యూపి ఎన్నికలు : దళిత ఓట్లు  -కార్టూన్ 


2017లో  జరిగే  యూపి ఎన్నికలలో దళితుల ఓట్లు కీలకం అవనున్నాయని పార్టీలు భావిస్తున్నాయి. దానితో దళితులను ప్రసన్నం చేసుకుని లబ్ది పొందడానికి వివిధ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి.

బిజెపి మామూలుగానే దళిత వ్యతిరేక  పార్టీ . రోహిత్ ఆత్మహత్య  దరిమిలా ఆ ముద్రను థ్రువపరుచుకుంది.

జెఎన్యూలో కొందరు బ్రాహ్మణ వాద ప్రొఫెసర్లు తయారుచేసిన డొజియర్ లో  “యూనివర్సిటీలో జాతీయ వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ దళితులు, ముస్లింలే” అని పేర్కొన్న నేపథ్యంలో బిజెపి తాను దళితులకు వ్యతిరేకం అని మరోసారి స్పష్టం చేసింది.

పార్లమెంటు లో మంత్రి స్మృతి ఇరాని గారు చేసిన సో-కాల్డ్ చరిత్రాత్మక ప్రసంగం లో ‘జెఎన్యూ దళితులు వ్యక్తం చేసిన భావాల  రీత్యా వారు  భ్రష్ట మనస్కులు’ గా  చిత్రీకరించి థన్యతనొందారు.

ప్రథాన మంత్రి మోడి గారు ఆ ప్రసంగాన్ని “సత్యమేవ జయతే” అని కీర్తించి తాను ఎటువైపో చాటారు.

ఆ విధంగా  బిజెపి  నేతల  దృష్టిలో  కడపటి వారైన  దళితుల  ఇళ్ళు  అగ్రజులైన బిజెపి నేతలకు దూర వీలులేని  కడపటి ఇళ్ళుగా మారాయి.

*********

[ఇది మొబైల్ ఫోన్ ద్వారా ప్రయోగాత్మకంగా పోస్ట్ చేసిన టపా. మొబైల్ ద్వారా టపాలు పోస్ట్ చేయొచ్చు అని వర్డ్ ప్రెస్ వాళ్ళు చెబుతారు గానీ నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. పైగా మొబైల్ లో తెలుగు టైపింగ్ కి ఉన్న పరిమితులు బోలెడు. ప్రయత్నించి చూద్దాం అనుకుని లంచ్ టైమ్ లో రాసి పోస్ట్ చేశాను. అక్షరాలు చిన్నవి కావడం (లేదా పెద్దవి చేయలేకపోవటం) తప్పించి అంతా బానే ఉందని అర్ధం అయింది. కనుక అప్పుడప్పుడూ తక్కువ నిడివి గల టపాలు ఇలా చిన్న అక్షరాలలో చూడవలసి రావచ్చు.

గమనిక: ఈ వివరణ వరకు కంప్యూటర్ ద్వారా చేర్చాను.      —-విశేఖర్]

వ్యాఖ్యానించండి