ఆర్ జి కార్ డాక్టర్ల ఆందోళనకు పరిష్కారం ఎప్పుడు?


అటు సుప్రీం కోర్టు, ఇటు కోల్ కతా ప్రభుత్వం, మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లు ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ & ఆసుపత్రి లో అత్యాచారం, హత్య కు గురైన బాధిత మెడికో కు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.

ఈ మాట అంటున్నది ఎవరో కాదు. బాధితురాలి తల్లిదండ్రులతో పాటు, ఆసుపత్రి సీనియర్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, దేశ వ్యాపితంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు మరియు వైద్య విద్యార్ధులు ముక్త కంఠంతో ఈ అభిప్రాయం వినిపిస్తున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 17, 2024 మంగళవారం) సుప్రీం కోర్టులో మరో విడత విచారణ జరిగి మరో రెండు వారాలకు వాయిదా పడింది.

సి.బి.ఐ ఇప్పటి వరకు కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు. నేరంలో సివిల్ వాలంటీర్ కేవలం పావు అనీ, సందీప్ ఘోష్ తో పాటు అనేక మంది పెద్దలు ఇందులో ఉన్నారని సీనియర్ డాక్టర్లు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రితో చర్చల ఫలితంగా ఇద్దరు పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు తెలుస్తున్నది. కానీ మానవ అవయవాల అక్రమ రవాణా, శవాల అమ్మకం, మెడికల్ వృధాల అక్రమ తరలింపు.. ఈ నేరాలకు కూడా బాధ్యులు ఎవరో తేలవలసి ఉన్నది. అది జరిగితేనే బాధితురాలి అత్యాచారం, హత్య ల గురించి నిజమైన విచారణ జరిగినట్లు అవుతుంది.

కానీ పైన కార్టూన్ లో చూపినట్లుగా బాధితురాలికి న్యాయం జరిగే ప్రక్రియ నెలల తరబడి కొనసాగే పరిస్ధితి కనిపిస్తుండగా, శవాల అమ్మకం, అవయవాల అమ్మకం, మెడికల్ వృధాల అక్రమ తరలింపు నేరాల దొషులు చట్టానికి పట్టుబడే పరిస్ధితి కనిపించడం లేదు.

వ్యాఖ్యానించండి