1991లో పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల నేతృత్వంలోని భారత ప్రభుత్వం నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టిన దరిమిలా ‘కరెన్సీ కన్వర్టిబిలిటీ’ అనే పదబంధం ఇక్కడ వాడుకలోకి వచ్చింది. అంతకు ముందూ ఉన్నప్పటికీ ఆర్ధికవేత్తల చర్చల వరకే పరిమితమై ఉండేది.
ఇప్పుడు అందరికీ తెలుసని కాదు గానీ, అప్పటికంటే ఇప్పుడు ఈ పదబంధ వినియోగం పెరిగింది. ప్రభుత్వ విధానాలలో ఒక అంశంగానూ, విధానంగానూ మారడంతో పత్రికలు సైతం చర్చించడం ప్రారంభించాయి. ప్రాంతీయ భాషా పత్రికలు కూడా ఒకటీ అరా వార్తలూ, విశ్లేషణలు ప్రచురిస్తూ ఉన్నాయి.
దేశ ఆర్ధిక వ్యవస్ధను అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధకు (అమెరికా, ఐరోపాల ఆధిపత్య వ్యవస్ధకు అని చదువుకోగలరు) కట్టివేయడం తీవ్రం అవుతున్న కొద్దీ దేశ ఆర్ధిక వ్యవస్ధను నడిపించే వివిధ ఆర్ధికాంశాలు ప్రాధాన్యతను కోల్పోతాయి. దేశీయ అంశాల ప్రాధాన్యత స్ధానంలో విదేశీ ఆర్ధికాంశాలు ప్రవేశించి పెత్తనం చేస్తాయి.
దేశీయ కరెన్సీ చెల్లుబాటు తగ్గించి విదేశీ మారకద్రవ్యం చెల్లుబాటును తీవ్రం చేసే ఎత్తుగడలో భాగంగా ‘కరెన్సీ కన్వర్టిబిలిటీ’ కి సంబంధించిన డిమాండ్లను విదేశీ బహుళజాతి సంస్ధలు ముందుకు తెస్తాయి. రూపాయిని మార్కెట్ గిరాకీకి అనుగుణంగా చిత్తానుసారం హెచ్చు తగ్గులకు లోనయ్యేలా అవకాశం కల్పించాలని ‘ఫుల్ కన్వర్టిబిలిటీ’ డిమాండ్ ద్వారా విదేశీ కంపెనీలు కోరుతున్నాయి.
ఈ అంశాన్ని ఈ రోజు ఈనాడు పత్రికలోని చదువు పేజీ ఆర్టికల్ చర్చించింది.
ఆర్టికల్ ను ఈనాడు వెబ్ సైట్ లో చేసేందుకు కింది లంకెలోకి వెళ్ళండి.
ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ గా చూడాలనుకుంటే కింది బొమ్మను క్లిక్ చేయగలరు. రైట్ క్లిక్ చేసి పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఆర్టికల్ సూక్ష్మంలో మోక్షంలాంటి ధర్మ సూక్ష్మాన్ని అందించింది, మేం గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ రాజకీయనాయకులు చేసే ప్రచారాలు మాత్రమే ఓటరుకు తెలుస్తాయే తప్ప వాళ్ళు ఒకసారి ఎన్నికై power చేతికొచ్చాక ఎవరి ప్రలోభానికైనా లొంగి ‘తప్పుటడుగు’ వేస్తే ఇది తప్పు అని అడిగేందుకు ఇలాంటి విషయాలపట్ల చదువుకున్న వాళ్ళకి కూడా అవగాహన సరిపోదు.
మమ్మల్ని aware చేస్తున్నందలకు తెలుగువార్తలకు కృతజ్ఞతలు
ఎంచేతనంటే మొన్నటి భీమా బిల్లు పోస్టులో
“2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం బారిన పూర్తిగా పడకుండా దేశాన్ని కాపాడిన భారత ద్రవ్య సంస్ధలను సదరు సంక్షోభానికి కారణం అయిన కంపెనీలకే అప్పగించడం” వంటి దుశ్చర్యలకు (అటు ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వం కలిసి) పాల్పడుతున్న అడగలేని స్థితి, ప్రతిసారీ అన్నాహజారే లాగా ఎవరో ఒకరు ఉద్యమం చేయలేం కదా, అసలు చేయాలంటే ఆ విషయం పై అవగాహన వుండాలి కదా.
ఎప్పుడో మేం పుట్టనప్పుడు చైనాతో నెహ్రూ చేసిన పంచశీల సూత్రాలు పాఠంగా పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ మొన్నీమధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు జరిగిన అణుఒప్పందంలో అంశాలు చూచాయిగా కూడా తెలియని పరిస్థితి.
పత్రికలు, మీ తెలుగువార్తలు లాంటివి కూడాను కలకాలం వుండేందుకు scope ఎప్పుడూ వుంటుంది, ఎంచేతనంటే
టీవీల్లో ఇంతటి సుధీర్ఘ చర్చ, లోతైన విమర్శ మనకు అందదు, వాటి వల్ల మనం (ప్రేక్షకులం) తెలుసుకోలేం కూడా.
రెండు సంవత్సరాలనుంచి చూస్తున్నవారంలో కనీసం రెండు సార్లు breaking news “శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత, ఫలనా దేశం నుంచి వచ్చిన ఫలనా వ్యక్తి ఫలానా కేజీల బంగారంతో ఎక్సైజ్ అధికారలకు చిక్కాడు” అని చెప్తారు.
ఒక్క నా….. (beep sound) కూడా అసలు ఎందుకు ఇలా బంగారం తెస్తున్నారు? దీని వెనుక కారణం ఏంటీ?
బంగారం ఇక్కడ ప్రియం, అక్కడ చౌక ఎలా అయ్యింది? మనం కొన్న బంగారం మనం తెచ్చుకునేందుకు ఎందుకు వద్దంటున్నారు? అసలు అది నేరం ఎలా అయ్యింది? ఇలాంటి విషయాలు ఒక్క ఛానెల్లోను రాదు.
క్షమించండి, ఇంత సుదీర్ఘ కామెంట్ కి కారణం ఏమంటే జరుగుతున్న ఘటనలని తెలుసుకుంటే/తెలిపితే సరిపోదు
వాటి మూలాలు, సమస్యలు, పరిష్కారాలు, లోటుపాట్లు అందించినప్పుడే వార్తకు సమగ్రత చేరుతుందనే విషయాన్ని ఈ తెలుగు మాధ్యమాలు ఎందుకు గుర్తించడం లేదనే చిన్న ఆవేదన,…
Sir good and service tax gurinch oka manchi article rayaruuuuu???
శేఖర్ గారు విలువైన వ్యాసం…ఈ తరహా వ్యాసం ఈనాడులో రావడం నాకైతే ఆశ్చర్యమే… అసలు సంగతికొస్తే ఎందుకో….ఏమో గారి ఆవేశం నిజంగా అవసరమైనదే…
ఎందుకో ఏమో గారు, మంచి పరి శీలన. ఇలాంటి వార్తలన్ని భీఫ్ సౌండ్ లోనే ముగిసి పోతూ ఉంటాయి. వార్త విశ్లేషణ అనేది ఎవరికిపట్టింది? సామాన్యులుకు తెలియ చెప్పటానికి. అలా తెలియ చెప్పితే అందరూ తెలిసి న వారవ్వరూ. అలా తెలియటం వల్ల ప్రజా స్వామ్యానికి హాని సుమా?
అవును తిరుపాలు గారు. జనానికి అన్ని తెలిస్తే పప్పులు ఉడకవనే దోపిడి దారులు వేదాల నుంచి ఇప్పటిదాకా అన్ని దాస్తున్నారు.