రోహిత్ వేముల దళితుడు కాదా?


యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో సస్పెన్షన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కులం గురించి ఈ నాలుగు రోజుల్లోనే అనేక కాకమ్మ కధలు ప్రచారంలో పెట్టారు. అనేక ఆడియోలు, వీడియోలు (డాక్టర్డ్) ప్రదర్శించారు.

ఈ పుకార్లు, కధలు, వీడియోలు ప్రచారం చేసిపెట్టడంలో ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న వార్తా ఛానెళ్లు, ముఖ్యంగా ఆంగ్ల వార్తా ఛానెళ్లు తలమునకలుగా సహకరించాయి.

రోహిత్ ఆత్మహత్య దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దళితుడు కావడం వల్లనే విద్యార్ధి ఉద్యమ చరిత్రలో పెను సంచలనం నమోదయింది.

నిజానికి దళితుడు తల ఎత్తడం మొదటి నుండి ఈ దేశంలో సంచలనమే. వారిపై రుద్దిన అనర్హతలన్నీ స్వాభావికం కావనీ, వ్యవస్ధను శాసిస్తున్న కులాధిపత్య శక్తులు రుద్దినవి  మాత్రమేనని రుజువు చేసే కృషిలో వారు తల ఎత్తడమే సంచలనం. తపస్సు చేసిన శంభూకుడు, విలువిద్య నేర్చిన ఏకలవ్యుడు, రాజును ఇష్టపడిన శూర్పణఖ, ఆధిపత్యాన్ని నిలదీసిన కంచికచర్ల కొటేశు, కారంచేడు, నీరు కొండ, చుండూరు…. ఆదియే గాని అంతం లేదు.

ఈ రోజు రోహిత్ వేముల నుండి దళిత కోణాన్ని దూరం చేసేందుకు కూడా నడుం బిగించారు.

రోహిత్ వేముల దళితుడు కాదని వారి వాదన. దళితుడు కాదని రుజువు చేస్తే సగం సమస్య పరిష్కారం అయినట్లే.

కింది శ్రమలు చేయడానికి, దోపిడీలను పోషించడానికి వాళ్ళు దర్జాగా బతకడానికి… ఇన్ని అణచివేతలు కొనసాగించడానికి దళితులు ఉండాలి. కానీ వారి కులాహంకార మకిలితనాన్ని నిలదీసే చోట దళితుల నుండి దళితతనం దూరం కావాలి.

మేసేటప్పుడు చేలో ఉండాలి; దున్నేటప్పుడు గట్టు మీద సేద తీరాలి.

కాబట్టి రోహిత్ నుండి దళితతనం దూరం కావాలి. వాడు దళితుడు కావడం వల్లే కదా ఈ రోజు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది!

ఎక్కడెక్కడి నుండో సర్టిఫికెట్లు తెచ్చి ఫేస్ బుక్ లో, వాట్సప్ లో, ట్విట్టర్ లో, వార్తా పత్రికల వెబ్ సైట్లలో ప్రచురించి ఆయన దళితుడు కాదని చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు.

వాటిలో ముఖ్యమైనవి రెండు. ఒకటి రోహిత్ తల్లికి చెందిన కుల ధృవీకరణ పత్రం, రెండవది రోహిత్ కే చెందిన కుల ధృవీకరణ పత్రం. వాటిని కింద చూడవచ్చు.

మొదటిది రోహిత్ తల్లి రాధిక తన రెండో కుమారుడి కులాన్ని చెబుతూ ఇచ్చిన డిక్లరేషన్. రెండవది రోహిత్ కుల ధృవీకరణ పత్రం.

రోహిత్ దళిత్ కాదని రుజువు చేసేందుకు మొదటి పత్రాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. రోహిత్ మాల కులానికి చెందినవాడని ప్రకటిస్తూ రెవిన్యూ అధికారులు ఇచ్చిన పత్రాన్ని దాచిపెట్టారు. అది కూడా బైటికి వచ్చాక అది దొంగ సర్టిఫికేట్ అన్న అనుమానాలు కూడా వ్యాప్తి చేశారు.

వాస్తవం ఏమిటి? ఏమిటంటే ఈ రెండు పత్రాలూ నిజమైనవే. ఏదీ బూటకం కాదు.

రోహిత్, రాధికకు మొదటి సంతానం. ఆమె భర్త ఆమె, ఆమె ఇద్దరు కుమారులను (మూడో బిడ్డ కడుపులో ఉండగా) వారి మానాన వారిని వదిలి పెట్టేశాడు. ఆ తండ్రిది వడ్డెర కులం.

తల్లి, తండ్రి ఇద్దరి కులాల్లో ఎవరి కులాన్నైనా తమదిగా చెప్పుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. ఆ అవకాశంతోనే రోహిత్ తల్లి కులాన్ని ఎంచుకున్నాడు. అతని తమ్ముడికి వడ్డెర కులాన్ని ఇవ్వడంలో ఆమె ఉద్దేశ్యం ఏమిటన్నది మనకు అనవసరం.

తాను మాల కులస్ధురాలిని అని చెబుతూ రోహిత్ తల్లి చెబుతున్న సాక్ష్యం కింది వీడియోలో చూడవచ్చు. దుర్మార్గ ప్రచారాలకు ప్రభావితమే పలువురు విలేఖరులు ఆమెను అసలు విషయం అడిగారు. న్యూస్ మినిట్ వెబ్ సైట్ వాళ్ళు ఈ వీడియో రికార్డ్ చేసి నెట్ లో పెట్టారు.

కనుక రోహిత్ దళితుడే అనడంలో అనుమానాలు అనవసరం.

ఇంకా కావాలంటే రోహిత్ కుటుంబ పరిస్ధితి ఏమిటో తెలియజెప్పే కింది ఫోటోలు చూడవచ్చు. అవి చూస్తే అతని దళితతనంపై అనుమానాలు మాయం కావచ్చు. వీటిని రోహిత్ తన ఫేస్ బుక్ పేజీలో ‘మై హోమ్’ శీర్షికతో పబ్లిష్ చేశారు.

 

2 thoughts on “రోహిత్ వేముల దళితుడు కాదా?

  1. Rohit dalithudu kavadam vallane intha godava jaruguthunnadi. assalu dalithudu kakunda vidyarthi aatmahatya ayithe evariki pattadhu.

    Viswa vidyalayallo rajakiya vishanagulanu penchi poshinchi, vidya vyavastha ni sarva nashanam chestunnaru.
    Dalithudu kante kuda oka vidyarthi atamahathya ga bhavinchi varthakathanalanu mirana rasthe baguntundi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s