[ఈ రోజు -జూన్ 20- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “A strategic exit” కు యధాతధ అనువాదం. -విశేఖర్]
*********
సెప్టెంబర్ లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రెండో సారి పదవికి రేసులో ఉండబోవటం లేదని ప్రకటించటం ద్వారా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అంతకంతకు గుణ విహీనం గా మారుతున్న పరిస్థితుల నుండి మెరుగైన రీతిలో, గౌరవప్రదంగా బైటపడే మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆయన కొనసాగింపు పట్ల మోడి ప్రభుత్వంలో కొన్ని సెక్షన్లు అసంతృప్తిగా ఉన్న సంగతి మరింతగా స్పష్టం అవుతున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలం పొడిగింపు వేడి ఊహాగానాలకు చర్చాంశంగా నిలిచింది. రాజన్ కు వ్యతిరేకంగా తలెత్తిన ఫిర్యాదులు వివిధ రకాలు – తప్పుడు అర్థాలు లాగి నిరుపయోగం చేయటం (ఆయన ఎంపిక పదాలకు, నిజాయితీగా సాగే మాట తీరుకూ); సంపూర్ణమే ఐనా చర్చించ దగినవి (మేక్రో ఎకానమీ సూచికలు స్థిరంగా ఉన్నప్పటికీ వడ్డీ రేట్లు తగ్గించడానికి విముఖంగా ఉండటం); హాస్యాస్పదం అనడంలో ఎలాంటి సందేహం లేనట్టివి (ఇండియా పట్ల నిబద్ధత లేదన్న ఆరోపణలు). చివరి అంశంతో పాటుగా, కేంద్ర ఆర్థిక నియంత్రణ సంస్థలు అన్నింటికీ అధిపతులను వెతకటం కోసం అంటూ కేంద్ర ప్రభుత్వం సర్చ్ కమిటీని నియమించటంతో తన పదవీకాలం ముగియటానికి ఇంకా రెండున్నర నెలల గడువు ఉన్నప్పటికీ గవర్నర్ రేసు నుంచి తానుగా తప్పుకోవటానికి రాజన్ ను ప్రోద్బలించి ఉండవచ్చు. అలా చేయడం ద్వారా, రెండవ పదవీకాలం ఇవ్వటానికి కేంద్రం నిరాకరిస్తే తదనంతరం ఏర్పడగల పరిణామాల నుండి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తప్పించారు. అంతర్జాతీయ మదుపరులలో ఆయనకు విస్తారమైన విశ్వసనీయత ఉన్నది మరి! (ఆయన నిష్క్రమణ అనంతరం విదేశీ పోర్ట్ ఫోలియోలపై పడే ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి క్షీణ దశలో ఉన్న నేపథ్యంలో దేశ కరెన్సీ, ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్య నిల్వలను అత్యంత నైపుణ్యంతో నిర్వహించారని గొప్ప ప్రతిష్టను ఆయన సంపాదించుకున్నారు.
విత్త విధానంకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ అసౌకర్యం ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంగా పైకి ఎగరకపోవటానికి అదే (విత్త విధానం) కారణం అని కేంద్ర ప్రభుత్వం భావించడం నుండి ఉద్భవించింది. నెమ్మదిగా జరిగిన వడ్డీ రేట్ల తగ్గింపు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తాజాగా తలెత్తాయనీ లేదా పెరుగుతున్నాయని రాజన్ భావించిన ఫలితం, కూడా ఆ జాబితాలో ఉన్నది; కానీ ఆర్బీఐ 2015 నుండి వడ్డీ రేట్లను 1.50 పర్సెంటేజి పాయింట్లు తగ్గించినప్పటికీ ప్రైవేటు పెట్టుబడులు అవసాన దశలోనే కొనసాగాయి. రుణాలను నిత్యనూతనంగా ఉంచడం పైన ఆర్బీఐ విరుచుకుపడటంతో బ్యాంకులు చెడ్డ రుణాల కోసం మంచి డబ్బు వెచ్చించటానికి బదులుగా చెడ్డ అప్పులను బహిరంగం చేయవలసి వచ్చింది. ఫలితంగా బ్యాంకులు భారీ ఎత్తున నష్టాలను ప్రకటించక తప్పలేదు. ఘర్షణకు ఇది కూడా ఒక వనరు అయింది. రెండో విడత పదవీ కాలానికి తనను తాను తప్పించటం ద్వారా, తన కొనసాగింపు చుట్టూ రేగిన దురదృష్టకరమైన, అనాహ్లాదకరమైన రాజకీయాలకు ఆయన తెర దించారు. రాజన్ వారసుడిని ఎంపిక చేసేటప్పుడు, సెంట్రల్ బ్యాంకు తన విధి వల్లనే ద్రవ్యోల్బణం పట్ల ఆందోళన చెందుతుందని, కేంద్ర ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి; వృద్ధికి సంబంధించిన ఆకాంక్షలకు, ధరల పెరుగుదలకు సంబంధించిన ఆందోళనలకు మధ్య సమతూకం పాటించేందుకు తగిన స్వతంత్రత మరియు అధికారాలు కలిగిన గవర్నర్ దేశానికి అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి; బ్యాంకులు తిరిగి రుణాల పంపిణీ ప్రారంభించడానికి వీలుగా బ్యాంకు పుస్తకాలను సరిదిద్దే క్రమంలో దిశా నిర్దేశం చేసేందుకు సెంట్రల్ బ్యాంకు అధిపతికి స్వేచ్ఛ ఇవ్వటం తప్పనిసరి అని కూడా గుర్తించాలి. కేవలం వడ్డీ రేట్లు తగ్గించే రబ్బరు స్టాంపు వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు, రిజర్వ్ బ్యాంక్ ఇండియాకూ, ఆర్ధిక మంత్రిత్వ శాఖకు మధ్య ఆరోగ్యకరమైన ఉద్రిక్తత నెలకొంటే అదేమంత చెడ్డ విషయమూ కాదు. ఓసారి రాజన్ స్వయంగా చెప్పినట్లుగా, వారు ఇరువురు ఎల్లప్పుడూ ఒకరికొకరు అంగీకారంతో ఉంటే గనక అది ప్రజలు చాలా ఆందోళన పడవలసిన విషయమే.
[ఎడిటోరియల్ పై విశ్లేషణ తదుపరి ఆర్టికల్ లో…]
పెట్టుబడీదారీ వ్యవస్థలో జరిగేకార్యకలాపాలన్నీ పెట్టుబడీదారుల సంక్షేమంకోసమేగానీ సామాన్యప్రజల ఆర్ధికపరిస్థితిని మెరుగుపరచాలన్న ప్రధానదృష్టితోకాదన్న చేదునిజాన్ని అంగీకరిస్తే అర్.బి.ఐ గవర్నెర్ స్థానంలో ఎవరుకూర్చున్నా పెద్దగాతేడా ఉండదన్న వాస్తవం బోదపడుతుంది.ఈమాత్రందానికి రాజన్ నిష్క్రమణవలన జరిగే ప్రమాదాలు పెద్దగా ఉండవన్నదినిజం.
అయితే రాజన్ పేరు ప్రధానస్రవంతిమీడీయాలో నానడానికి ప్రధానకారణం-మోదీ అనుకూలనిర్ణయాలను పూర్తిస్థాయిలో అమలుపరచడానికి అంగీకరించకపోవడమే!
మూల గారు, మీరన్నది వాస్తవం అయినా, దేశ ఆర్దిక వ్యవస్థకు గట్టిదెబ్బ తగలకుండా చూడటంలో ఆర్ బి ఐ గవర్నరుకు ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మ అయినపుడు అలాంటి ఒక కుర్చీ ఉన్నా లేకున్నా ఒకటేగా! రఘురామ్ రాజన్ నిష్క్రమణ కొంత ప్రభావం చూపక పోదు.