రిలయన్స్ జియో సూట్ బూట్ కి సర్కార్ -కార్టూన్


52621.png

మోడీ ప్రభుతల్వాన్ని ‘సూట్ బూట్ కి సర్కార్’ గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ సారి పార్లమెంటులో విమర్శించారు. అప్పటి నుండి రాహుల్ విమర్శను నిజం చేయడానికి ప్రధాన మంత్రి మోడీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

కోట్ల రూపాయల ఖరీదు చేసే కోటు ధరించి అమెరికా అధ్యక్షుడిని కలుసుకోవడం దగ్గరి నుండి, దాదాపు ప్రతి ముఖ్యమైన విదేశీ పర్యటనలోను పారిశ్రామికవేత్త అదానీ ని వెంట బెట్టుకు వెళ్లడం వరకు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ విమర్శ సత్యదూరం కాదని రుజువు చేశారు.

ఇప్పుడు ఏకంగా భారత దేశంలో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కొత్తగా ప్రారంభించిన రిలయన్స్ జియో కంపెనీ ప్రకటనలో ప్రత్యక్షం అయ్యారు, ప్రధాన మంత్రి. తాను అచ్చముగా సంపన్నుల మనిషినే అని మరోసారి ప్రధాని చాటారు.

ప్రధాని బొమ్మను అంబానీ  వేసుకుంటే ఆయనకేం సంబంధం? అని ఎవరన్నా అడిగితె నిస్సందేహంగా వారు ఇంకేదో గ్రహం నుండి వఛ్చినవారే అయి ఉంటారు.

భారత దేశ ప్రభుత్వ అత్యున్నత అధికారి, నేత ఒక వాణిజ్య కంపెనీ యొక్క వాణిజ్య ఉత్పత్తి ప్రకటనలో కనిపించడం అంటే  ఆ ఉత్పత్తిని ప్రధాని ఆమోదిందిస్తున్నట్లే (ఎండార్స్ చేస్తున్నట్లే) అర్ధం. ప్రధాన మంత్రి అందుకు ఆమోదించి ఉంటే గనక బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదని అధికారికంగానే నిర్దారించుకోవచ్చు.

రిలయన్స్ జియో ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ప్రభుత్వం నుండి గాని, బీజేపీ నుండి గాని ఇంతవరకు వివరణ వెలువడ లేదు. బహుశా ఏం వివరణ ఇఛ్చి వెనకేసుకు రావాలా అని తర్జభర్జనలు పడుతున్నారేమో!?

ఇక ప్రధాన మంత్రి గారు జియో సమకూర్చిన కనెక్టివిటీ ద్వారా తన మనసులోని మాటలను దేశ ప్రజలకు వెల్లడించడమే మిగిలింది గావాల్ను. ప్రధాన మంత్రి గారికే కంపెనీల లోగోలు కుట్టిన డ్రస్ లు ధరించి, ఇతర దేశాల నేతలకు మార్గం చుపిస్తారేమో, ప్రాచీన హిందూ భారతం ప్రపంచానికి మార్గం చూపినట్లుగా!?

1 thoughts on “రిలయన్స్ జియో సూట్ బూట్ కి సర్కార్ -కార్టూన్

వ్యాఖ్యానించండి