అమెరికా అధ్యక్షుడు బారక్ బారక్ ఒబామా, ఇండియాలో కుంచించుకుపోతున్న మత సామరస్యం గురించి తొమ్మిది రోజుల వ్యవధిలో రెండుసార్లు వరుసగా ప్రకటనలు గుప్పించడంపై ఇండియాలో కాస్త తత్తరపాటును సృష్టించింది. మొదటి సారి జనవరి 27 తేదీన తన భారత సందర్శనను ముగిస్తూ మత ప్రాతిపదికన లోలోపల విభజనకు గురైన దేశాలు ఎన్నటికీ ప్రగతి సాధించలేవన్న అంశాన్ని ఒబామా నొక్కి చెప్పారు; రెండోసారి ఫిబ్రవరి 5 తేదీన మాట్లాడుతూ ఆయన భారత దేశం నుండి వెలువడుతున్న మత అసహనం గురించిన వార్తలను వింటే మహాత్మా గాంధీ దిగ్భ్రాంతికి లోనై ఉండేవారని వ్యాఖ్యానించారు. అద్యక్షుని మాటలు ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించినవి కావని తదనంతరం శ్వేత భవనం వివరణ ఇచ్చినప్పటికీ ఆ మాటలు నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని అవమానానికి గురి చేశాయి.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ, మతపరమైన అసహనంతో కూడిన చర్యల పట్ల మోడి ప్రభుత్వం క్రియా రాహిత్యంపై విమర్శలు గుప్పించగా, విశ్వ హిందూ పరిషత్ లాంటి అతివాద హిందూత్వ గ్రూపులు ఒబామా వ్యాఖ్యలలో ఒక విధమైన అవాంఛనీయ జోక్యాన్ని చూశాయి. మోడి గమనాన్ని రెండు ప్రధాన అంశాల -మొదటిది రాజ్యాంగం, రెండవది గాంధీ భావజాలం- నడిపించాయని ఒబామా పదే పదే ప్రకటించడం ఒక ఆసక్తికర విషయం. పరిశుభ్రత దగ్గర్నుండి (ప్రపంచం లోని భారత సంతతి ప్రజల వరకు గాంధీ ఆదర్శాలను గుర్తుకు తెచ్చే మోడి మత సామరస్యం విషయానికి వచ్చేసరికి మొఖం చాటేయడం కూడా ఆసక్తికరమైన విషయమే.
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించినట్లుగా -“భారత దేశం యొక్క సహనంతో కూడిన గొప్ప సాంస్కృతిక చరిత్రను ఎటువంటి అభాసలూ మార్చలేవన్న పరిశీలన చక్కటి విలువతో కూడినదే. కానీ అలాంటి గొప్ప అర్ధంతో కూడిన ప్రకటనలు తమంతట తాముగా చెల్లుబాటు కాబోవు. అనేకమంది భారతీయులకు మల్లె జైట్లీ గర్వించే సహనపూరిత సంప్రదాయాలు దాడులకు గురవుతూ బలహీనపడడమే ఆందోళనకరం. స్వేచ్చలు, విలువలు కలకాలం కొనసాగాలంటే అవి పోషింపబడాలి. ఈ కారణం చేతనే పదే పదే వెలువడుతున్న చర్చిల విధ్వంస వార్తల పట్లా, మత మైనారిటీలు బెదిరింపులకు గురవుతున్న వార్తల పట్లా మోడి పాటిస్తున్న మౌనం ఆందోళన చెందవలసిన అంశంగా ఉన్నది. ద న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ప్రచురించిన సంపాదకీయం కూడా ఈ అంశాన్నే ప్రతిబింబించింది. ఇంకా కష్టం కలిగించే సంగతి ఏమిటంటే మోడి ఏ భావజాల ప్రపంచానికి అనుబంధంగా ఉంటూ వచ్చారో దానికి చెందిన గ్రూపులే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం.
ఇలా చెప్పడం అంటే, ఇతర నమ్మకాల ప్రోద్బలంతో చెలరేగే హింసలను పట్టించుకోకపోవడం కాదు. ఇక్కడ ప్రశ్న దేని గురించి అంటే రాజ్యాన్ని నియంత్రణలో ఉంచుకున్న రాజకీయ అధికారంతో అసహన శక్తులకు ఉన్న సంబంధాల గురించి. వివాదాస్పద అంశాల కారణంగా తన ఆర్ధిక ఎజెండానుండి తనను పక్కకు మళ్లించడం తనకు ఇష్టం లేదని మోడి తన పార్టీ సహచరులకు చెప్పారు. ఆర్ధిక వృద్ధికి సహనం అత్యవసరమే అయినా, దానిని వృద్ధికి పనికివచ్చే పరికరం స్ధాయికి కుదించడానికి వీలు లేదు. వైవిధ్యమైన మత మరియు సాంస్కృతిక సాంప్రదాయాలు పరస్పరం సదవగాహనతో కలిసి మెలిసి ఉండడం అన్నది దానికదే అంతిమం. భారత రాజ్యాంగంలో నిర్ధిష్టమైన మౌలిక స్వేచ్చలు, హక్కులు పొందుపరచబడ్డాయి. ఈ హక్కులను స్వేచ్చలను ఉనికిలో ఉన్న ప్రభుత్వం సంరక్షించవలసిన రాజ్యాంగ విధి ప్రభుత్వంపై ఉంటుంది. ఒక ప్రభుత్వం న్యాయబద్ధంగా మసులుకోవడమే కాదు, అలా ఉన్నట్లు కనిపించాలి కూడా. రాజ్యాంగ విలువల రక్షణలో కరకుగా వ్యవహరించాలి.
ప్రపంచ పెత్తందార్ల వ్యాపార గుత్తాధిపత్యానికి రాజకీయ పెత్తనం అవసరం. అదీ బాధ్యత లేని పెత్తనం. అందుకు జాతి దేశాలు అలాగే ఉండాలి. అవి నియంతృత్వ పాలన చేసుకున్నా, అంతర్యుద్ధాలతో కొట్టుకు చచ్చినా ప్రజాస్వామ్యం అత్యు త్తమనే ఉత్తుత్తి కబుర్లు చెప్పాలి. ఆపని అమెరికా చేసిపెట్టాలి. దురదృష్టవశాత్తూ వారి పౌరులలో అధిక సంఖ్యాకులది క్రైస్తవ మతం. భారతదేశంలో మతం చిచ్చు రగిలించి కర్రలనూ, ఓట్లనూ పోగుచేసుకోవాలన్న గుంపుకి ఈసారి ఓట్లు దక్కాయి. కర్రలు సంఖ్య పెరగాలంటే ఉన్న కర్రలు లేని తగవులు కల్పించాలి. ఉన్న తగవులు రెచ్చకొట్టాలి. ప్రభుత్వంలో తమవాడున్నాడన్న ఉద్రేకంలో ఉన్న కర్రలు ప్రస్తుతం పట్టలేకుండా ఉన్నాయి. వారి ఉద్రేకం రెచ్చగొట్టబడుతున్న పులిలాంటిది. ఆ ఉద్రేకానికి హిందూమతం కాకపోటమే గురి. ఆ గురి ముస్లిం మీదకి మాత్రమేనిలపాలన్నది ఆ ఉద్రేకపు పధక రచయితల లక్ష్యం. దురదృష్టవశాత్తూ వారి ఆలోచనలు అలా ఉన్నా, మతవ్యాప్తిలో చురుకుగా ఉన్నది క్రైస్తవం. కనక ఆ ఉద్రేకం అమలుజరిపేవారి పిడికిలి సహజంగానే వారిమీదకే లేస్తుంది. అమెరికా పెద్దాయనది దానిపై ప్రతిస్పందనే గాని, మతసహనం పట్ల వారికున్న ఆదర్శయుత లక్ష్యం, బాధ్యతా కాదు. వ్యాపారులకి ఏ మతస్తులూ శత్రువులు కారు. కాని వ్యాపారం మూడు పువ్వులూ ఆరుకాయలూ కావాలంటే రాజకీయీలలో ఒక బూచి కావాలి. అది ప్రస్తుతం ఇస్లాం. భారతదేశానికి ఉన్న ఒక గుడ్డిలో మెల్ల ఆ ఉద్రేకానికి ప్రస్తుతం గురి క్రైస్తవం కావటం, ప్రపంచ రాజకీయ పెద్దలు క్రైస్తవ మతస్తులని అసంతృప్తి పరచి అధికారానికి ఇబ్బంది కలిగించలేకపోవటం.