సో మెనీ పు.. -యు‌ఎస్ ఎన్నికలపై లావరోవ్ వ్యాఖ్య (నవ్వుకోండి!)


so-manyఅమెరికా వార్తా ఛానెల్ సి‌ఎన్‌ఎన్ (కేబుల్ న్యూస్ నెట్ వర్క్) రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ ని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో లావరోవ్ ఎంతో సీరియస్ గా చేసిన ఓ వ్యాఖ్యకు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి నవ్వు ఆపుకోలేకపోయారు.

ఆ ప్రశ్న అమెరికా ఎన్నికల ప్రచారానికి సంబంధించినది. ఇంటర్వ్యూ వీడియోను కింద చూడవచ్చు!

వీడియో చూసే ముందు పూర్వ రంగం కాస్త తెలుసుకుని ఉండటం అవసరం.

రష్యాలో రెండేళ్ల క్రితం ‘పు__ రైట్ మూవ్మెంట్’ పేరుతో ముగ్గురు రష్యన్ యువతులు కొన్ని రోజుల పాటు కలకలం సృష్టించారు. ఇది నిజానికి ఉద్యమం అనడానికి ఎలాంటి అర్హత లేనిది. చీదర-వెగటు-అసహ్యం లాంటి అన్ని భావాలను ఒకేసారి కలిగించే చర్యల కలబోత మాత్రమే అది.

ఉద్యమం పేరుతో ఈ యువతులు ఏమి చేశారన్నది నేను రాయలేను.  గూగుల్ లో వెతికితే దొరుకవచ్చు.  పశ్చిమ పత్రికలు వారి చర్యలకు రాజకీయ-ఫెమినిస్టు-ఉద్యమ ప్రతిష్ట కల్పించేందుకు గట్టిగా కృషి చేశాయి. కనుక వారు వాస్తవంగా ఏమి చేసిందీ (వీడియోలో) కత్తిరింపులకు గురయింది.

అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా దాదాపు అమెరికా కార్పొరేట్ మీడియా అంతా కత్తి కట్టి వ్యవహరిస్తోంది. ట్రంప్ పాత రికార్డులను వెతికి వెతికి పట్టి ఆయన తప్పులను అమెరికా ప్రజల ముందు పెడుతున్నాయి. ప్రైవేటు సంబాషణలను సైతం వెలికి తీసి బైట పెట్టి ట్రంప్ పైన వ్యతిరేకత మూట గట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

అందులో భాగంగా ఆయన ఎన్నడో అనగా రికార్డ్ చేసిన బూతు మాటలని ఇప్పుడు వెలికి తీసి న్యూస్ ఛానెళ్లు వినిపిస్తున్నాయి. ఆ రికార్డుల్లో ఒక భాగం ఇలా ఉన్నది:

“AND WHEN YOU’RE A STAR THEY LET YOU DO IT. YOU CAN DO ANYTHING. WHATEVER YOU WANT. GRAB THEM BY THE ****Y”

CNN విలేఖరి ఆనాటి రష్యన్ యువతుల మూవ్మెంట్ నీ ఈ నాటి డొనాల్డ్ రైట్ మూవ్మెంట్ నీ పోల్చి వ్యాఖ్యానించమని లావరోవ్ ని అడిగింది. అందుకు ఆయన ఏం సమాధానం ఇచ్చారో మీరే చూడండి. ఆయన ఆ సమాధానం ఇస్తారని పాపం ఇంటర్వ్యూ చేసినావిడ ఊహించలేదట!

వ్యాఖ్యానించండి