ఫస్ట్ పోస్ట్ పత్రిక (వెబ్ సైట్) విభిన్నంగా పరాచికాలాడింది.
కన్హయ్య ముంబై రాక మునుపే ఆయన తరపున సెల్ఫ్ గోల్ కొట్టేసుకున్న హిందూత్వ సంస్ధలు ప్రస్తుతం పత్రికలకు, ఛానెళ్లకు విందు భోజనం అయ్యాయి.
ఏప్రిల్ 23 తేదీన కన్హయ్య ముంబైలో ప్రసంగించనున్నాడు. ఆయనను రాకుండా అడ్డుకుంటామని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన వివిధ సంస్ధలలో వీర్ సేన ఒకటి. దాని నేత నిరంజన్ పాల్ ఏమన్నారంటే…
“దేశాన్ని ముక్కలు చేస్తానని బెదిరించిన కన్హయ్యా తన Ph D పూర్తి చేయడం ద్వారా డాక్టర్ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన తన రోగులకు ఎలా సేవ చేస్తాడో, రోగ నిర్ధారణ ఎలా చేస్తాడో, ఆపరేషన్లు ఎలా చేస్తాడో నాకు అంతుబట్టకుండా ఉంది.” (ఫస్ట్ పోస్ట్)
ఫస్ట్ పోస్ట్ మరింత మంది డాక్టర్ల జాబితాను ఇలా ప్రస్తావించింది.
Dr Manmohan Singh: Anaesthesiologist
Dr Mahesh Sharma: Sexologist
Dr Ratan Tata: Neurologist
Dr Shashi Tharoor: Psychiatrist
Dr Vijay Mallya: Proctologist
ఇంకా చాలా మంది ఉన్నారండోయ్! కానీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందని భావిస్తున్నాం.
ఓహ్, చెప్పాల్సింది ఇంకా ఉంది. “మా ఉద్దేశంలో ఆయన ఇండియాలో నివసించడానికి అనుమతించకూడదు” అని హిందూ గోవంశ్ రక్షా సమితి నేత వైభవ్ రౌత్ చెప్పారు.
చాలా కృతజ్ఞతలు(!) ఇప్పటికే ఇండియాను వదిలి వెళ్లిపోతున్న డాక్టర్లకు కొదవ లేనట్లు.
–