మోడి అహంకారి! -మేఘాలయ గవర్నర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అహంకారి అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ అభివర్ణించారు. రైతుల సమస్య గురించి చర్చించడానికి వెళితే ఇద్దరం వాదులాడుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. (ఇండియన్ ఎక్స్^ప్రెస్, జనవరి 3, 2022) బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అదురు బెదురు లేకుండా విమర్శించే బి‌జే‌పి నేతల్లో సత్య పాల్ మాలిక్ ఒకరు. రెండు అధికార కేంద్రాలు (నరేంద్ర మోడి, ఆర్‌ఎస్‌ఎస్) ఉన్న చోట…

యేడాదిలో అణు విద్యుత్ కు జర్మనీ ముగింపు! మరి ఇండియా!?

జర్మనీ సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం. యూరోపియన్ యూనియన్ కు నాయక దేశం. ఐరోపాలో జర్మనీ తర్వాతే ఏ దేశమైనా. ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు జర్మనీ తర్వాతే. జర్మనీని ఐరోపా ఆర్ధిక వ్యవస్ధకు ఇంజన్ లాంటిది అని కూడా అంటారు. అలాంటి జర్మనీ మరో యేడాదిలో తన దేశంలో ఉన్న అణు విద్యుత్ ని ఉత్పత్తి చేసే కేంద్రాలు అన్నింటినీ మూసివేయబోతోంది. జర్మనీలో ప్రస్తుతం ఆరు మాత్రమే అటు విద్యుత్ ప్లాంట్ లు మిగిలి ఉన్నాయి.…

చట్టం అమలు: మెజారిటీలకి ఒకటి, మైనారిటీలకి ఒకటి

మునవర్ ఫరూకి ఒక స్టాండప్ కమెడియన్. జనాన్ని నవ్వించడం ఈ యువ కళాకారుడి వృత్తి, ప్రవృత్తి. జనవరి 1, 2021 తేదీ ఇండోర్ (మధ్య ప్రదేశ్) పట్టణంలో అతను ప్రదర్శన ఇవ్వబోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 295 ఏ కింద కేసు పెట్టారు. నేరం ఏమిటని విలేఖరులు అడిగితే “తన కామెడీ షోలో ఇతరుల మత భావాలను నమ్మకాలను అవమానపరిచాడు” జిల్లా ఎస్‌పి అని చెప్పాడు. “మునవర్ ఆరోజు అసలు షో మొదలు పెట్టకుండానే అరెస్ట్…

జనం చస్తే మాకేం? నాగాలాండ్ లో AFSPA పొడిగింపు

నాగాలాండ్ ప్రజలు ఏమి కోరుకున్నా తాము మాత్రం తాము అనుకున్నదే అమలు చేస్తామని మోడి ప్రభుత్వం చాటి చెప్పింది. రాష్ట్ర ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని’ మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వ విచక్షణపై నాగాలాండ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకం పటాపంచలైంది. నాగాలాండ్ రాష్ట్రంలో AFSPA చట్టం అమలు చేయాల్సిన అవసరం…

శ్రీలంక సంక్షోభం, సాయం చేసేందుకు ఇండియా చైనా పోటీ

శ్రీలంక ఇటీవల కాలంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. సంక్షోభం నుండి గట్టెక్కేందుకు శ్రీలంక బహిరంగంగానే ఇండియా సహాయం కోరింది. ఆ మేరకు ఇండియా కూడా గత నవంబరులో కొన్ని హామీలు ఇచ్చింది. ప్రమాదం గ్రహించిన చైనా తానూ సహాయం చేస్తానంటూ ముందుకు వస్తోంది. జనవరి మొదటి వారంలో చైనా విదేశీ మంత్రి శ్రీలంక పర్యటించనున్నారు. జనవరి 7 తేదీ గానీ లేదా 9 తేదీ గానీ ఈ పర్యటన జరగనున్నట్లు తెలుస్తున్నది. ఈ పర్యటనలో శ్రీలంకకు నోరూరించే…

స్వతంత్రం రెచ్చగొడితే తీవ్ర చర్యలు తప్పవు! -తైవాన్ తో చైనా

చైనా మరోసారి తైవాన్ ను తీవ్రంగా హెచ్చరించింది. ‘స్వతంత్రం’ పేరుతో జనాన్ని రెచ్చగొడుతూ ఉంటే తీవ్ర చర్యలు తప్పవు, అని చైనా ప్రభుత్వం తైవాన్ ను హెచ్చరించింది. “స్వతంత్రం ప్రకటించుకునే వైపుగా ఏ మాత్రం అడుగు వేసినా చర్యలు తప్పవు” అని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ప్రతినిధి మా చియావో గువాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించాడు. తైవాన్ తో శాంతియుతంగా ఐక్యం కావడానికి కృషి చేసేందుకు చైనా దేశం సిద్ధంగా ఉందనీ అయితే స్వతంత్రత ప్రకటించుకునే…

హిందూ దేశంగా మార్చుతామని ప్రతిజ్ఞ, పోలీసులకు ఫిర్యాదు

హిందూత్వ గణాలు దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ లోని గోవింద్ పురి మెట్రో స్టేషన్ సమీపంలో ‘హిందూ యువ వాహిని’ అనే సంస్ధ ఆద్వర్యంలో జరిగిన సదస్సు మరో విడత పరమత విద్వేష ప్రసంగాలకు, ప్రతిజ్ఞలకు వేదికగా నిలిచింది. ఈసారి భారత దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేందుకు చంపడానికి, చావడానికి కూడా సిద్ధమంటూ సభికుల చేత నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ముస్లింలు, క్రైస్తవులపై జీనోసైడ్ (సామూహిక హత్యాకాండ) జరపాలని, మాజీ ప్రధాని మన్మోహన్…

రష్యన్ హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం!

రష్యా తన ఆయుధ సంపత్తిని అమెరికాకు కూడా అందనంత ఎత్తుకు చేర్చుకుంటోంది. నాటో కూటమిని తూర్పు దిశలో రష్యా పొరుగు సరిహద్దు వరకూ విస్తరించడానికి అమెరికా కంకణం కట్టుకుంటున్న కొద్దీ రష్యా తన ఆయుధ సంపత్తిని మరింత ఆధునిక స్ధాయికి అభివృద్ధి చేస్తోంది. తాజాగా అత్యంత వేగంగా, శత్రు దేశాల రాడార్లకు దొరకని విధంగా అత్యంత రహస్యంగా ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగల మిసైల్ ని ‘జిర్కాన్’ పేరుతో రష్యా అభివృద్ధి చేసింది. సుదీర్ఘ దూరాల వరకు ఏరో…

ఇది హిందూత్వ కాదు ‘చోర్ బజార్’! -శివ సేన

హిందూత్వను ఎవరు నిజాయితీగా ఆచరిస్తున్నారు అన్న అంశంలో బి‌జే‌పి, శివసేన పార్టీల మధ్య ఎప్పుడూ పోటీ నెలకొని ఉంటుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో కలిసి శివసేన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోటీ మరింత తీవ్రం అయింది. బి‌జే‌పి తో స్నేహం విడనాడి లిబరల్ బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో జట్టు కట్టడమే హిందూత్వ సిద్ధాంతానికి ద్రోహం చెయ్యడంగా బి‌జే‌పి ఆరోపిస్తుంది. అసలు బి‌జే‌పి ఏనాడో హిందూత్వను వదిలి పెట్టి అవినీతికి,…

దళిత వంటను ఆ పిల్లలు ముట్టుకోలేదు, ఆమె ఉద్యోగం పోయింది!

భారత రాజ్యాంగం కుల వివక్షను రద్దు చేసింది. అలాగే అంటరానితనాన్ని కూడా రద్దు చేసింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 యేళ్ళు గడిచినా కూడా భారత సమాజం రాజ్యాంగంలో పొందు పరిచిన సామాజిక విలువలను గౌరవించేందుకు సిద్ధంగా లేదు. ఉత్తర ఖండ్ లోని ఒక స్కూల్ పిల్లలు దళిత మహిళ వంట చేసిందన్న కారణంతో ఆ స్కూల్ లో వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానేశారు. స్కూల్ భోజనం తినడానికి బదులు తమ ఇళ్ల నుండి…

మోడీ కుట్ర విప్పి చెప్పిన సాహసికి లేఖ

గుజరాత్ మారణకాండలో నరేంద్ర మోడీ హస్తం సాక్ష్యాధారాలు బైటపెట్టాడన్న కోపంతో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ భట్ ను ఒక పాత కేసులో ఇరికించి ముప్పై సంవత్సరాల శిక్ష వేసిన సందర్భంలో హర్ష్ మందర్ రాసిన లేఖ. (వీక్షణం జూలై 2019 సంచిక నుంచి) – హర్ష్ మందర్, IAS (తెలుగు: ఎన్ వేణుగోపాల్) ప్రియమైన సంజీవ్, ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి…

కోవిడ్ భవిష్యత్తు చెప్పే అర్హత బిల్ గేట్స్ కి ఎక్కడిది?

అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి తెలియని వారు ఉండరు. గూగుల్, ఫేస్ బుక్ లాంటి కంపెనీలు వచ్చేవరకూ ప్రపంచ సాఫ్ట్ వేర్ సామ్రాజ్యానికి ఆయన మకుటం లేని మహారాజు. అనేక మూడో ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు కూడా ఆయనతో స్టేజి పంచుకోవటానికి ఉబలాట పడేవారు. కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రధాన ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తనకు తెలిసింది తక్కువే అని ఆయన పలుమార్లు చెప్పుకున్నాడు. ఆరంభంలో…

ప్రియాంక పిల్లల ఇన్స్టా హ్యాకింగ్ చేసిన ప్రభుత్వం?

ప్రియాంక గాంధీ వాద్ర ఈ రోజు (డిసెంబర్ 21, 2021) ఒక నమ్మశక్యం కానీ విషయాన్ని వెల్లడి చేశారు. ఆమె పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందట! ఇది నిజంగా నిజమేనా?! ఇది నిజమే అయితే బహుశా అంతకంటే దరిద్రమైన ఆరోపణ మోడి ప్రభుత్వం ఇక ఎదుర్కోబోదేమో! ప్రియాంక గాంధీకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు రైహన్ వాద్రా, వయసు 20 సం.లు. అమ్మాయి పేరు మిరాయ వాద్రా, వయసు…

రిపేర్ ఖర్చు పెట్టలేక టెస్లా ఎలక్ట్రిక్ కారు పేల్చేసిన ఓనర్!

ఇది ఫిన్లాండ్ దేశంలో జరిగింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్టింది పేరు. ఎలాన్ మస్క్ ఈ కంపెనీ వ్యవస్ధాపకుడు. టెస్లా కంపెనీకి సి‌ఈ‌ఓ ఆయనే.  ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం కంపెనీల యజమాని మార్క్ జుకర్ బర్గ్ వాట్సప్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేశాక, వాట్సప్ ని మొబైల్ ఫోన్ల నుండి తీసేసి దాని బదులు సిగ్నల్ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోమని యూజర్లకు ట్విట్టర్ ద్వారా సలహా ఇవ్వడం లాంటి చర్యలు, ప్రకటనల ద్వారా…

బ్రెజిల్ నుండి ఐ‌ఎం‌ఎఫ్ గెంటివేత!

ఐ‌ఎం‌ఎఫ్ ని బ్రెజిల్ గెంటివేసింది. మీ సేవలు చాలు, దేశాన్ని విడిచి వెళ్ళండి అని మొఖం మీదే చెప్పింది. బ్రెజిల్ ఆర్ధిక మంత్రి స్వయంగా ‘ఇక చాలు, మూటా ముల్లె సర్దుకోండి’ అని చెప్పేశాడు. దానితో బ్రెజిల్ లో తమ కార్యాలయాన్ని మూసివేస్తామని బ్రెజిల్ ప్రకటించింది. ఐ‌ఎం‌ఎఫ్ సంస్ధ ప్రపంచ కాబూలీవాలా. ఆర్ధిక కష్టాల్లో ఉన్న దేశాలకు అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పుకుంటుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు సంక్షోభ నివారణ ఔషధాలు అందజేసి కోమా ఉన్న ఆర్ధిక వ్యవస్ధలను…