ట్రంప్ వీసా బిల్లులు, భారతీయుల ఉపాధి -విశ్లేషణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాపులర్ వాగ్దానాలను శరవేగంగా అమలు చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుండి వలసలను మూడు నెలల పాటు నిషేధించి ప్రపంచ వ్యాపితంగా కాక పుట్టించిన ట్రంప్, ఇప్పుడు ఉద్యోగాల సంరక్షణ పనిలో పడ్డాడు. అమెరికా దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (కాంగ్రెస్) లో ఇద్దరు సభ్యులు ఈ మేరకు రెండు వేరు వేరు బిల్లులు ప్రవేశపెట్టారు. అవి రెండూ విదేశీయులకు వీసాలు, ఉద్యోగాలు…

హిల్లరీ ఖాతాలో 8 లక్షల అక్రమ ఓట్లు -పరిశోధన

అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన డొనాల్డ్ ట్రంప్ కంటే ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ కి 2 మిలియన్ల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అనగా పాపులర్ ఓట్ల లెక్కలో చూస్తే ట్రంప్ ఓడిపోయినట్లు లెక్క. కానీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కలో ట్రంప్ కే మెజారిటీ రావడంతో ఆయన విజయుడు అయ్యాడు. ఈ అపభ్రంశానికి కారణం చెబుతూ ట్రంప్, హిల్లరీ క్లింటన్ కు మిలియన్ల సంఖ్యలో అక్రమ ఓట్లు పడ్డాయని, ఆ అక్రమ ఓట్లను తొలగిస్తే, పాపులర్ ఓటింగ్ లో…

ద.చై.స: చైనాకు ట్రంప్ ప్రభుత్వం వార్నింగ్!

ఎన్నికల ముందు నుండీ చైనాపై కత్తులు దూస్తున్న డొనాల్డ్ ట్రంప్, అధ్యక్ష పదవి చేపట్టాక కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. దక్షిణ చైనా సముద్రాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే, తగిన ప్రతిఘటన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్య రవాణా మార్గంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రయోజనాలను కాపాడుకుని తీరతామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ షాన్ స్పైసర్ విలేఖరుల సమావేశంలో హెచ్చరించాడు. వైట్ హౌస్ పత్రికా ప్రతినిధి అమెరికా…

ట్రంప్ ప్రొటెక్షనిజం – ఇండియా జపాన్ ల వాణిజ్య వైరం

డోనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం ప్రతిపాదించిన రక్షిత (ప్రొటెక్షనిస్టు) విధానాలు అప్పుడే ప్రభావం చూపిస్తున్నాయి. ఆరంభ రోజుల్లోనే ఇండియాపై ఆయన ప్రభుత్వం పడటం విశేషం. అయితే హెచ్1బి వీసాల రద్దు లేదా కుదింపు రూపంలో ఇండియాపై దెబ్బ పడుతుందని ఊహిస్తుండగా వాణిజ్య రంగంలో ఇండియాపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం ట్రంప్ వల్ల నేరుగా కాకుండా పరోక్షంగా పడటం మరో విశేషం. ఇండియా అనుసరిస్తున్న ‘ప్రొటెక్షనిస్టు’ విధానాల వలన తమ ఉక్కు ఎగుమతులు తీవ్రంగా…

దళితుల అణచివేతక్కూడా దళితులే కారణమా?

[పూజ గారు రాసిన వ్యాఖ్యకు ఇది స్పందన. -విశేఖర్] పూజ గారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీ మనసులో మాట ధైర్యంగా చెప్పినందుకు మీకు అభినందనలు చెప్పి తీరాలి. ఈ స్పందన మీ వ్యాఖ్యపై కోపంతో రాయడం లేదని మీరు మొదట గుర్తించాలి. మీ వ్యాఖ్యకు నేను ఇస్తున్న గౌరవంగానే ఈ చర్చను చూడాలని నా విజ్ఞప్తి. మీరు వ్యక్తం చేసిన భావన ఇదే మొదటిసారి కాదు. ఈ మధ్య తరచుగా ఇలాంటి భావనలు, మాటలు వినిపిస్తున్నాయి.…

ఈ రోజు ట్రంప్ ని చంపేస్తే ఒబామా పాలనే -సి‌ఎన్‌ఎన్

అమెరికాకు చెందిన కార్పొరేట్ మీడియా కంపెనీ అయిన కేబుల్ న్యూస్ నెట్ వర్క్ (సి‌ఎన్‌ఎన్) తన రోత బుద్ధిని సిగ్గూ, ఎగ్గూ లేకుండా బైట పెట్టుకుంది. పదవీ స్వీకారం రోజునే, అనగా ఈ రోజే (జనవరి 20) డొనాల్డ్ ట్రంప్ తో పాటు, ఆయన బృందాన్ని హత్య చేస్తే ఒబామా పాలనే కొనసాగుతుందని ఒక వార్తా నివేదిక ప్రసారం చేసింది. ఒక ఊహాత్మక పరిస్ధితిని చర్చించడం ద్వారా ట్రంప్ హత్యను తానూ, తన లాంటి ఇతర కార్పొరేట్…

UoH విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య లేఖ! -పునర్ముద్రణ

ఒక నక్షత్రం రాలిపడలేదు; నేరుగా దివికే ఏగి వెళ్లింది. చుక్కల చెంతకు వెళ్తున్నానని చెప్పి మరీ వెళ్లింది. ఆత్మలపై, దైవాలపై, దెయ్యాలపై నమ్మకంతో కాదు సుమా! తనను తాను ‘అచ్చంగా ఒక THING ని’ మాత్రమే అని తెలుసుకుని మరీ వెళ్లిపోయింది. ఈ విశ్వం అంతా నక్షత్ర ధూళితో నిర్మితమై ఉన్నదన్న సర్వజ్ఞాన్య ఎరికతో ఆ పదార్ధం జీవాన్ని చాలించుకుని నక్షత్ర ధూళితో తిరిగి కలిసేందుకు సెలవంటూ వెళ్లింది. ఆత్మహత్య పాపం కాకపోవచ్చు గానీ పరికితనం. నిజంగా […]

డిగ్రీ వివరాలు ఇవ్వొద్దని స్మృతి కోరారు -యూనివర్సిటీ

తన చదువు వివరాలు ఆర్‌టి‌ఐ దరఖాస్తుదారుకు ఇవ్వొద్దని మానవ వనరుల శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తమను కోరారనీ అందుకే ఆమె డిగ్రీ వివరాలను దరఖాస్తుదారుకు ఇవ్వలేదని స్కూల్ ఆఫ్ ఓపెన్ లర్నింగ్ (ఎస్‌ఓ‌ఎల్), సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి‌ఐ‌సి) కు వివరణ ఇచ్చింది. మంత్రి ఒత్తిడితోనే ఇరానీ చదువు వివరాలను విద్యా సంస్ధ ఇవ్వలేదని ఈ వివరణతో స్పష్టం అవుతున్నది. స్మృతి ఇరానీ తన విద్యార్హతల వివరాలను…

బ్లాడ్లీ మేనింగ్: 35 ఏళ్ళ శిక్షను 7 ఏళ్లకు కుదించిన ఒబామా

మరో రెండు రోజుల్లో అధ్యక్ష పదవి నుండి దిగిపోనున్న బారక్ ఒబామా, గత ఎనిమిదేళ్లుగా పాల్పడిన పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. వికీ లీక్స్ కు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల రహస్య సమాచారాన్ని అందజేసినందుకు మిలట్రీ కోర్టు మార్షల్ విధించిన 35 ఏళ్ళ కారాగార శిక్షను 7 సంవత్సరాలకు కుదిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసాడు. ఫలితంగా 20 మిస్టర్ బ్రాడ్లీ మేనింగ్ ఉరఫ్ మిస్ చెలేసా మేనింగ్ 2045 లో విడుదల కావలసిన చెలేసా మేనింగ్ వచ్చే…

ఇప్పుడు నాకొక పాట కావాలి –గేయమైన గాయం

బాధితులనే దొషులుగా నిలబెడుతున్న హిందూత్వ కుటిల పాలనలో నరకబడ్డ అఖ్లక్ లపైనే చార్జి షీట్లు నమోదవుతున్నాయి. హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత ప్రజ్వలనంలో తనను తాను ఆహుతి చేసుకున్న రోహిత్ వేముల ఈ దేశ దళితోద్ధారక చట్టాల సాక్షిగా దళితుడు కాడని రుజువు చేయబడ్డాడు. ఎన్నికల కోసం చేసే దళిత వివక్ష నిర్మూలనా శపధాలను హైందవ కపట నీతి దళితతనం నిర్మూలనతో నెరవేర్చుతున్నది. దళిత పుట్టుకనే నిరాకరించడం ద్వారా దళిత అణచివేత సమస్యను కృత్రిమంగా మాయం చేసేస్తున్న…

RSS సంస్ధలకు ఢిల్లీ భూముల పందేరం

భూములు లేని పేదలకు, కనీసం ఇళ్ల స్ధలాలు కూడా లేని వారికి కాసింత జాగా ఇవ్వటానికి కూడా పాలకులకు మనసు రాదు. కానీ విదేశీ కంపెనీలకు, కార్పొరేట్లకు, ధనిక వర్గాలకు, సొంత మనుషులకు భూములు అప్పనంగా అప్పజెప్పేందుకు చట్టాలను సైతం తుంగలో తొక్కడం భారత పాలకులకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు.  ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలనే అనుసరించింది. బీజేపీ/మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ ను అనుసరిస్తోంది. హిందూత్వ సంస్ధలకు, వ్యక్తులకు ఢిల్లీ లోని విలువైన భూములు పందేరం…

నోట్ల రద్దు: ఇండియా వృద్ధి రేటు తగ్గించిన ఐ‌ఎం‌ఎఫ్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
ప్రపంచ కాబూలీవాలా కూడా ఒప్పేసుకున్నాడు. డీమానిటైజేషన్ వల్ల ఇండియా జి‌డి‌పి వృద్ధి రేటు అంచనాను ఐ‌ఎం‌ఎఫ్ కూడా తగ్గించేసుకుంది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసిన ఐ‌ఎం‌ఎఫ్ ఇప్పుడు దాన్ని 6.6 శాతానికి తగ్గించుకుంది. “ఇండియాలో ప్రస్తుత సంవత్సరానికి (2016-17) మరియు ఆ తర్వాత సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను వరుసగా 1 శాతం మరియు 0.4 శాతం మేరకు తగ్గిస్తున్నాము. దీనికి…

అఖిలేష్ కు దక్కిన సైకిల్ గుర్తు!

తండ్రి పైన తిరుగుబాటు చేసిన కొడుకు వైపే ఎలక్షన్ కమిషన్ మొగ్గు చూపింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వం లోని సమాజ్ వాదీ పార్టీ గ్రూపుకే సైకిల్ గుర్తు అప్పజెపుతున్నట్లు కొద్ది సేపటి క్రితం కమిషన్ ప్రకటించింది. “ఇక కమిషన్ మాకు ఏ గుర్తు ఇస్తే ఆ గుర్తు పైన పోటీ చేస్తాం” అని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించాడు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గత ఐదారు నెలల నుండి సమాజ్ వాదీ పార్టీలో తండ్రీ…

1% చేతిలో 58% దేశ సంపద -ఆక్స్ ఫామ్

ఆక్స్ ఫామ్ అన్నది బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్ధ. ఖచ్చితంగా చెప్పాలంటే 18 అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్ధల కాన్ఫెడరేషన్! అంతర్జాతీయంగా నెలకొన్న అసమానతలను అధ్యయనం చేసిన ఈ సంస్ధ భారత దేశంలో నెలకొన్న తీవ్ర అసమానతల గురించి కూడా తెలియజేస్తూ ఒక నివేదిక తయారు చేసి విడుదల చేసింది. (Scroll.in) ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో:   సంపద యాజమాన్యం రీత్యా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న 1 శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి…

నోట్ల రద్దు: వివరాలు చెబితే ప్రాణాలకు ముప్పు -ఉర్జిత్

పెద్ద నోట్ల రద్దు చర్యకు ఎందుకు, ఎలా పూనుకున్నారో చెప్పండయ్యా అని అడుగుతుంటే కాని కారణాలు ఎన్నో చెబుతున్నారు. తరచుగా ఈ కారణాల మధ్య పొంతన ఉండడం లేదు. ఒకరు చెప్పిన కారణాలు మరొకరు చెప్పడం లేదు. మోడీ ఒకటి చెబితే జైట్లీ మరొకటి చెబుతారు. RBI గవర్నర్ గారు నోరు మెదపరు. ఇలా కాదని RTI చట్టాన్ని ఆశ్రయిస్తే ఆయన సరికొత్త కారణాలు చెబుతున్నారు.  నోట్ల రద్దు వల్ల తన ప్రాణానికి ముప్పు వచ్చిందనీ తనను…