పవలసినవీ, అడగవలసినవి కొన్ని ఉన్నాయి. విషయం మొత్తాన్ని ‘చట్టం పాటించడం లేదా అతిక్రమించడం’ లోకి మీరు కుదించివేశారు. ఆ పరిధి వరకే మీ దృష్టి ఉన్నట్లయితే అది మీ యిష్టం. కానీ ఈ అంశం కేవలం చట్టం అనుసరణ/ అతిక్రమణ వరకే పరిమితం అయిందని నేను భావించడం…

రోహిత్ నిరసనకు దారి తీసిన DU ఘటన -వీడియో

రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్ధితుల్లో మొదటిది ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఒక ఘటన అని పత్రికలు, ఛానెళ్ల ద్వారా తెలిసిన విషయం. ఆ ఘటనకు సంబంధించిన వీడియోయే ఇది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కిరోరి మాల్ కాలేజీలో గత ముజఫర్ నగర్ మత కొట్లాటలపై ఒక డాక్యుమెంటరీ (ముజఫర్ నగర్ బాకీ హై) ప్రదర్శిస్తుండగా ఏ‌బి‌వి‌పి విద్యార్ధి సంఘం వాళ్ళు దాడి చేసి ప్రదర్శన నిలిపివేయించారు. ఆ డాక్యుమెంటరీ ‘యాంటీ నేషనల్’ అన్న ఆరోపణతో…

మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య!

రోహిత్ వేముల కులంపై చర్చ ఇంకా ముగియలేదు. పత్రికలు, ఛానెళ్లు, ప్రభుత్వాధికారులు, పోలీసులు ఈ సమస్యను ఇంకా కలియబెడుతూనే ఉన్నారు. రోహిత్ దళితుడా కాదా అన్నది అర్జెంటుగా తేల్చేయ్యాలన్నది కొందరి పంతంగా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే రోహిత్ దళితుడే అని నమ్ముతున్నవారికి ఎలాంటి సమస్యా లేదు. వారా చర్చలో నుండి ఎప్పుడో వెళ్ళిపోయారు. వారు రోహిత్ కు, అతనితో పాటు సస్పెండ్ అయినవారికి న్యాయం జరగాలన్న డిమాండ్ తో ఉద్యమంలో మునిగి ఉన్నారు. ఎటొచ్చీ రోహిత్ దళితుడు…

రోహిత్: అబ్బే మేము తాకనిదే! -కార్టూన్

రోహిత్ వేముల ఆత్మహత్యకు తాము బాధ్యులం కాదని బాధ్యులైన వారంతా వివిధ మాటల్లో ప్రకటించారు. “ఇది దళిత-దళితేతర సమస్య” కాదు అనీ “శిక్షించిన కమిటీ నేత దళిత ప్రొఫెసరే” అనీ  ప్రకటిస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రి దూరం జరిగారు. “ఐదు రిమైండర్ లు రాయడం మామూలే. ఒత్తిడి కాదు” అని కూడా ఆమె నిరాకరించారు. “ఇది నేను తీసుకున్న చర్య కాదు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్నది” అంటూ వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు నిరాకరణ…

షేమ్ ఆన్ యూ! మోడిపై మల్లిక ఆగ్రహం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని గుజరాత్ నాట్యకళావేత్త మల్లిక సారాభాయ్ మరోసారి తీవ్రంగా విమర్శించారు. ‘పద్మ విభూషణ్’ గ్రహీత అయిన తన తల్లి మరణిస్తే సానుభూతిగా ఒక్క మాట కూడా చెప్పలేని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిగ్గు పడాలని ఆమె విమర్శించారు. గుజరాత్ మత మారణకాండ విషయంలో మొదటిసారి స్పందిస్తూ గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ దాఖలు చేసిన వ్యక్తి మల్లిక సారాభాయ్. భారత దేశం అంతరిక్ష పరిశోధనలకు నేతృత్వం వహించిన…

రోహిత్ వేముల దళితుడు కాదా?

యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో సస్పెన్షన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కులం గురించి ఈ నాలుగు రోజుల్లోనే అనేక కాకమ్మ కధలు ప్రచారంలో పెట్టారు. అనేక ఆడియోలు, వీడియోలు (డాక్టర్డ్) ప్రదర్శించారు. ఈ పుకార్లు, కధలు, వీడియోలు ప్రచారం చేసిపెట్టడంలో ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న వార్తా ఛానెళ్లు, ముఖ్యంగా ఆంగ్ల వార్తా ఛానెళ్లు తలమునకలుగా సహకరించాయి. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దళితుడు కావడం వల్లనే…

రోహిత్ ఆత్మహత్య: సస్పెన్షన్ ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ మిత్రులు నలుగురు రీసర్చ్ స్కాలర్ విద్యార్ధులపై స్పస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ ఎత్తివేసినందున విద్యార్ధులంతా సాధారణ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని వైస్ ఛాన్సలర్ పి అప్పారావు కోరారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించిన సబ్ కమిటీ గురువారం సమావేశమై సస్పెన్షన్ ను బేషరతుగా ఎత్తివేయడానికి నిర్ణయించిందని పాలకవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. “యూనివర్సిటీలో నెలకొన్న అసాధారణ…