షేమ్ ఆన్ యూ! మోడిపై మల్లిక ఆగ్రహం


ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని గుజరాత్ నాట్యకళావేత్త మల్లిక సారాభాయ్ మరోసారి తీవ్రంగా విమర్శించారు. ‘పద్మ విభూషణ్’ గ్రహీత అయిన తన తల్లి మరణిస్తే సానుభూతిగా ఒక్క మాట కూడా చెప్పలేని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిగ్గు పడాలని ఆమె విమర్శించారు.

గుజరాత్ మత మారణకాండ విషయంలో మొదటిసారి స్పందిస్తూ గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ దాఖలు చేసిన వ్యక్తి మల్లిక సారాభాయ్. భారత దేశం అంతరిక్ష పరిశోధనలకు నేతృత్వం వహించిన మొదటి నేత విక్రమ్ సారాభాయ్, బహు రీతుల నాట్యాలను ఆపోసన పట్టి కీర్తి పొందిన మృణాళిని సారాభాయ్ ల కుమార్తెయే మల్లిక సారాభాయ్.

మృణాళిని సారాభాయ్ వయసు 97 సంవత్సరాలు. ఇన్ఫెక్షన్ సోకడంతో నిన్న ఆసుపత్రిలో చేరిన మృణాళిని ఈ రోజు, జనవరి 22 తేదీన చనిపోయారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతిగాంచిన మృణాళిని భరత నాట్యం, కధాకళి, మోహినీయట్టం నాట్యకళారీతులను అపోసన పట్టారు. విశ్వకవి రవీంద్ర నాధ్ శిష్యరికంలో శాంతినికేతన్ లో విద్య అభ్యసించారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆద్యుడైన విక్రమ్ సారాభాయ్ ను పెళ్లాడారు.

శాస్త్రీయ నృత్యంలో మేటిగా వెలుగొందడమే కాకుండా ఆమె స్వయంగా కవి, రచయిత, పర్యావరణవాది. అహ్మదాబాద్ లోని సామాజిక, కళా రంగాల్లో ప్రఖ్యాతి గాంచారు. సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన మొట్టమొదటి శాస్త్రీయ నృత్యకారిణిగా కూడా మృణాళిని పేరు గాంచారు. ఆమె కొడుకు పేరు కార్తికేయ్ కాగా కూతురు మల్లిక సారాభాయ్. పర్యావరణ ప్రియురాలిగా ఆమె సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ సంస్ధను స్ధాపించారామె.

ఇన్ని విధాలుగా ప్రసిద్ధి చెందిన మృణాళిని మరణం పట్ల బాధ్యత గల ప్రధాన మంత్రి అయినా సంతాపం ప్రకటించి ఆమె కుటుంబ సభ్యులకు మార్యాదకైనా సానుభూతి ప్రకటిస్తారు. కానీ ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడి ఆ పని చేయలేదు. మోడి ‘మైండ్ సెట్’ ఎలాంటిదో తెలియడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని ఆమె ఎత్తిపొడిచారు.

“ప్రియమైన ప్రధాన మంత్రి గారూ, నేను మీ రాజకీయాలను ద్వేషిస్తాను. మీరు నా రాజకీయాలను ద్వేషిస్తారు. అరవైయేళ్లుగా ఈ దేశ సంస్కృతిని ప్రపంచ వేదికలపైకి తీసుకెళ్లడానికి కృషి చేసిన మృణాళిని సారాభాయ్ కు వీటన్నింటితో సంబంధం లేదు.

“మన సంస్కృతి జాడలను పసిగట్టేలా ఆమె ప్రపంచానికి దివ్వెను వెలిగించారు. అలాంటి వ్యక్తి మరణం మీ నోటి నుండి ఒక్క మాట కూడా పలికించలేకపోవడం బట్టి మీ మనస్తత్వం (మెంటాలిటీ) ఏమిటో అర్ధమవుతోంది. మీరు నన్ను ఎంత ద్వేషించినా గాని మా ప్రధాన మంత్రిగా ఆమె సేవలను గుర్తించడం మీ బాధ్యత. కానీ మీరు అలా చేయలేదు. షేమ్ ఆన్ యూ!” అని మల్లిక ట్విట్టర్ లో ప్రధానిని తిట్టిపోశారు.

గుజరాత్ మతకల్లోలాల బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మల్లిక ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ దాఖలు చేయగా అప్పటి మోడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై కక్ష గట్టి దొంగ కేసులు బనాయించింది. ఘనతర భారత సంస్కృతి అంటూ  గొప్పలు పోయే మోడి ఆ సంస్కృతిలో భాగమైన భారతీయ నాట్య సాంప్రదాయాలను పశ్చిమ దేశాలకు పరిచయం చేస్తూ మల్లిక తన శిష్య బృందాలతో విదేశాలు పర్యటించడాన్ని “మానవ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) గా ఆరోపిస్తూ కేసు మోపారు.

భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల హిందూత్వకు వాస్తవంగా పట్టింపు, గౌరవం లేదనేందుకు మల్లిక ఒక సజీవ ఉదాహరణ!

 

One thought on “షేమ్ ఆన్ యూ! మోడిపై మల్లిక ఆగ్రహం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s