కరువు.. మీకు పట్టదా కేంద్రం గారూ! -కత్తిరింపు

ఎల్ నినో కారణమో మరింకేం గాడిద కారణమో జనానికి అనవసరం. వారికి తెలిసింది వర్షాలు పడకపోవడమే. వర్షారాధార వ్యవసాయం సాగకపోవడమే. భారత దేశంలో వ్యవసాయం సాగకపోతే 75 శాతం జనం ప్రభావితులవుతారు. వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగా ఖరీఫ్ వానలు (నైరుతి ఋతుపవనాలు) శీతకన్ను వేయడంతో అనేక రాష్ట్రాలు దుర్భిక్షంతో సతమతం అవుతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలు రెండూ ఉన్నాయి. గొప్పకు పోయి, హిందూత్వ స్ఫూర్తితో మన రాష్ట్రాల పాలకులు నదీ జలాలని పుష్కర మాతకు సమర్పించుకున్నారు.…

మహారాష్ట్ర: నీళ్ళు – క్రికెటు – డబ్బు!

“ఈ రకంగా మీరు (బి‌సి‌సి‌ఐ) నీళ్లని ఎలా వృధా చేయగలరు? జనం ముఖ్యమా లేక మీ ఐ‌పి‌ఎల్ మ్యాచ్ లు ముఖ్యమా? ఇంత అజాగ్రత్తగా ఎలా ఉండగలరు? నీళ్లని ఈ రకంగా ఎవరు వృధా చేస్తారు? ఇది నేరపూరిత వృధా. మహా రాష్ట్రలో పరిస్ధితి ఎలా ఉన్నదో మీకు తెలుసు. నీళ్ళు సమృద్ధిగా దొరికే మరే ఇతర రాష్ట్రానికైనా మీరు ఐ‌పి‌ఎల్ మ్యాచ్ లను తరలించడం ఆదర్శవంతం అవుతుంది.” జస్టిస్ వి ఎం కనడే, జస్టిస్ ఎం…

ఓ హత్యాకాండ నుండి గుణపాఠాలు -ది హిందు ఎడ్

[Lessons from a massacre -The Hindu, April 6, 2016- కు యధాతధ అనువాదం.] ********* అన్ని కేసుల్లోనూ ‘ఆలస్యంగా చేకూరిన న్యాయం’ను ‘నిరాకరించబడిన న్యాయం’తో సమానం చేసి చెప్పలేము. ఆలస్యంగా జరిగే దోష నిర్ధారణ సైతం “శిక్ష నుండి శాశ్వతంగా రక్షణ పొందడం” లాంటిది ఏమీ ఉండదన్న సందేశాన్ని పంపే సందర్భాలు కొన్ని ఉండవచ్చు. సాయుధ టెర్రరిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్ పేరుతో అత్యంత క్రూరమైన హత్యాకాండలో పాల్గొన్న 47 మంది పోలీసులకు జీవిత…

భారత్ మాతా కీ జై! ఇదొక సమస్యా?

“కంట్రోల్ టవర్ నుండి.. ‘భారత్ మాతా కీ జై’ అనకపోతే ఇండియా మీదుగా వెళ్లనివ్వరట!” ********* ‘భారత్ మాతా’ జ్వరం బి‌జే‌పి నేతలను ఇంకా వదల్లేదు. ఎందుకు వదులుతుంది, ఎలా వదులుతుంది? ఆ జ్వరాన్ని తెచ్చుకున్న కారణమే వేరాయే! మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆర్‌ఎస్‌ఎస్, యోగా వీరుడు బాబా రాందేవ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, బి‌జే‌పి అధ్యక్షుడు అమిత్ షా… అంతే లేని జాబితా! నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న పాడు…

లోతుల నుండి -ది హిందు ఎడ్

ఏప్రిల్ 4, 2016 నాటి ది హిందు సంపాదకీయం ‘Out of depth’ శీర్షికన ప్రచురితం అయిన సంపాదకీయంకు యధాతధ అనువాదం. –విశేఖర్ ********* చమురు మరియు సహజవాయు అన్వేషణ, ముఖ్యంగా లోతైన జలాల్లో (డీప్ వాటర్), ప్రమాదకర వ్యాపారం. అత్యున్నతమైన ఆద్యునిక సాంకేతిక పరిజ్ఞానం దానికి కావాలి; కనుక భారీ మొత్తంలో నిధులూ అవసరమే. తగిన సాంకేతిక పరిజ్ఞానం, సరిపడా నైపుణ్యం తోడు లేకుండా సంపద తవ్వి తీయాలని భావిస్తే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్…

శని గుడి: కోర్టు తీర్పు అమలు చేయని బి‌జే‌పి ప్రభుత్వం

దేవాలయంలో మహిళలకు ప్రవేశం నిరాకరించే అధికారం ఎవరికి లేదని ఆలయాల్లో లింగ వివక్ష పాటించకుండా చూడడం మహారాష్ట్ర ప్రభుత్వానికి విధిగా బాధ్యత ఉన్నదని రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తన చర్యల ద్వారా నిరాకరించింది. కోర్టు తీర్పు ఇచ్చిన ధైర్యంతో తృప్తీ దేశాయ్ నేతృత్వం లోని రెండు డజన్ల మంది కార్యకర్తలు ఈ రోజు (శనివారం, ఏప్రిల్ 2) ప్రయత్నించారు. వారిని ఊరి జనం అడ్డుకున్నప్పటికీ పోలీసులు, జిల్లా…

ఉత్తరాఖండ్: ఫ్లోర్ లేని చోట ఫ్లోర్ టెస్ట్! -కార్టూన్

“ఏ ఫ్లోర్ టెస్టూ?! వాళ్ళు అసలు ఫ్లోరే లేకుండా చేస్తిరాయే…!” ********* కాంగ్రెస్ ధరించిన అప్రజాస్వామిక కీర్తి కిరీటంలోని కలికితురాళ్లను బి‌జే‌పి ఒక్కొటొక్కటిగా దొంగిలిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే ప్రారంభమై ఇందిరా గాంధీ హయాంలో ఊపందుకున్న విచక్షణారహిత ‘ఆర్టికల్ 356 ప్రయోగం’ ప్రస్తుతం ప్రధాని మోడి నేతృత్వం లోని బి‌జే‌పి ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించిన బి‌జే‌పి (కేంద్ర) ప్రభుత్వం పరిస్ధితులు…

ఇష్రాత్ జహాన్, హిందూత్వ మరియు ఒక ఆంగ్ల ఛానెల్!

డేవిడ్ కోలమన్ హేడ్లీ అలియాస్ డేవిడ్ హేడ్లీ అలియాస్ దావూద్ సయీద్ జిలానీ! భారత ఉపఖండంలో ఇప్పుడితగాడి పేరు ఒకటే మోతగా మోగుతోంది. పత్రికలు, ఛానెళ్లలో ఎక్కడ చూసినా ఈయన పేరు కనపడని చోటు లేదు. భారత దేశంలో చారిత్రక ప్రదేశాలను చూసి తరిద్దామని వచ్చిన విదేశీ టూరిస్టులు హెడ్లీ నామ స్మరణతో తరించిపోతున్న మన న్యూస్ చానెళ్లను చూస్తే గనక గబుక్కన ఆయన మన నేషనల్ హీరో అనుకోవచ్చు కూడాను! జనానికి అదృష్టమో/ దురదృష్టమో గానీ…

రద్దయ్యేది సన్నకారు రుణాలా, కార్పొరేట్ రుణాలా?

“ముందు మాల్యాని పట్టుకోండి…” ఆర్టికల్ కింద విన్న కోట నరసింహారావు గారి వ్యాఖ్యకు సమాధానంగా ఈ వ్యాసాన్ని చూడగలరు. ********* (బడా ఋణ గ్రహీతలను) “వదిలిపెట్టేస్తారు అనేది ఓ అపోహ. అసలు ఋణమాఫీ అన్నది సన్నకారు ఋణాల విషయంలోనే ఎక్కువ జరుగుతుంది.” ఇది విన్నకోట నరసింహారావు గారి వ్యాఖ్యలోని ఓ భాగం. జరుగుతున్న రాజకీయ రగడని అవకాశంగా తీసుకుని బాకీలు ఎగవేసే ధోరణి వల్ల దేశంలో ముఖ్య ఆర్ధిక సంస్ధలైన బ్యాంకుల వ్యవహారాలు ముందుకు సాగకుండా నిర్వీర్యం…

హ్యాపీ పాకిస్తాన్ నేషనల్ డే! -మోడి గ్రీటింగ్స్

“భారత్ మాతా కీ జై’ అనని వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు” బి‌జే‌పితో పాటు ఇతర హిందూత్వ సంస్ధల నేతలకు ఈ చాలా ఇష్టమైన డైలాగ్. ఈ డైలాగ్ చెబితే చాలు వారు అరివీర దేశభక్తులుగా రిజిస్టర్ అయిపోయినట్లే అని వారి ప్రగాఢ నమ్మకం. పాకిస్తాన్ మన పొరుగు దేశం అనీ, అనేక వేల సంవత్సరాలుగా ఇరు దేశాల ప్రజలు కలిసి మెలిసి నివసించారని వాళ్ళు ఇట్టే మర్చిపోతుంటారు. ప్రాచీన భారత నాగరికతగా చెప్పుకుని మురిసిపోయే హరప్పా, మొహంజొదారో…

ముందు మాల్యాని పట్టుకోండి! -రైలు టికెట్ కొనని మహిళ

భారత పాలకుల ధనికవర్గ తత్వాన్ని ఒక మహిళ ఎండగట్టిన ఉదంతం చోటు చేసుకుంది. సహజంగా వివాదాలకు దూరంగా ఉండాలని భావించే ధనిక కుటుంబాలకు చెందిన మహిళ ఈ సాహసానికి పూనుకోవడం విశేషం. 44 సం.ల మహిళ ఆదివారం రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడింది. బహుశా ‘పట్టుబడింది’ అనడం సరైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఆమె టికెట్ కొనలేనంత పేదరాలు కాదు. ‘పట్టుబడిన అనంతరం’ ఆమె టికెట్ కలెక్టర్ విధించిన జరిమానా చెల్లించడం కంటే జైలుకు వెళ్లడానికే సిద్ధపడడాన్ని…

వైవిధ్యానికీ, బహుళ గొంతుకలకూ జేఎన్యూ వేదిక

(ప్రముఖ పాత్రికేయులు, వ్యవసాయరంగ నిపుణులు, ‘రామన్ మెగసెసే’ అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ జేఎన్యూ ఉద్యమానికి మద్దతుగా గత 19న విద్యార్థులనుద్దేశించి క్యాంపస్లో ప్రసంగించారు. ఆ ప్రసంగానికి పూర్తిపాఠం ఇది.) *****అనువాదం: జి వి కే ప్రసాద్ (నవ తెలంగాణ)***** నేను జేఎన్యూ పూర్వ విద్యార్థిని కావడం నాకు గర్వకారణం. 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసిన కొద్ది కాలానికే నేనీ క్యాంపస్లో అడుగుపెట్టాను. ఆ రోజుల్లో పురుషుల ‘గంగా’ హాస్టల్ రాజకీయంగా ఎక్కువ క్రియాశీలంగా ఉండేది. నేనందులోనే ఉండేవాణ్ని.…

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లూటింగ్!

“మనల్ని మనమే విమర్శించుకుంటే ప్రపంచం ఇండియావైపు ఎందుకు చూడాలి?” యమునా తీరాన్ని ఖరాబు చేసే పనిలో నిమగ్నం అయిన పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ కు మద్దతు వస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అడిగిన ప్రశ్న ఇది. [పండిట్ బిరుదు ఆయనకు గతంలో ఉండేది. తర్వాత దానిని రద్దు చేసుకున్నారు. అందుకే రాసి కొట్టివేయడం.] మూడు రోజుల పాటు జరగనున్న ‘ప్రపంచ సాంస్కృతి పండగ’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి శుక్రవారం ఢిల్లీలో ప్రారంభిస్తూ…

ఆర్ట్ ఆఫ్ "లివింగ్ ఇట్ అప్"

“మనదేం బోయింది!” ఈ మాట అప్పుడప్పుడూ అంటుంటాం. మనది కాని సొమ్ముని అదుపు లేకుండా ఖర్చు చేసేసే అవకాశం వచ్చినప్పుడు ‘ఎక్కువ ఖర్చు పెడుతున్నాం’ అన్న వివేకం ఎక్కడో పని చేస్తూ ఉంటుంది, కానీ ఊరక వచ్చింది ఖర్చు పెట్టకుండా ఉండలేక నిభాయించుకోలేని బలహీనతలో పడిపోతాం. శ్రీ శ్రీ రవి శంకర్ గారి వ్యవహారం అలాగే ఉన్నట్లుంది చూడబోతే. “జీవించే కళ” అంటూ శ్రీ శ్రీ రవి శంకర్ గారూ మహా సామ్రాజ్యాన్నే నిర్మించారు. “ఒత్తిడి లేని…

JNU లోపల కన్హయ్యపై దాడి!

ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా ఉన్మాదపూరిత భావోద్వేగాలతో దేశంలో గాలిని నింపేశాక కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ లాంటి వాళ్ళకు రక్షణ ఎక్కడ ఉంటుంది? దేశ రాజధానిలో కోర్టు ఆవరణలోనే న్యాయాన్ని రక్షిస్తామని పట్టా పుచ్చుకున్న న్యాయవాదులు పోలీసుల సాక్షంగా కన్హయ్యపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో తన వారి మధ్య భద్రంగా ఉన్నాడనుకున్న కన్హయ్యను దుండగుడు ఒకరు బూతులు తిట్టి, కొట్టారని వార్త వెలువడింది. పి‌టి‌ఐ వార్తా సంస్ధ ప్రకారం JNUSU అధ్యక్షుడు…