ప్రధాన మంత్రి మోడీ హామీ ఇఛ్చిన అచ్ఛే దిన్ ఎప్పటికి సాకారం అవుతాయని భారత ప్రజలు మాత్రమే అడగడం లేదు. అంతర్జాతీయ రేటింగ్ కంపెనీలు కూడా అదే మాట అడుగుతున్నాయి.
అయితే భారత ప్రజలు కోరే మంచి దినాలు, రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు ఒకటి కావు. పైగా పరస్పర విరుద్ధం. రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు వస్తేనేమో అవి ప్రజలకు చెందిన ఖనిజ, నీటి, మానవ వనరులను అన్నింటిని దోచి విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తాయి. భారత జనానికి మంచి దినాలు వస్తేనేమో వనరులు జనానికి ఉపయోగపెడతాయి. అనగా ప్రభుత్వ కంపెనీలు పెరుగుతాయి; ఉద్యోగాలు పెరుగుతాయి; ప్రయివేటీకరణ వెనక్కి వెళుతుంది; ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్ధలు పెరుగుతాయి.
క్రెడిట్ సుయిస్, స్విట్జర్లాండ్ కి చెందిన రేటింగ్ కంపెనీ. దాని పని బహుళజాతి కంపెనీలకు, ముఖ్యంగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు, కంపెనీలకు, బ్యాంకులకు, ద్రవ్య సంస్ధలకు రేటింగులు ఇవ్వడం. ఇతర ద్రవ్య వ్యాపారాలు కూడా ఆ సంస్ధ నిర్వహిస్తుంది గాని రేటింగ్ కి అది పేరు పొందింది. మంగళవారం ఒక నివేదిక వెలువరిస్తూ ఆ కంపెనీ మోడీ హామీ ఇఛ్చిన సంస్కరణలు పని చేయడం మొదలయిందని పేర్కొంది. కానీ మూడీస్ దానిని నిరాకరించింది.
ఆర్ధిక సంస్కరణలను లేదా నూతన ఆర్ధిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదని…
అసలు టపాను చూడండి 347 more words