ఎట్టకేలకు నితీష్ కుమార్ కి కోరుకున్న కుర్చీ దక్కింది. పెద్ద త్యాగమూర్తి లాగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన తరపున ఒక దిష్టి బొమ్మను నిలబెట్టి ఆనక ఆ దిష్టి బొమ్మను దింపి అటు పదవీ త్యాగ ప్రతిష్టను సంపాదించవచ్చని, ఇటు పదవీ వియోగ దుఃఖాన్ని తప్పించవచ్చని భావించిన నితీష్ కుమార్ కి అనుకున్నది ఎలాగో దక్కించుకునే సరికి తాతలు దిగి వచ్చారు.
ముఖ్యమంత్రి కుర్చీ ఆటను పిల్లాడి ఆటగా మార్చి వేసి చివరికి మళ్ళీ ఆ కుర్చీ పొందడానికి నితీష్ నానా పాట్లు పడ్డారని కార్టూన్ సూచిస్తోంది. ఆయన పాట్ల సంగతేమో గానీ బీహార్ రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యేయం అని ఆయన చెప్పుకునే గొప్పల్లో పస కాస్త కూడా లేదని ఈ కుర్చీ ఆట తేల్చేసింది.
ఆడుతూ పాడుతూ త్యాగరాజు కీర్తి సంపాదించాలన్న నితీష్ పధకాన్ని పారకుండా అడ్డం వచ్చిన ఘనత మంఝికి దక్కుతుంది. అదే సమయంలో బి.జె.పి ఎత్తుగడల్లో పావుగా మారి తన సొంత రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్న ఘనత కూడా ఆయనదే. ఇప్పుడు ఆయన మహా దళిత నాయకుడిగా ప్రతిష్ట పొందారని పత్రికలు చెబుతున్నాయి. కానీ తద్వారా ఆయన మరోసారి ఎం.ఎల్.ఎ పదవి దక్కించుకోవడం తప్ప మంత్రి పదవి పొందలేరు. ఒకవేళ బి.జె.పి లో చేరి మంత్రి పదవికి ప్రయత్నిస్తే పరువు త్యాగం చేయాల్సిందే.
దిష్టి బొమ్మల్ని నిలబెట్టడం మన రాజకీయాల్లో కొత్త కాదు. మన రాష్ట్రంలోనే ఒక గ్రామ పంచాయితీని దళితులకి రిజర్వ్ చేస్తే, అక్షరం ముక్క రాని స్వీపర్‌ని సర్పంచ్ పదవిలో కూర్చోబెట్టారు. ఆమె పేరుకి సర్పంచ్ అయినా నిర్ణయాలన్నీ గ్రామ పెద్దలే తీసుకునేవాళ్ళు.
సర్పంచ్ లే కాదండి……రాష్ట్రపతి పదవీ అందుకు మినహాయింపపు కాదు…..,గత ప్రధాని సంగతి అందరికీ తెలుసుకదా….
మన్మోహన్ సింగ్ దళితుడు కాదు. సొనియాకి ఇందియా పౌరసత్వం లేదు కనుక ఆమె ప్రధాన మంత్రి అవ్వడానికి అవ్వదు అని మన్మోహన్‌ని తోలు బొమ్మలా కూర్చోబెట్టారు.
దళితులకి రిజర్వేషన్లు అయితే ఇస్తారు కానీ రాజ్యాధికారం మాత్రం ఇవ్వరు.