బ్రిటన్ హై కోర్టు అసాంజే ను అమెరికాకు extradite చెయ్యడానికి ఓకే చెబుతూ తీర్పు చెప్పింది. దానితో అయన హక్కులకు చివరికి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చింది.
అసాంజేను లాక్కెళ్లి జైల్లో కుక్కడానికి, ఆయనను చిత్ర హింసలు పెట్టి కక్ష తీర్చుకోవడానికి అమెరికా అనేక ఏళ్లుగా ఉవ్విళ్లూరుతోంది. బ్రిటన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తూ వచ్చింది. అమెరికా ఒత్తిళ్లు ఫలించాయి.

అసాంజేను అమెరికాకు అప్పగిస్తే అంకుల్ సామ్ ఏం చేస్తాడో కార్టూన్ చెబుతోంది.
డిప్లొమాటిక్ కేబుల్స్ తో పాటు అమెరికా పాల్పడిన ఆఫ్గనిస్తాన్, ఇరాక్ దురాక్రమణ యుద్ధాల్లో వేలాదిమంది ఆఫ్ఘన్, ఇరాక్ పౌరులను అమెరికా సైనికులు అమానుషంగా చంపేశారని వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేశారని వికీ లీక్స్ ద్వారా అసాంజే వెల్లడి చేసాడు. ఇదే అమెరికా కడుపు మంట.
అమెరికా NSA, FBI , CIA మొ.న గూఢాఛార సంస్థలు అనేక దేశాల పౌరుల ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్ లు పై నిఘా పెట్టినట్లు బైట పెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను కూడా ఇలాగే అమెరికా వెంటాడింది. వేటాడింది. కానీ రష్యా ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో ఏమీ చేయలేక పోయింది.
కానీ బ్రిటన్ అమెరికా మిత్ర దేశం. తోడు దొంగ కూడా. Five Eyes లో అదీ ఒకటి. అసాంజే ను ఐదేళ్లు ఈక్వడార్ ఎంబసీ లో ఖైదు చేసింది. ఈక్వడార్ లో అనుకూల Govt వచ్చాక జైలుకి తరలించింది. ఇపుడు అమెరికాకి పంపేందుకు కోర్టు ని ఒప్పించింది.
ప్రపంచ ప్రజలు ఈ extradition ను వ్యతిరేకించాలి.

