అరవిందా మోడీయా ఎవరు బెటరు?


AK vs NM

విశేషజ్ఞ గారి వ్యాఖ్య:

కాషాయం గ్యాంగుకి సోషల్ మీడియా సైట్లలో ఉన్న బలగంతో అరవింద్‌ని unpopular చేస్తున్నారేగానీ, నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో అతిపెద్ద failure మన గౌరవనీయులైన PM గారు.

ఆయనిచ్చిన వాగ్దానాల్లో ఆయన ఎన్నింటిని నిలబెట్టుకున్నరో లెక్కలేస్తే, అధికారంలోకి రాగానే తన వాగ్దానాలమీద దృష్టిసారించి వాటిని నిలుపుకున్న అరవింద్ మేరుపర్వతమంత ఎత్తున కనిపిస్తాడు (మన కాషాయ నేత పుట్టగొడుగంత ఉండొచ్చు).

అరవింద్‌కూడా రాజకీయం చేస్తున్నాడు కాదనను. మరి అంత కంటే కూటరాజకీయం PM చేస్తున్నప్పుడు సోషల్ మీడియాల్లో ఒక్క పోస్టైనా రాలదేం?

అసలు ప్రస్తుతమున్నాయన దేనిలో మెరుగు? పాతాయనలాగే మౌనముద్రదాల్చడంలోనా?

అసలు విషయాలని పక్కనబెట్టి, దేశభక్తి, గోవధ లాంటి non-issuesతో పబ్బం గడుపుకోవడంలోనా?

అసలు విషయాలను sideline చేయడానికి ప్రజల emotions రెచ్చగొట్టడంలోనా?

ప్రజలకు అర చేతిలో వైకుంఠం చూపించడంలోనా?

విమర్శించినంతనే మీదకు దూకే మూకను సోషల్ మీడియాల్లో తయారుచేసుకోవడంలోనా?

అవినీతిపరులకి చేయూతనందించడంలోనా?

(అన్నింటిలోనూ అని భావము)

వ్యాఖ్యానించండి