ఈ వీడియో నాకు వాట్సప్ మేసెజ్ గా వచ్చింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యం అని వీడియో చివర తనే చెప్పారు. ఆయన తాను రాసిన కవితను ఈ వీడియోలో చదివి వినిపించారు.
కవిత అద్భుతంగా ఉన్నది. సహజంగానే కవిత నచ్చని వారు ఉండవచ్చు. వారికి నా వైపు నుండి ఒక విజ్ఞప్తి ఏమిటంటే కవిత ఎందుకు నచ్చలేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (ఆఫ్ కోర్స్, కామెంట్ ద్వారా నన్ను కూడా ప్రశ్నించవచ్చు.) సత్యం గారు కవిత్వంలో చెప్పిన అంశాలు వాస్తవమా కాదా అని తర్కించుకోండి.
వాస్తవం అయినా సరే, కవిత నచ్చకపోతే గనక మీలో ఏదో లోపం ఉన్న సంగతిని గ్రహించాల్సిన అవసరాన్ని గుర్తించండి. వాస్తవం కాదు అనిపిస్తే ఎందుకు కాదో సకారణంగా ఆ సంగతి చెప్పండి. ఇక్కడ చెప్పకపోయినా మీకయినా చెప్పుకోండి.
భారత సమాజంలో భూస్వామ్య వ్యవస్థ లక్షణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థ నశించకపోతే కొత్త, ప్రగతిశీల సమాజం ఏర్పడటానికి అది ఆటంకంగా నిలుస్తుంది. సమాజ అభివృద్ధి అసాధ్యం అవుతుంది. ఆ సంగతిని గుర్తింపజేసే ప్రయత్నంలో ఈ వీడియో ప్రచురిస్తున్నాను. మన తప్పులు మనం చూడలేనంత కాలం వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉండదు.
అంతకు మించి వేరే ఉద్దేశ్యం లేదు.