“మహారాష్ట్ర, పులగావ్ వద్ద సెంట్రల్ ఆమ్యూనిషన్ డిపోలో మంటలకు ప్రాణాలు నష్టపోవడం బాధ కలిగిస్తోంది. నా ఆలోచనలు బాధితులతో ఉన్నాయి.” అని ఒక ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు.
“గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ఆర్‌ఎం మనోహర పరికర్ ఘటనా స్ధలిని సందర్శించి పరిస్ధితిని సమీక్షించాలని కోరాను” అని మరో ట్వీట్ లో ప్రధాని పేర్కొన్నారు.
ట్విట్టర్ ద్వారా కాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ప్రకటన వెలువడినట్లుగానీ, అందినట్లుగానీ ఏ పత్రికా చెప్పలేదు. 17 మంది భద్రతా బలగాలు మరణించిన ఇలాంటి గడ్డు పరిస్ధితిలో కూడా దేశ అత్యున్నత నేత తన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడానికి ట్విట్టర్ నే ఉపయోగించడం శోచనీయం.
మన పౌరులు, మన భద్రతా బలగాలు, మనకు రక్షణ ఇచ్చే బలగాలు ప్రమాదంలో మరణిస్తే, వారికి, వారి కుటుంబాలకు సానుభూతి పలకడానికి కూడా ఇంటర్నెట్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే ట్విట్టర్ తప్ప మరో దారి దొరకలేదా?
మానవ భావోద్వేగాలను అందించడానికి కూడా బిట్లు, బైట్లను వాడవలసిందేనా? ఏదైతేనేమీ ప్రకటన చేశారు కదా అని అభిమాన గణాలు ప్రశ్నించవచ్చు.
దేశ ప్రధాన మంత్రి అధికారిక కార్యాలయం నుండి ప్రధాని సంతకతో గానీ లేదా ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతాధికారి సంతకంతో గానీ ప్రకటన వెలువడటానికీ, ట్విట్టర్ లో తన ‘బాధ’ను ‘దిగ్భ్రాంతి’ నీ, “పోస్ట్” చేయడానికీ తేడా లేదా అన్న ప్రశ్న కూడా వారు వేసుకోవాలి.
ట్విట్టర్ అన్నది ఒక కంపెనీ. ప్రజల అవసరాలను క్యాష్ చేసుకునే అమెరికా కంపెనీ. మనుషుల బాధలను, భావోద్వేగాలను వ్యక్తం చేసే ప్రక్రియలను కూడా సొమ్ము చేసుకునే కంపెనీ.
అటువంటి వేదికపై భారత ప్రధాని భావోద్వేగాలు వ్యక్తం కావటం అంటే విలువైన భావోద్వేగాలకు విలువ కట్టే అవకాశం ట్విట్టర్ కంపెనీకి ఇచ్చినట్లే అవుతుంది.
రోహిత్ ఆత్మహత్య, అఖ్లక్ హత్య, గోవింద్ పన్సారే-ఖల్బుర్గి-నరేంద్ర దభోల్కర్ ల హత్యలు, జేఎన్‌యూ విద్యార్ధులపై నల్ల కోటు గూండాల దాడులు… మున్నగు అంశాలపై ప్రధాన మంత్రి స్పందించకుండా ఉన్నందుకే సంతోషించాలి గావాల్ను!
ట్విట్టర్ అన్నది ఒక కంపెనీ. ప్రజల అవసరాలను క్యాష్ చేసుకునే అమెరికా కంపెనీ. మనుషుల బాధలను, భావోద్వేగాలను వ్యక్తం చేసే ప్రక్రియలను కూడా సొమ్ము చేసుకునే కంపెనీ.
అటువంటి వేదికపై భారత ప్రధాని భావోద్వేగాలు వ్యక్తం కావటం అంటే విలువైన భావోద్వేగాలకు విలువ కట్టే అవకాశం ట్విట్టర్ కంపెనీకి ఇచ్చినట్లే అవుతుంది.
ప్రధానికి కంపనీలను(పెట్టుబడులను) ప్రొత్సహించడం తెలుసుగానీ,(ఇదికూడా మేక్ ఇన్ ఇండియలో భాగం అనుకుంటా!) వాటికి నష్టం కలిగించే చర్యలను ఎట్టిపరిస్తితులలో చేయరు!
కేవలం పత్రిక ప్రకటన ద్వారా ఏమి వస్తుంది?అదే సోషల్ మీడీయా వలన అయితే ఉచితంగా ఎంత ప్రచారంలభిస్తుందో!