ఇదిగో డిగ్రీ పట్టా -బి‌జే‌పి; అబ్బే ఫేక్ -ఏ‌ఏ‌పి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బి‌ఏ పట్టా వ్యవహారం రసకందాయంలో పడింది. బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలు ప్రత్యేకంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ‘ఇవిగో ప్రధాని పట్టాలు’ అని ప్రదర్శించారు. ఏ‌ఏ‌పి నేత కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏ‌ఏ‌పి వెనక్కి తగ్గలేదు. అమిత్ షా, అరుణ్ జైట్లీల విలేఖరుల సమావేశం ముగిసిన నిమిషాల లోనే తానూ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టాలలో…

చర్చ: వ్యవసాయ కౌలు -18

భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 18 (After 17th part…..) B) వ్యవసాయ కౌలు 59వ రౌండ్ ఎన్‌ఎస్‌ఎస్ (నేషనల్ శాంపిల్ సర్వే) సర్వే ప్రకారం భారత వ్యవసాయంలో అమలులో ఉన్న వివిధ కౌలు నిబంధనలు ఇవీ: స్ధిర ధనం (Fixed Money) స్ధిర పంట ఉత్పత్తి (Fixed Produce) పంట ఉత్పత్తిలో ఒక వాటా (Share of Produce) సర్వీస్ కాంట్రాక్టు (Under service contract సేవకుడు/ఉద్యోగికి అతని  సేవలకు ప్రతిఫలంగా…

అరవిందా మోడీయా ఎవరు బెటరు?

విశేషజ్ఞ గారి వ్యాఖ్య: – కాషాయం గ్యాంగుకి సోషల్ మీడియా సైట్లలో ఉన్న బలగంతో అరవింద్‌ని unpopular చేస్తున్నారేగానీ, నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో అతిపెద్ద failure మన గౌరవనీయులైన PM గారు. ఆయనిచ్చిన వాగ్దానాల్లో ఆయన ఎన్నింటిని నిలబెట్టుకున్నరో లెక్కలేస్తే, అధికారంలోకి రాగానే తన వాగ్దానాలమీద దృష్టిసారించి వాటిని నిలుపుకున్న అరవింద్ మేరుపర్వతమంత ఎత్తున కనిపిస్తాడు (మన కాషాయ నేత పుట్టగొడుగంత ఉండొచ్చు). అరవింద్‌కూడా రాజకీయం చేస్తున్నాడు కాదనను. మరి అంత కంటే కూటరాజకీయం PM చేస్తున్నప్పుడు…

తమిళనాట మళ్ళీ వరదలు! -కార్టూన్

అబ్బే ఆ వరదలు కాదు లేండి! ఇదో కొత్త రకం వరద! ఒపీనియన్ పోల్స్ లో జయలలితకు వ్యతిరేకంగా మొగ్గు ఉన్నట్లు తేలడంతో ఆమె వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. కాదు కాదు, వరద పారిస్తున్నారు. మచ్చుకు కొన్ని వాగ్దానాలు చూడండి. ఈ వరద విద్యలో ప్రస్తుతానికి జయలలిత గారిదే పై చేయి. ప్రతి రెండు నెలలకీ ఒక్కో యింటికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆటంకం (కోతలు) లేని విద్యుత్ మహిళలు స్కూటర్లు కొనడానికి 50% సబ్సిడీ…

సోనియా అంటే మోడీకి భయం -కేజ్రీవాల్

అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆం ఆద్మీ పార్టీ ఈ రోజు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. ఏ‌ఏ‌పి నేతలు అనేకమంది పాల్గొన్న ఈ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ర్యాలీకి ముందుగా జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ప్రసంగంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఉబుసుబోక ప్రసంగాలను నిలువునా చీరేశారు.…

చర్చ: ఉత్పత్తి సంబంధం – వేతన కూలీ శ్రమ -17

(16వ భాగం తరువాత……) – భారత వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం :  పార్ట్ –17 – వ్యవసాయరంగంలో మార్పులను మరింత వివరంగా అర్ధం చేసుకునేందుకు కింది అంశాలను చర్చిద్దాం. A) భారత వ్యవసాయం, భారత వ్యవసాయరంగం లలో ఉత్పత్తి సంబంధాలు, వేతన శ్రమ లెనిన్ ఇలా చెప్పారు, “పెట్టుబడి అన్నది ప్రజల మధ్య గల ఒక సంబంధం, పోలికలో ఉన్న కేటగిరీలు అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్ధాయిలో ఉన్నా లేదా కింది స్ధాయిలో ఉన్నా ఆ…

ప్రధాని మోడి డిగ్రీ, PG ఫోర్జరీ?!

బి‌జే‌పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ పక్క సోనియాను టార్గెట్ చేసుకోగా, ఢిల్లీ ముఖ్యమంత్రి నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని టార్గెట్ చేసుకున్నారు. మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు ఏమిటో కోర్టులు ఇతమిద్ధంగా ఏమి తేల్చలేదు. BA అని ఒక ఎన్నికల్లోనూ, B Com ఫస్ట్ ఇయర్ అని మరో ఎన్నికల్లోనూ అఫిడవిట్ లో రాయడం బట్టి స్మృతి ఇరానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని స్పష్టం అయింది. కానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే…

వర్షాలు లేవు గానీ… -కార్టూన్

వర్షాలు లేవు గానీ ఎన్నికల పుణ్యాన వాగ్దానాలు వరదై పారుతున్నాయి. హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో బి‌జే‌పి నేత నరేంద్ర మోడి ఎన్ని వాగ్దానాలు కురిపించారో గుర్తుందా? విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు జమ చేయిస్తాం. ‘నేషనల్ రూరల్ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ మిషన్’ ద్వారా గ్రామాలకు టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్ కేర్ వసతి…

భూసంస్కరణలు: జపాన్, ఇండియాల మధ్య తేడాలు -16

  భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 16 – (15వ భాగం తరువాత……………..) – 1947 అనంతర కాలంలో రాష్ట్రానికీ రాష్ట్రానికీ మధ్యా, ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యా వ్యత్యాసాలు ఉన్నాయి. తక్కువ వాణిజ్యీకరణ చెందిన ప్రాంతాలలో -ముందు చూసినట్లుగా- ప్రత్యక్ష ఉత్పత్తిదారుల నుండి మిగులు గుంజుకోవడంలో భూమిపై వ్యవసాయ కౌలు, వినియోగ రుణాలపై వడ్డీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మెరుగైన వాణిజ్యీకరణ జరిగిన ప్రాంతాల్లో ముడి సరుకులు, ఉత్పత్తుల వాణిజ్యం లతో సంబంధం…

అగస్టా ఛాపర్: సోనియాను ఇరికించే మాయోపాయం?

4 రాష్ట్రాల ఎన్నికలు జనానికి ముఖ్యంగా పత్రికల పాఠకులకు, చానెళ్ల వీక్షకులకు గడ్డు రోజులు తెచ్చి పెట్టాయి. ఎన్నికల ప్రచారం అంటే ప్రజలు తమ ఎంపిక కోసం తమ ముందు ఏ యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడం. ఇలాంటి అవకాశాలను ప్రజల ముందు ఉంచే పంధా నుండి రాజకీయ పార్టీలు ఎప్పుడో తప్పుకోవడం ఎన్నికల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అదనపు సమస్య. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో వారి చేతుల్లో ఉన్న ఒక ప్రధాన…

చర్చ: భారత వ్యవసాయంలో పెట్టుబడి – మౌలిక పరిశీలన 15

భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 15 – చాప్టర్ VI (14 వ భాగం తరువాత…..) చర్చ భారత వ్యవసాయంలో ఉత్పత్తి విధానాన్ని అర్ధం చేసుకోవాలంటే మనం భారత సామాజిక వ్యవస్ధలోని ఉత్పత్తి సంబంధం ప్రధాన ధోరణి ఏమిటో  లేక ఏ ఉత్పత్తి సంబంధం ఆధిపత్యం వహిస్తున్నదో గుర్తించాలి. ‘వివిధ స్వచ్చమైన ఉత్పత్తి విధానాలు నిర్దిష్ట పద్ధతిలో ఒకదానిపై మరొకటి విస్తరించి ఉన్నసామాజిక ఏర్పాటు’గా భారత దేశ ఉత్పత్తి విధానాన్ని వివరించే చర్చలోకి…

ఆదర్శ అవినీతి వటవృక్షం వేళ్ళు పెగిలేనా? -కార్టూన్

“భారత రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్ అధికారుల అవినీతికీ, అత్యాశకూ నిలువెత్తు గుర్తుగా నిలిచిన ఆదర్శ హౌసింగ్ సొసైటీ టవర్ ని కూల దోయండి” అని ముంబై హై కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 29) తీర్పు ప్రకటించింది. “ఈ అవినీతిలో భాగం పంచుకున్న నేతలు, అధికారులు అందరి పైనా, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు  క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆదర్శ హౌసింగ్ సొసైటీ భవన నిర్మాణం ‘అనాధికారికం, చట్ట…

కార్పొరేట్ల లాభాలకే ఎగుమతి ఆధారిత వ్యవసాయం -14

(13వ భాగం తరువాత…..) భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్  :  పార్ట్ 14 – ఎగుమతి ఆధారిత వ్యవసాయం మరియు పెట్టుబడి సంచయం పాలకవర్గాలు భారత వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల లక్ష్యంతో ఉత్పత్తి చేసే దిశకు మళ్లించడంపై దృష్టి పెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇండియాను ‘ప్రపంచం యొక్క నూతన ధాన్యాగారం’గా అభివర్ణించాడు. సునిల్ మిట్టల్ (భారతి) లాంటి కార్పొరేట్ ధనికులకు వేల ఎకరాలు కట్టబెడుతున్నారు. ఏ‌పి ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారు కాంట్రాక్టు…

ఇసిస్ బూచిగా ఫ్రాన్స్ లో కార్మిక వ్యతిరేక సంస్కరణలు

ప్యారిస్ ఉగ్రవాద దాడుల మాటున నల్ల చట్టాలకు పదును పెట్టుకున్న అధ్యక్షుడు ఫ్రాంస్వా/ఫ్రాంషా ఒలాండ్ ఆ వెంటనే కార్మిక చట్టాలను నీరుగార్చే పనిలో పడ్డాడు. ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత అప్రతిష్ట మూట గట్టుకున్న అధ్యక్షుడిగా ఇప్పటికే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఫ్రాంస్వా ఒలాండ్ తాజాగా తాలపెట్టిన కార్మిక చట్టాల సంస్కరణలపై ప్రజల నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాడు. ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిపాదించిన కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా మార్చి రెండవ వారం నుండి ఫ్రాన్స్ నగరాలలో కార్మికులు, విద్యార్ధులు క్రమం…

వైట్ హౌస్ లాక్ డౌన్ -ఫోటోలు

శ్వేత భవనం ఎవరికీ ప్రవేశం లేకుండా దిగ్బంధనం వివిధ చేశారని వార్తా సంస్ధలు తెలిపాయి. పశ్చిమ పత్రికలు ఒక లాక్ డౌన్ పరిస్ధితి గురించే చెప్పగా, రష్యా టుడే పత్రిక 24 గంటల పరిధిలో రెండు సార్లు లాక్ డౌన్ ప్రకటించారని తెలిపింది. శ్వేత భవనం రక్షణకు ప్రమాదం ఏర్పడిందని భావించినప్పుడు లాక్ డౌన్ ప్రకటిస్తారు. పరిసరాలలో ట్రాఫిక్ ను నిషేధిస్తారు. పాదాచారుల కదలికలను సైతం అడ్డుకుంటారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తారు. ప్రమాద పరిస్ధితి…